19, మే 2012, శనివారం

సమస్యాపూరణం - 709 (నాలుగైదు కలుప)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

నాలుగైదు కలుప నలువదయ్యె.

ఈ సమస్యను పంపిన
విష్ణునందన్ గారికి
ధన్యవాదాలు.


25 కామెంట్‌లు:

  1. చి. డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు,
    అన్నయ్య లా పద్యాలు వ్రాసేయనూ -- కాదు. ఏదో ఒకనాటికి అన్నయ్యను మించి వ్రాస్తావని మా ఆకామ్ష - అలాగే శుభాశీస్సులు. కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం. విజయోస్తు. స్వస్తి

    రిప్లయితొలగించండి
  2. ముందు వ్రాసితి కద ముప్పదియొక్కటి
    నాలు గైదు కలుప నలువదయ్యె
    నంత భక్తితో సమర్పించితిని స్వామి
    పాద పద్మములకు పద్యమాల

    రిప్లయితొలగించండి
  3. ముదము తోడ వ్రాసి ముప్పదియారును
    కోరి ముప్పదైదు వేరుగాను
    వరుస మారకుండ వాటితో నటుపైన
    నాలుగైదు కలుప నలువదయ్యె.

    రిప్లయితొలగించండి
  4. ఋణము నొసగు నపుడు ఋజువర్తనము లేక
    నాలు గైదు కలుప నలువ దయ్యె !
    పుచ్చుకొన్న వాఁడు మొఱఁగుల మెఱయంగ
    సూనృతంబు నచట సున్న యయ్యె !!

    మొఱగు = వంచన

    రిప్లయితొలగించండి
  5. అన్నయ్య గారికి నమస్సులు. మీ ఆశీస్సులకు ధన్యవాదములు. మీ వంటి పూజ్యనీయులు , పెద్దలు , మిత్రుల పరిచయము నదృష్టముగా పరిగణిస్తాను. చాలా యేళ్ళు తెలుగు భాషకు దూరముగా నుండి యీ వయస్సులో పద్యాలు వ్రాయ గలగడము గాయత్రీ మాత వరముగా పరిగణిస్తాను. నా కిష్టమయిన తెలుగు సాహిత్యానికి దగ్గరయ్యాను. అదే నా అదృష్టము. పిన్నతరము వారికి ' వృధ్ధి ' ని ఆకాంక్షిద్దాము.
    మరో పర్యాయము మీకు పాదాభివందనములు.

    రిప్లయితొలగించండి
  6. ఒకటి రెండు కలిపి నికరము గన మూడు.
    నాలుగైదు కలిపి యరయ తొమ్ది.
    ముప్పది యొకటికి ముచ్చటతో మీరు
    నాలుగైదు కలుప నలువదయ్యె.

    రిప్లయితొలగించండి
  7. ఈ సమస్యకొక నేపథ్యముంది.శతావధాని, పాణ్యం సోదరకవులలో ఒకరైన పాణ్యం నరసరామయ్య గారు ఈ సమస్యను మా నాన్నగారికి వారు తొమ్మిదో తరగతి చదివే రోజుల్లో ఇచ్చారట.

    అప్పటి వారి పూరణ :

    పలక జేతబూని బలపంబు గైకొని
    పాఠశాలకేగి బాలుడొకడు
    ముప్పదొకటి మీద మురిపెంబుగా దాను
    నాలుగైదు కలుప నలువదయ్యె !!!

    రిప్లయితొలగించండి
  8. గురువు గారికి నమస్కారములతో
    టైప్ జేయుటకు కష్ట పడుతున్నాను గురువు గారు
    ---------
    పచ్చ నోట్ల తోడ, పాపకర్మలు నేడు
    నాలుగైదు కలుప నలువదయ్యె,
    వాపు బలుపు బెరుగ వగరు బోతు జనులు
    సాము జేయు వారు చావు కోరి |

    రిప్లయితొలగించండి
  9. శకుని జూద మాడ సారంగ నగరిలో
    నాలు గైదు కలుప నలువ దయ్యె
    ధృతిని దప్పి యపుడు ధృతరాష్ట్ర సభ లోన
    చింత వడరె పిదప శిష్ట తతియు

    రిప్లయితొలగించండి
  10. తొమ్మిదెట్లు వచ్చె తోయజాక్షి యిచట?
    సృష్టి చేయు గొప్ప సిద్ధెవరిది?
    చెప్పినట్టి వారి చెలిమియె గొప్పగు,
    నాలుగైదు కలుప ; నలువదయ్యె.

    రిప్లయితొలగించండి
  11. కోరి వ్రాసినాఁడఁ దారావళి మొదట
    రక్తి నొసఁగితి నవరత్నమాల
    ముక్తకము లిఖించి ముదమొప్పఁ బద్యముల్
    నాలుగైదు కలుప నలువదయ్యె.

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని వారూ,
    మిత్రులు నరసింహ మూర్తి గారిని ఆశీర్వదించి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు.
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    36+4, 35+5 ఫార్ములాతో మీ పూరణ అనితర సాధ్యమై అలరిస్తున్నది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ చాలా బాగున్నాయి. అభినందనలు.
    నేమాని వారి ఆశీస్సులు పొందిన మీరు ధన్యులు!
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    బహుకాలానికి మీ రాకతో నా బ్లాగుకు ధన్యత చేకూరింది. ధన్యవాదాలు.
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    డా. విష్ణునందన్ గారూ,
    తొమ్మిదవ తరగతి విద్యార్థిగా మీ నాన్న గారు ఇంత చక్కని పూరణ చేసారని తెలిసి సంభ్రమాశ్చర్యాలను పొందాను. చాలా సంతోషం. ధన్యవాదాలు.
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ప్రశ్నోత్తరాల రూపంలో మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. గురువు గారు,
    ధన్యవాదాలండి.
    ఈ రోజు మీ పూరణ సర్వోత్తమంగా ఉంది. అందమైన పూరణ.

    రిప్లయితొలగించండి
  14. నాలు గైదు లనగ మరువము యిరువది
    ఐదు నాల్గు లన్న యిరువ దౌను
    ఇరువ దిరువ దైన వెఱగేమి కలుపంగ
    నాలు గైదు కలుప నలువ దయ్యె !

    రిప్లయితొలగించండి
  15. శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు ‘అవధానాల’ గురించిన ఒక చక్కని వ్యాసాన్ని గురించి లింక్ ఇచ్చారు. అందరూ తప్పక చదవవలసిన వ్యాసం. చదవి తప్పక స్పందించండి!

    http://www.maganti.org/vyasavali/dwaana/aura.html

    రిప్లయితొలగించండి
  16. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గురువు గారూ మీ పూరణ చాలా బాగుంది. మీ ఆశీస్సులకు కృతజ్ఞతలు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. ముద్దు తార కపుడు ముప్పదొక్కటి యేండ్లు
    నాలు గైదు కలుప నలువదయ్యె
    ఇరువ దేండ్ల పిదప నరయు వారే లేక
    బ్రతుకు మిధ్య యనుచు వగత జెందె !

    డా. విష్ణునందనుల వారి నాన్న గారి పూరణ చాలా బాగుంది. ఆర్యా ! మరి మీరో పద్య రత్నాన్ని విదిలించండి !

    రిప్లయితొలగించండి
  19. మాల ధార ణందు మరువక లెక్కింప
    పూజ లందు మునిగి ముక్తి కొఱకు
    నాల్గు నాల్గు కలిపి నైదుతో గుణియింఛి
    నాలు గైదు కలుప నలువ దయ్యె !

    రిప్లయితొలగించండి
  20. నాలుగైదు కలుప నలువ దెట్లన్నను
    ప్రక్క ప్రక్క నుంచి పదిలముగను
    నైదు తీసి సున్న నచ్చట నుంచనె
    నాలు గైదు కలుప నలువ దయ్యె !

    రిప్లయితొలగించండి
  21. కొంటెవానినడుగఁగూర్చెనుగడులైదు
    కొన్నిసంఖ్యలుంచెయన్నిగడుల
    కనుబొమలెగరేసికలుపమన,గడులు
    నాలుగైదుకలువనలువదయ్యె!

    రిప్లయితొలగించండి
  22. మూడు మార్లు పదిని ముచ్చటగా వేసి
    కలిపి వేసి క్రింద కలుపు మొకటి
    పైన వేయు మిచట బాలుడా దానికి
    నాలుగైదుకలువనలువదయ్యె.

    రిప్లయితొలగించండి