20, మే 2012, ఆదివారం

సమస్యాపూరణం - 710 (గట్రాచూలికిఁ దనయుఁడు)

కవిమిత్రులారా...
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

గట్రాచూలికిఁ దనయుఁడు కందర్పుఁ డగున్.

25 కామెంట్‌లు:

  1. ఈ ట్రా ప్రాసయె కష్టము
    వాట్రామా భువనమాత పార్వతి కాదా? (what raama!)
    నాట్రాంగా అన్వయమే (not wrong)
    గట్రాచూలికి దనయుడు కందర్పుడగున్

    రిప్లయితొలగించండి
  2. చట్రపు దేహము భగ్గన
    వట్రిల్లును జగతి లోన భావజుఁ డనగన్
    కుట్రన బాధ్యుఁడు ' గలుగగ
    గట్రాచూలికిఁ దనయుఁడు ' కందర్పుఁడగున్ !

    వట్రిల్లు = ప్రవర్తిల్లు

    రిప్లయితొలగించండి
  3. బిడ్డ యెలా ఉన్నా గానీ తల్లికి మన్మథుని లాటి అందగాడే...

    వట్రువ ముఖమా కాదది
    పట్రాగా గజ ముఖమ్ము పతియే బెట్టెన్
    ఇట్రా మాతా యనగా
    గట్రాచూలికిఁ దనయుఁడు కందర్పుఁ డగున్.

    రిప్లయితొలగించండి
  4. ఇట్రారా యే పదమది
    గట్రాచూలా యొసోసి కాదె గిరిజ యే-
    మిట్రా తెలియద నిజమిది
    గట్రాచూలికిఁ దనయుఁడు కందర్పుఁ డగున్.

    రిప్లయితొలగించండి
  5. "వట్రువ సుడి పెట్టకు వెం
    గట్రాచూలికిఁ;" దనయుఁడు కందర్పుఁ డగున్
    చట్రము, కుట్రలు వలెనే
    కట్రాయి పదము లిఖింప కష్టమ్మగునా!

    తనయుడు కందర్పుడిలా ఉన్నాడు, వానికి వట్రువ సుడితో వచ్చే పదములు, చట్రము వంటి పదములకు భేదము నేర్పుతూ కష్టమౌతుందేమో అని తల్లి యోచిస్తున్నది.
    తల్లి మాటిమాటికి నా ముద్దుల మూట అని అన్నట్టు గా కందర్పుడు అని ముద్దుగా అన్నట్టు భావించాను.

    రిప్లయితొలగించండి
  6. ఈ ట్రా ప్రాసను కూర్చన్
    గట్రాచూలి దయతోడఁగననౌ, మును వెం
    కట్రావనెనిట్లు:"మ్రొక్కిన
    గట్రాచూలికిఁ, దనయుఁడు కందర్పుఁ డగున్".

    రిప్లయితొలగించండి
  7. పూరణలు అనేక విధములు. ఈ తీరును కూడా చూడండి:

    భట్రాజా యిట్రమ్మని
    పేట్రేగిన తిక్కలోన వెర్రి సమస్యన్
    ఖట్రోచీ యిడె వినుమా
    గట్రాచూలికి దనయుడు కందర్పుడగున్

    రిప్లయితొలగించండి
  8. కట్రా వైష్ణో మాతా!
    ఈ ట్రిక్కును వింటివమ్మ! ఈశ్వరి నేడున్
    మెట్రోయుగధర్మముచే
    గట్రాచూలికిఁ దనయుడు కందర్పుడగున్.

    రిప్లయితొలగించండి
  9. ఆర్యా!
    ప్రసిద్ధ వైష్ణవీదేవి ఆలయం జమ్మూ దగ్గర కట్రా అనే ప్రాంతంలో ఉంది. అక్కడ అమ్మవారిని వైష్ణోదేవి అంటారు.
    గమనించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  10. సుతుడు నలుపని చింతించే తండ్రిని,తాత(తండ్రికి తండ్రి) ఓదార్చు సందర్భంగా పలికిన పలుకులు:
    పట్రా రా! యద్దము చూ
    డట్రాచిక్కిన ముఖమ్ము!
    యంతటివ్యధనీ
    కట్రా!సుతుడి నలుపు బెం
    గట్రా!చూలికిఁ తనయుడు కందర్పుడగున్!

    రిప్లయితొలగించండి
  11. ఓ ట్రంకుల రామయ్యా!
    ఈ ట్రీల చికిత్సలేల? ఇప్పటికైనన్
    పట్రా యాపిల్, ద్రాక్షలు
    గట్రా చూలికిఁ దనయుడు కందర్పుడగున్.

    రిప్లయితొలగించండి
  12. నిట్రాటకు కట్టిన యజమును
    పట్రా బలినీయ గోరి భద్ర కాళికి నిపుడే !
    కుట్రలు జేసిన యలుగును
    గట్రా చూలికి దనయుడు కందర్పు డగున్ !
    అజము = మేక

    రిప్లయితొలగించండి
  13. భట్రాజులు పొగడంగ వి
    రాట్రూపుని గజవదనుని రమణీయముగన్
    చట్రాతి యందు ,జెక్కిన
    గట్రాచూలికి దనయుడు కందర్పుడగున్.

    రిప్లయితొలగించండి
  14. భట్రాజులు పొగడంగ వి
    రాట్రూపుని గజవదనుని రమణీయముగన్
    చట్రాతి యందు ,జెక్కిన
    గట్రాచూలికి దనయుడు కందర్పుడగున్.

    రిప్లయితొలగించండి
  15. అయ్యా శ్రీ (డా,) కమనీయం గారూ!
    మీరు విరాట్రూపుని అని వాడేరు. సంధి కార్యము వలన విరాడ్రూపుని అని అవుతుంది అని నా నమ్మకము. కాస్త పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులకు వందనాలు.
    సమయాభావం వల్ల నిన్నటి పద్యాలను, పూరణలను పరిశీలించలేకపోయాను. సాయంత్రం వరకు నా వ్యాఖ్యలను ప్రకటిస్తాను. ఆలస్యానికి మన్నించండి.

    రిప్లయితొలగించండి
  17. అయ్యా,పండిత నేమాని గారూ,మీరు చెప్పినది నిజమే.షట్+రుచులు=షడ్రుచులు ఐనట్లు.కాని ఇలాంటి ప్రాస చాలా కష్టంకదా.చిన్న మినహాయింపు ఇవ్వండి.లేకపోతే ,విరాట్ రూపమని చదువుకొండి.ఇంగ్లిష్ పదాలు వాడితే వ్రాయడం ఈ ప్రాసలో సులభమే.కాని ఇంగ్లిష్ పదాలు వాడకుండా వ్రాయాలనుకొన్నాను. అలాగే ' పట్రా ',
    'యేట్రా ' వంటి మాండలికాలు కూడా వాడకుండా వ్రాయాలనుకున్నాను.

    రిప్లయితొలగించండి
  18. వట్రమ్మగు రూపమ్మును
    వట్రువ బొజ్జను గని శశి ఫక్కున నవ్వెన్
    తొట్రుపడనట్టి తల్లియె,
    గట్రాచూలికిఁ దనయుఁడు కందర్పుఁ డగున్.

    (వట్రము = హ్రస్వము, పొట్టి; వట్రువ = గుండ్రము)

    రిప్లయితొలగించండి
  19. పండిత నేమాని వారూ,
    ఆంగ్లపదాలతో ఆటాడుకున్నారు. చమత్కారభరితమైన పూరణ. అభినందనలు.
    మీ రెండవ పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    తప్పని పరిస్థితిలో వ్యావహారిక పదాలను వాడినా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    పామరుల మాటల్లో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    చక్కని ప్రయత్నం చేసి మెప్పించారు. బాగుంది. అభినందనలు.
    *
    ఊకదంపుడు గరూ,
    మీ పూరణతో నిజంగానే "దంచేసారు" బాగుంది. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    బాగున్నాయండీ మీ పూరణలు. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్య,
    మీ పూరణలో మొదటి, రెండవ పాదాల్లో గణదోషం ఉంది. సవరించే ప్రయత్నం చేస్తాను.
    *
    కమనీయం గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    ఇటువంటి దుష్కర ప్రాసకు అన్యదేశ్యాలైనా, వ్యావహారికాలైనా అంగీకరించ దగినవే!

    రిప్లయితొలగించండి
  20. పట్రా! సిద్ధిని బుద్ధిని!
    కొట్రడు వరుడితడు నేడు
    కుడుముల తోడన్
    కుట్రలతో బంధించెద!
    గట్రాచూలికిఁ దనయుఁడు కందర్పుఁ డగున్

    రిప్లయితొలగించండి
  21. పట్రమ్మని యడిగి జనని
    తొట్రుపడుచు జూచి సుతుని తోరపు బొజ్జన్
    కుట్రపు నవ్విడి యనియెన్:
    "గట్రాచూలికిఁ దనయుఁడు కందర్పుఁ డగున్" 😊

    రిప్లయితొలగించండి


  22. పట్రమ్మా కలమును భళి
    తొట్రేమియు పడక వ్రాయి ద్రువయములో నా
    చట్రములో పట్టని కత!
    గట్రాచూలికిఁ దనయుఁడు కందర్పుఁ డగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి