28, మే 2012, సోమవారం

సమస్యాపూరణం - 718 (అఱవమునందు వేమన)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

అఱవమునందు వేమన మహాకవి భాగవతమ్ముఁ జెప్పెఁగా!

ఈ సమస్యను పంపిన

గుండు మధుసూదన్ గారికి

ధన్యవాదాలు.

14 కామెంట్‌లు:

  1. కరము శుభావహంబులగు కమ్మని పద్యశతంబు బల్కి యీ
    ధరకు హితంబు గూర్చిన బుధాగ్రణి చూడగ కావ్యకర్తగా
    దఱవమునందు వేమనమహాకవి, భాగవతమ్ముఁ జెప్పెగా
    వరమగు భక్తితత్పరత భాగ్యవశంబున పోతరాజికన్.

    రిప్లయితొలగించండి
  2. అఱవక చెప్పు మెందు విన నన్నము సాపాటౌను? యెవ్వరే
    వెఱవక మేడిపండు వలె వెల్గెడు సంఘము గుట్టు విప్పె? తా
    కఱవదిదీర పోతనయె స్కంధములందున నేమి జెప్పెనో
    అఱవమునందు - వేమన మహాకవి - భాగవతమ్ముఁ జెప్పెఁగా!

    రిప్లయితొలగించండి
  3. అరుదగు దాక్షిణాత్యుల మహాసభయందు ననేక పండితుల్
    సరస వచో విలాసముల సందడి జేయుచునుండ నందులో
    నరుసము నొందరే యనుచు హాస్యముగా నొక డిట్లు పల్కె మా
    యరవమునందు వేమన మహాకవి భాగవతమ్ము జెప్పెగా.

    రిప్లయితొలగించండి
  4. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    అఱవలు నెందుఁ బల్కెదరొ? యాటవెలందుల యోగి యవ్వఁడో?
    కఱవఁగఁ జేయు మానసముఁ గావ్యముచే నతఁ డెవ్వఁడో కదా?
    వఱలెడు భక్తితోడుతను బమ్మెర పోతన యేమి సెప్పెనో?
    యఱవమునందు; వేమన; మహాకవి; భాగవతమ్ముఁ జెప్పెఁగా!

    రిప్లయితొలగించండి
  5. కుఱిసెను వెండితారలిట, కూసెను కాకులు కోకిలమ్మలై
    ముఱిపెము తోడ పుష్పములు ముళ్ళను పూచెను వింతవింతగా
    నఱుదగు ముచ్చటల్ వినుచు హాస్యపుధోరణిబల్కనొప్పునే-
    యఱవమునందు వేమన మహాకవి భాగవతమ్ముఁ జెప్పెఁగా!

    రిప్లయితొలగించండి
  6. sir,

    can any one post the poem " ganjaayi traagi, mushkara sanjatamu toda, kallu chavigonnavu
    ---- kunjara yoodhammu doma kuttuka jochen

    by ramakrishna kavi

    can be sent on my mail chandrasekhar67@rediffmail.com

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మీదేవిగారి పద్యం చాలా బాగుంది. కవి మనసు, సొగసు తెలుపుతోంది.

    రిప్లయితొలగించండి
  8. పెద్దలకు ప్రణామం.

    ఈ నాటి భావయుక్తమైన సమస్యకు మఱొక విఱుపుతోడి పూరణమిది:

    ఆచార్య చల్లా రాధాకృష్ణశర్మ గారు తిరుపతి వేంకటకవుల ప్రియశిష్యులు మహాకవి శ్రీ చల్లా లక్ష్మీనారాయణశాస్త్రి గారి తనయులు, తమిళదేశంలో అవిరళంగా ఆంధ్రభాషాప్రచారం చేసి, అనువాదకశిరోమణియై తమిళభాషలో రంగనాథ రామాయణ కవిత్రయ భారతాలకు, మన పోతన గారి భాగవతానికి సంక్షేపానువాదాలను వెలయించిన మహావిద్వాంసులు, సత్కవివరేణ్యులు.

    తఱిగొని రామభారతకథామధురార్థపరంపరల్ దమి
    న్విఱుగడ లేక ద్రావిడనివేశములన్ నెఱయించి, తెల్గుతీ
    పెఱుకవడంగఁ జేసి, వెలయించె ననేకకృతుల్ బుధోత్తముం
    డఱిముఱిఁ జల్ల వంశకలశాంబుధిసోముఁడు శర్మ గారు దా
    నఱవమునందు వే మన మహాకవి భాగవతమ్ముఁ జెప్పెఁగా!

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  9. అయ్యా శ్రీ శంకరయ్య గారూ!

    ఆరోగ్యము బాగగుచును
    మీరెంతయు ముదముమీర మెలగుదురికపై
    సారమతి శంకరా యని
    కోరుదు మనసార మిమ్ము గూర్చి సుధీంద్రా!

    సన్యాసి రావు

    రిప్లయితొలగించండి
  10. సత్యనారాయణ మూర్తి గారూ,
    చక్కని విరుపుతో ఉత్తమమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    క్రమాలంకారంలో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘సాపాటౌను’ అన్నచో గణదోషం. సవరణకు లొంగనంటున్నది. అరవల సాపాటు కదా! మనకు అరగదు లెండి!
    *
    పండిత నేమాని గారూ,
    మీ హాస్యోక్తి పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    నా ఆరోగ్యం బాగుపడాలని మనసారా కోరుకుంటున్న మీకు ధన్యవాదాలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీరు సృష్టించిన వింతలోకంలో ఏమైనా జరగవచ్చు. చమత్కారంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    అజ్ఞాత గారూ,
    ధన్యవాదాలు.
    ‘గంజాయి త్రాగి...’ పద్యం అడిగింది మీరేనే? మీకు మెయిల్ పెట్టాను.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ఈ నాటి పూరణలన్నిటిలో మీది శిరోమణిలా శోభిస్తున్నది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    నమఃపూర్వకంగా -

    మీ సాదరవాక్యాలకు, సౌజన్యానికి, ప్రోత్సాహనకు ధన్యవాదాలు. ఈశ్వరానుగ్రహం వల్ల అచిరకాలంలో మీరు పూర్ణారోగ్యవంతులు కావాలని శ్రీ భగవానుని వేడుకొంటున్నాము.

    రిప్లయితొలగించండి
  12. విరిచెనుబో మహేశ్వరుని విల్లును భళ్ళున నాంజనేయుడే...
    కరచెనుగా మహాత్ముడొక గండర గండుని కుక్కపిల్లనున్...
    మురిసెను రాహులిండిచట ముద్దుల నిచ్చి ఇరాని భాబికిన్...
    అఱవమునందు వేమన మహాకవి భాగవతమ్ముఁ జెప్పెఁగా!

    రిప్లయితొలగించండి