2, ఆగస్టు 2014, శనివారం

సమస్యా పూరణం – 1492 (రావణు జేరె సీత)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
రావణు జేరె సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్.

25 కామెంట్‌లు:

  1. ఇట్లా సీతమ్మ తల్లిని మాటి మాటికి పూరణ ల పేరిట/ద్వారా కించ పరచుట ఎంత వరకు సమంజసము ??

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. కావరమెక్కి తానెజని కానల నుండిన భూమి జాతనే
    నావరగర్వ చిత్తమున నాతిని దెచ్చెను మోసగించియే
    నావల రామచంద్రుడని నద్భుత రీతిని గూల్చివేయగా
    రావణు, జేరె సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్

    రిప్లయితొలగించండి
  3. ఆవనితల్ పతివ్రతలు ,నన్యుల సోదర తుల్యులంచునున్
    భావన జేయు వారయిన,పట్టును గావున మిత్తి తానుగా
    రావణు జేరె; సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్
    రావణ రాజ్యము న్విడిచి రాముని జేరెను సంతసించుచున్

    రిప్లయితొలగించండి

  4. మల్లెల వారి పూరణ
    పావనమైన రామునటు పల్కుల తోడను రెచ్చ గొట్టుచున్
    వేవగలొల్క శూర్పణఖ బిల్వగ శిక్షిడ కోపమంది తా రావణు జేరె,సీత యనురాగము లొల్కెడుపల్కులాడుచున్ భూవరు చేరు టోర్వకయ పుట్టనసూయను దుఃఖమందియున్

    రిప్లయితొలగించండి

  5. శ్రీరాముని క్షేమము తెలిసినంతనే ఆ క్షణములో సీత రామునిజేరినట్టే భావించినది ...

    పావని దక్షిణోదధిని వాసిగ గోష్పదమంతజేసి లం-
    కావని జేరి జానకిని గాంచి రఘూత్తమఁ క్షేమవార్త సం-
    భావనజేయఁ ప్రాప్త సుఖభావము పొంగ, సమస్త దైత్య వి-
    ద్రావణు జేరె సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్

    రిప్లయితొలగించండి
  6. రావలదంచు జెప్పినను రామునితో వని కేగె సీత స
    ద్భావముతోడ, పర్ణకుటి దా వసియించుచు నుండ నొంటిగా
    భావుబలంబుతోడ చెర బట్టిగ జంపెను రామచంద్రుడా
    రావణు, జేరె సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్.

    రిప్లయితొలగించండి
  7. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    పావన సాధు వేషమున పాపి దశానను డేగుదె౦చి భి
    క్షావిఘవమ్ము నిమ్మనగ జానకి యాతని బిల్చె లోనికిన్
    “నీవర !తాళు,మార్య!పతి నెయ్యమివచ్చును సేద తీరుమన్”
    రావణు జేరె సీత యనురాగము లొల్కెడుపల్కులాడుచున్
    వాల్మీకి రామాయణము అరణ్య కాండ ౪౬,౪౭,౪౮.సర్గలు

    రిప్లయితొలగించండి
  8. కావర మెక్క రావణుడు కాంతుడు దగ్గర లేని వేళలో
    పావని జానకిన్ తనదు వాసము దెచ్చె నయ్యయో
    చేవ గలట్టి రాము హతి చేటును గాంచక, భర్త తున్మగా
    రావణు, జేరె సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్

    రిప్లయితొలగించండి
  9. భూవనిఁ బుట్టె సీత సుర పూజిత రాముని బెండ్లి యాడగన్
    గావర మేమొ రావణుడు కామ ప్రకోపము హద్దు మీరగన్
    బావనిఁ బట్టి లంక నిడి భావన జేయగ స్వప్న మందునన్
    రావణుఁ జేరె సీత యనురాగము లొల్కెడు పల్కులాడుచున్!

    రిప్లయితొలగించండి
  10. గండూరి లక్ష్మీనారాయణ గారూ పూరణబాగుంది

    కానీ మూడవపాదం మొదట్లో ప్రాస కోసం చూస్తే అర్ధం కుదరట్లేదు."భావుబలంబు" "బాహుబలంబు"

    రిప్లయితొలగించండి
  11. జిలేబీ గారూ,
    నిజమే! మన్నించండి. రెండురోజులుగా జ్వరంతో బాధపడుతూ క్రొత్త సమస్యలకోసం ఆలోచించే ఓపిక లేక ఎప్పుడో వ్రాసి పెట్టుకున్నది ఇచ్చాను.ఇప్పటికి బ్లాగులో ఇచ్చిన దాదాపు 1500 సమస్యలలో సగంకంటె ఎక్కువ నేను సృష్టించినవే. మిగిలినవి మిత్రులు పంపినవి, సేకరించినవి. క్రొత్త సమస్యలకోసం ఆలోచించే శక్తి సన్నగిల్లుతున్నదేమో?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదం ప్రారంభంలో ఉన్న ‘నా’కు అన్వయం కుదరడం లేదు. ‘తా వరగర్వచిత్తమున తన్విని దెచ్చెను...’ అంటే ఎలా ఉంటుంది?
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రామకృష్ణ మూర్తి గారన్నట్లు మూడవ పాదంలో లోపమే. అక్కడ ‘మ్రుచ్చిలన్/ భావన జేసి తాను చెరబట్టిన...’ అందామా?
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నీవర’..?
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘తనదు వాసము దెచ్చెను దుష్టబుద్ధితో’ అందామా?
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘భూవని’...? అక్కడ ‘భూవనితాజ సీత..’ అందామా?
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. ఏ విధినైన జానకిని యెంతయొ కోరిన ఘోర పాపినిన్,
    శైవపు భక్తిజూచి శివసాయుజ మిచ్చియు కాచిబ్రోచె నా
    రావణు; చేరె సీత యనురాగము లొల్కెడు పల్కులాడుచున్,
    కావు! తపస్వులన్ సతము కానల రక్కసి మూకచే! ధవా!

    రిప్లయితొలగించండి
  13. శంకరయ్య గారికి, ఈ సమస్య బాగుంటే తరువాతి క్రమంలో వాడండి

    "తల్లియు తండ్రియును లేక తనయుడు పుట్టెన్"

    రిప్లయితొలగించండి
  14. కేవలమొక్క పాడు పని కే కద రాముని చేతిలో గొనెం
    జావును తాదశాననుడు, జానకి యశ్రులె కూల్చివేసెనా
    రావణు, జేరె సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్
    పావన నిర్మలంబయిన మానసగా వెస రామచంద్రునిన్

    రిప్లయితొలగించండి
  15. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    చివరి పాదాన్ని ‘కావుము మౌనులన్ సతము...’ అనండి.
    సమస్య పంపినందుకు ధన్యవాదాలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    నీవరుడు =సన్యాసి
    చూడు జి.యన్.రెడ్డి గారి పర్యాయ పద నిఘంటువు
    1605

    రిప్లయితొలగించండి
  18. తిమ్మాజీ రావు గారూ,
    నిజమే... నేను సరిగా పరిశీలించకుండా వ్యాఖ్యానించాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  19. ఆర్యా ! ధనయవాదములు...
    మీ సూచనతో సవరించిన పూరణ..

    కావరమెక్కి మోసమున గట్టుక తాపసి వేషమప్పుడే
    తా వరగర్వ చిత్తమున తద్ధర పుత్రిని లంకజేర్చగా
    నావల రామచంద్రు డని నద్భుత రీతిని గూల్చివేయగా
    రావణు, జేరె సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్

    రిప్లయితొలగించండి

  20. శ్రీ రామకృష్ణ మూర్తిగారు నా తప్పిదమును సూచిన మీకు మరియు గురువరులు
    శ్రీ కంది శంకరయ్యకు కృతజ్ఞతలు
    మూడవ పాదమును సవరించి ఈ విధంగా వ్రాశాను

    రావలదంచు జెప్పినను రామునితో వని కేగె సీత స
    ద్భావముతోడ, పర్ణకుటి దా వసియించుచు నుండ నొంటిగా
    చావును గోరిదెచ్చుకొని జానకి నిన్ జెరబట్ట చంపె రాముడా
    రావణు, జేరె సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్.

    రిప్లయితొలగించండి


  21. అందరి పూరణలు అలరిస్తున్నవి.కాని,జిలేబి గారన్నట్లు చాలాసార్లు సీతాదేవిని సమస్య పూరణకు సబ్జెక్టుగా ఇస్తూఉండడం సమంజసంగా,ఉచితంగా లేదు.

    రిప్లయితొలగించండి
  22. జీవిత మంత రామునికి చేరువగా గడపంగ దల్చి యా
    భావనతోడ సీత వనవాసము చేయగ మోసగించి యా
    పావని నెత్తుకెళ్ళి బహుబాధలు వెట్టగ చంపె రాముడా
    రావణుఁ, జేరె సీత యను రాగము లొల్కెడు పల్కులాడుచున్
    మేవడి నొప్ప భర్తకడ మిక్కిలి మోదము గల్గుచుండగా

    రిప్లయితొలగించండి
  23. లావుగ మద్యమాంసములు లడ్డులు కుమ్మెడు మైకమందునన్
    చావును జూడకే మురిసి చక్కగ నవ్వుచు శయ్యజేరగా
    రావణు స్వప్నమందునను రాక్షస కోటులు సంతసించగా
    రావణు జేరె సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్

    రిప్లయితొలగించండి