6, ఆగస్టు 2014, బుధవారం

పద్యరచన - 643

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

  1. సూర్య కాంతితో శంఖముల్ సుందరముగ
    వెలుగు చున్నవి యిసుకలో చెలువ మొలుక
    విషధి యొడ్డున ముదమున విశ్రమించ
    వింత లెన్నియో కనవచ్చు ప్రీతితోడ

    రిప్లయితొలగించండి
  2. సూర్యకిరణాల వెలుగులో శోభలీను
    వనధి యందలి యపురూప వస్తుచయము
    కనగ శంఖము చాటుగా నినుని ప్రభవ
    మైన రీతిని తోచెగా మాయ యేమొ?

    రిప్లయితొలగించండి
  3. పై చిత్రం చూడగానే దర్శకులు శ్రీ కె.రాఘవేంద్ర రావు గారు గుర్తొచ్చారు. ఆ భావంతో...
    దైవాగమ శుభ సూచక
    భావంబును పాంచజన్య పరముగ చిత్రం
    బావిష్కరించ దర్శక
    ధైవత్యమిదా యనంగఁ దలపించుగదే!

    రిప్లయితొలగించండి

  4. చిత్ర మందలి శంఖముల్ చిత్రముగను
    మెరయు చుండెను జూడుము, మిత్రుని కర
    ములవి సోకంగ ధగధగముగను మిగుల
    సూర్య కిరణాల మహిమయే యార్య !యదియ

    రిప్లయితొలగించండి
  5. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. హరికర శంఖంబిచ్చట
    సరిధరకే దిగినదేమొ సాదృశమయ్యెన్
    కరములతో తడుముచు తా
    బిరబిరమని రవియె పైకి ప్రీతిన్ జనియెన్.

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. ఖరకరుని యుదయ కిరణ ప్ర
    సరణమువలన శరధిదరి జలజము మెరిసెన్
    హరువగు కనకపు బెడగుల
    ధరణిని జనులకు ముదముగ ధగధగలాడెన్

    రిప్లయితొలగించండి
  9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి