22, ఆగస్టు 2014, శుక్రవారం

పద్యరచన - 655

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. రంగు రంగుల తోడను రమ్యమైన
    చెట్టుపైనను కూర్చుండె చిన్ని పక్షి
    కరము శోభనిడన్ దాని యెఱుపు రంగు
    కనుల పండుగే యయ్యెను కాంచగానె

    రిప్లయితొలగించండి
  2. తెల్లని పూల చెట్టు పయి తీయపు తావియె విస్తరించగా
    అల్లన వచ్చి చేరేనొక యల్లరి యెర్రని పిట్ట యేలనో
    చల్లని సాయమందునట చక్కగ జూపులకింపు గొల్పుచున్
    మల్లెల వేళ యందు మనమందు కవిత్వము పొంగిపొర్లగా

    రిప్లయితొలగించండి
  3. తెల్లని పూ కొమ్మలందు
    ఎర్రగ తా కూర్చునుండి
    సన్నగ నే కూయుచున్న
    చిన్నది ఆ బుజ్జికూన.!!

    రిప్లయితొలగించండి
  4. శ్రీగురుభ్యోనమ:

    ఎన్నడు చూడలేదునిను యెక్కడివాడవు పక్షిరాజమా!
    సన్నని కొమ్మపైనిలచి సౌమ్యుడవై పరికించుచుంటివే
    పున్నమినాటి వెల్గులకు పూలసుగంధములబ్బినట్లుగా
    నున్నది నీదు రాక విజయోత్సవమై కనువిందు జేయుచున్

    రిప్లయితొలగించండి
  5. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    సుసర్ల నాగజ్యోతి గారూ,
    కొంపదీసి మీరు ‘జిలేబీ’ గారు కాదు కదా!
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘నిను + ఎక్కడి’ అన్నప్పుడు యడాగమం రాదు. పక్షికి మహద్వాచకాన్ని ప్రయోగించారు. నా సవరణ...
    ‘ఎన్నడు చూడలేదుగద యెక్కడివాడవు పక్షిరాజమా!/ సన్నని కొమ్మపైనిలచి సౌమ్యముగా...’

    రిప్లయితొలగించండి
  6. మల్లెల పూల తీగవలె మవ్వముగా కనిపించు కొమ్మపై
    చల్లని పిల్ల వాయువులు చక్కని సాయములోన తిన్నగా
    జల్లుచు సౌరభంబులను సాగుచు నుండెను బక్షి! యొంటిగా
    చెల్లునె కూరుచుండ నిట జెంతను నీ చెలి లేక చెప్పుమా !

    రిప్లయితొలగించండి
  7. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘సాగుచునుండెను పక్షి’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. శంకరయ్య గారూ నమస్కారములు,నేను నేనే...జిలేబీ అనువారు ఎవ్వరో నాకు తెలియదు.

    రిప్లయితొలగించండి
  9. మాస్టారూ! అక్కయ్య గారు రాజేశ్వరి నేదునూరి గారి పూరణలు కనిపించటం లేదు ఈ మధ్య!

    రిప్లయితొలగించండి
  10. గురువుగారూ ధన్యవాదములు.
    యడాగమము విషయము ఇప్పటికీ అర్థము కాకున్నది. తప్పులను సవరించుకొనే ప్రయత్నము చేస్తూనే ఉన్నాను. గురువుగారి ఆశీస్సులతో తప్పుల నధిగమిస్తాను.

    రిప్లయితొలగించండి
  11. నాగజ్యోతి గారూ,
    వచన కవితలో వ్యాఖ్యారూపకమైన పూరణలను జిలేబీ గారు పంపేవారు. మీ వ్యాఖ్యలూ అలాగే ఉంటే పొరబడ్డాను.

    రిప్లయితొలగించండి
  12. కొమ్మల్లో కువకువ రా
    వమ్ములకు మురిసి విరిసె ధవళ సుమదళముల్ !
    కమ్మని రాగాలకు జీ
    వమ్మేదైన పులకించ ప్రకృతి వరమ్మౌ !

    రిప్లయితొలగించండి
  13. చల్లనివేళలందు కడు చక్కటి పూలకు మధ్యలో యదో!
    పిల్లన గ్రోవియో గళము ! విందుల జేయుచు పాడుచున్నదా
    మెల్లగ పక్షిరాజమది! మిక్కిలి మక్కువఁ గూర్చుచున్నదీ
    యల్లన వీచు గాలి! సుధలందగ తుమ్మెద రాదదేలనో?

    రిప్లయితొలగించండి