7, ఆగస్టు 2014, గురువారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 47

రామాయణము-
సీ.     క్ష్మాసుతాపతికి లక్ష్మణుఁడు శాత్రవ(భీముఁ
        డలుకతోడ బలికెఁ బెలుచఁ గపట)
    భావఁ గైక, గురు భవద్విభూతి(హరణు
        నధము దుశ్శాసను నడచి, నల్ల)
    పాఱించి నిన్ జేతుఁ బ్రభుని, నిడెద (నాన;
        నని భీకరముగఁ జేయంగ సన్న)
    మునుఁ గాని మొన వచ్చి పోర, నాజి (నుదుటు
        మీఱి చేయు సుయోధనోరుహతిని)
గీ.     సల్పుదు ననుచు దుర్నిరీక్ష్యకుటిలభ్రు
    కుటి యగుచుఁ గన్నులను మిడుంగురులు రాలఁ
    బల్కె; వాని రాముఁడు శాంతపఱచి యొప్పె
    క్ష్మాజ సౌమిత్రి వనికి రాఁగఁ దన వెంట. (౬౨)

భారతము-
గీ.     భీముఁ డలుకతోడఁ బలికె బెలుచఁ గపట
    హరణు నధము దుశ్శాసను నడచి నల్ల
    నాన నని భీకరముగఁ; జేయంగ, సన్న
    నుదుటుమీఱి చేయు సుయోధనోరుహతిని. (౬౨)

టీక- భీముఁడు = (రా) భయంకరుఁడు; (రా) పెలుచన్, కపట = కపటమైన, (భా) పెలుచఁగ, పట = వస్త్రముల; గురున్ = (రా) తండ్రిని; దుశ్శాసను = (రా) దుష్టమగు శాసనము గలవానిని (రాము నడవికి బొమ్మనెను కనుక); ఆన = (రా) ఒట్టు, (భా) త్రాగుటకు; అనిన్ = (రా) యుద్ధమును, (భా) యుద్ధమందు, సన్న = (భా) సంజ్ఞ; సన్నమును గాని = (రా) తక్కువ కానటువంటి; (భా) సుయోధన = దుర్యోధనుని, ఊరు = తొడల, హతిని = కొట్టుటను, చేయంగ = చేయుటకు; (రా) సుయోధన = మంచి యోధుల, ఉరు = గొప్ప, హతిని = కొట్టుటను, చేయంగన్ = చేయుటకు; దుర్నిరీక్ష్య = చూచుటకు భయంకరమైన; కుటిల = వంకరయగు; భ్రుకుటి = కనుబొమలు కలవాఁడు (కోపముచే); మిడుంగురులు = అగ్నికణములు.
                                                                                                                               రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి