3, ఆగస్టు 2014, ఆదివారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 43

రామాయణము-
సీ.      ఆ జనకోటి (ప్రియత నచ్యుతాప్తి బె
రసె; దత్సుకృతిఁ గాం)చి, ప్రతిభతోడు
తను మించు నిజయశోధావళ్యమున నీతఁ
(డివము ప్రభను; వెల్గె మివుల నర్థ)
ముదయుతారి యనిరి; (భువివిభుఁడు యుధిష్ఠి
రవరుఁ డింద్రప్రస్థ) రమ్యధాన్య
మోదితభిక్షుం డపు డలంకరింపించె
(నగరి; భాసురగురునయమయసభ)
గీ.       జనకు నానతి వీడె క్ష్మాజావిభుండు;
పరమసంసంతోషమునఁ బొంగి పౌరులును బె
రసిరి చుట్టపక్కాలను; రంగరంగ
వైభవంబులతోఁ బురి ప్రజ్వరిల్లె. (౫౮)

భారతము-
ఆ.      ప్రియత నచ్యుతాప్తి బెరసె; దత్సుకృతిఁ గాం
డివము ప్రభను; వెల్గె మివుల నర్థ
భువివిభుఁడు యుధిష్ఠిరవరుఁ డింద్రప్రస్థ
నగరి; భాసురగురునయమయసభ. (౫౮)

టీక- అచ్యుతాప్తిన్ = (రా) నాశనముగాని యాప్తిని, (భా) కృష్ణుని యాప్తిచే; ఇవముప్రభను = (రా) మంచుయొక్క కాంతి; అర్థముదయుతారి = శకలములయిన సంతోషముగల శత్రువులు గలవాఁడు; ఇంద్రప్రస్థధాన్యమోదితభిక్షుండు = శ్రేష్ఠములగు తూములకొలది మంచిధాన్యముచే సంతోష పఱచఁబడిన యాచకులు గలవాఁడు; గురునయమయసభ (రా) నయమయ = నీతిమంతుఁడగు, గురు = తండ్రియొక్క, సభ, (భా) గురు = ఎక్కువగు, నయ = నీతిగల, మయసభ = మయునిసభ; బెరసె = కలిసె; ధావళ్యము = తెలుపు.

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి