జడశతకం
‘జ్యోతి వలబోజు’ గారు ఇలా తెలియజేస్తున్నారు.
శతక సాహిత్యంలో ఒక వినూత్న ప్రయోగం!
ఒకే రచయిత శతకం పూర్తి చేయకుండా పదిమంది మిత్రులతో శతకం వేస్తే ఎలా వుంటుంది .. బ్రహ్మాండంగా వుంటుంది.. కాదంటారా. అందరూ ఒకే అంశం అదే "జడ" మీద పద్యాలు అల్లితే వాటితో "జడ శతకం" తయారు చేసి ప్రచురించాలని "బ్నిం"గారు నిర్ణయించారు.
అందమైన 'కంద' పద్యాలతో రూపొందించే ఈ శతకాన్ని 'బ్నిం'తో పాటు మరి కొందరు కవులు, రచయితల పద్యాలు కలిపి సంయుక్తంగా అల్లాలనే ప్రయత్నంతోనే ఈ జడశతకం గ్రూపును ప్రారంభిస్తున్నాం.
కంద పద్య అభిమానులయిన కవులు ఒక్కొక్కరు 5 కి మించకుండా పద్యాలు రాయండి. మకుటం అవసరం లేదు కానీ 4 పాదాల్లో ఎక్కడో ఒక చోట 'జడ' అనే పదం రావాలి. ఎవర్నీ హర్ట్ చేయకుండా పద్యాలు రాయాలి సుమీ...
ఇంకా బోల్డు విశేషాలు ఉన్నాయి. ముందు ముందు మీరు ఈ ప్రాంగణంలోకి వస్తూ ఉండండి.
https://www.facebook.com/groups/1483014091957033/
కవిమిత్రులు పైలింకులో తమ పద్యాలను ప్రకటించవచ్చు. లేదా శంకరాభరణంలో వ్యాఖ్యగా పెట్టవచ్చు. ప్రారంభించండి.
‘జ్యోతి వలబోజు’ గారు ఇలా తెలియజేస్తున్నారు.
శతక సాహిత్యంలో ఒక వినూత్న ప్రయోగం!
ఒకే రచయిత శతకం పూర్తి చేయకుండా పదిమంది మిత్రులతో శతకం వేస్తే ఎలా వుంటుంది .. బ్రహ్మాండంగా వుంటుంది.. కాదంటారా. అందరూ ఒకే అంశం అదే "జడ" మీద పద్యాలు అల్లితే వాటితో "జడ శతకం" తయారు చేసి ప్రచురించాలని "బ్నిం"గారు నిర్ణయించారు.
అందమైన 'కంద' పద్యాలతో రూపొందించే ఈ శతకాన్ని 'బ్నిం'తో పాటు మరి కొందరు కవులు, రచయితల పద్యాలు కలిపి సంయుక్తంగా అల్లాలనే ప్రయత్నంతోనే ఈ జడశతకం గ్రూపును ప్రారంభిస్తున్నాం.
కంద పద్య అభిమానులయిన కవులు ఒక్కొక్కరు 5 కి మించకుండా పద్యాలు రాయండి. మకుటం అవసరం లేదు కానీ 4 పాదాల్లో ఎక్కడో ఒక చోట 'జడ' అనే పదం రావాలి. ఎవర్నీ హర్ట్ చేయకుండా పద్యాలు రాయాలి సుమీ...
ఇంకా బోల్డు విశేషాలు ఉన్నాయి. ముందు ముందు మీరు ఈ ప్రాంగణంలోకి వస్తూ ఉండండి.
https://www.facebook.com/groups/1483014091957033/
కవిమిత్రులు పైలింకులో తమ పద్యాలను ప్రకటించవచ్చు. లేదా శంకరాభరణంలో వ్యాఖ్యగా పెట్టవచ్చు. ప్రారంభించండి.
https://www.facebook.com/groups/1483014091957033/
రిప్లయితొలగించండిలేదా నాకు మెయిల్ చేసినా సరే..
jyothivalaboju@gmail.com
వినూత్న ప్రయోగ కర్తలకు అభినందనలు. కానీ శతకము మకుటముతో ఉంటేనే అందమని నా అభిప్రాయము. ' జడకు ' ఒక మంచి మకుటాన్ని పెద్దలు సూచిస్తే " జడ " నందుకుందామని ....
రిప్లయితొలగించండిజడ లుండు రెండు రకములు
రిప్లయితొలగించండిపొడుగుగ మఱి కొన్ని యుండు బొట్టిగ నికయున్
బొడుగు జడలున్న యెడలన
గడు నందము గలిగి యుండ్రు కాంతలు నెపుడున్
ప్రాసంగికమగు విషయం
రిప్లయితొలగించండిబీ సంగతి మూడు పాయలెసగఁగ గుణ లీ
లా సంభృతమైన త్రివే
ణీ సంగమ సమము నీవు నిక్కమ్ము జడా !
జడదారియైనఁ గానీ
పెడదారింబట్టు నతివ పిరుదుల పైనం
దడబడు నీ నాట్యముఁ గని
పుడమినెవని తరము నిన్నుఁ బొగడంగ జడా !
పొడవుగ , మహిళా మణులకుఁ
దొడవుగ , వెన్నంటి నడచు తోడుగ సతత
మ్మొడఁబడి గడితేరితివట
గడసరివే ! నిను నుతింపఁగా నెటుల జడా !
గట్టిగ ముడి వేయుటొ మఱి
బిట్టుగ విడివిడిగ వదిలి వేయుటొ పూలం
బెట్టుటొ పెట్టకపోవుటొ
యెట్టులయిన నేమి యందమే నీది జడా !
ఎవ్వతె సోయగమున నా
కివ్వసుధన్ స్పర్థ యనుచు నింతి యొకతె నిన్
దువ్విన - కయ్యానికి కా
ల్దువ్వినటుల మదికిఁ దోచుఁ దోరంపు జడా !
భామకు వెనకను జడయే
రిప్లయితొలగించండిపాముగ తానూగుచుండు, పైనను గనగా
చేమంతిబిళ్ళ మెరయుచు
తామణిగా వెలుగుచుండు తరుణీమణికిన్.
డా. విష్ణునందన్ గారు అద్భుతమైన పద్యములు చెప్పారు..వారికి అభినందనలు.వారు వాడిన మకుటాన్నే వాడి వంద పద్యములు పూరిస్తే బాగుంటుందని నా అభిప్రాయము..ఆ మకుటముతో నాపద్యాన్ని మారుస్తున్నాను...వీలును బట్టి మరికొన్ని ప్రయత్నిస్తాను..
రిప్లయితొలగించండిభామకు వెనకను నీవే
పాముగ నేయూగెదవుగ, పైనను గనగా
చేమంతిబిళ్ళ యొక్కటి
తామణిగా వెలుగుచుండు తథ్యంబు జడా ! .
డా. విష్ణునందన్ గారి కత్తికి రెండు వైపులా పదునే. సంస్కృతంలో దిట్టయైన వీరు మంచి భావుకత కలిగిన పద్యాలు ఎక్కువగా తెలుగు పదాలతోనే వ్రాశారు. బహుశ: కాలేజీ రోజుల్లో మరుగుపడిపోయిన 'జడ' సుందరి ఈ రకంగా బయటికొచ్చిందేమో!
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండివేరే మకుట మెందుకు? డా. విష్ణునందన్ గారి పద్యాలను చూడండి.
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
డా. విష్ణునందన్ గారూ,
మీ ఐదుపద్యాలు అద్భుతంగా ఉన్నాయి. అసలు మొత్తం శతకం మీరే వ్రాస్తే ఎంత బాగుంటుందో? ధన్యవాదాలు.
ఇమ్ముగ కొమ్మకు జూడగ
రిప్లయితొలగించండినమ్ముము నొక జాతిపూలె నయముగ బూయున్
కొమ్మకు వాల్జడ దురుమగ
కమ్మని బహుజాతి పూలు కనిపించు జడా !
మగవానికి జడలుండిన
రిప్లయితొలగించండిజగమంతయు యతియె యనుచు జైకొట్టునుగా
మగువలకే జడలుండిన
మగవారికి దోచు రతిగ మదిదోచు జడా !
చూడగ కృష్ణుని జడవై
రిప్లయితొలగించండిచూడగ మరి రెండు జడల సోయగ మీవై
చూడగ పూజడ వై సరి
జూడగ ముడి, కొఫ్ఫు కొప్పి శోభించు జడా !
జడనిన్ను వంద రీతుల
రిప్లయితొలగించండిముడివేయగ మురియు చుంద్రు ముదితలు నిజమే
జడ పేర పద్య రచనయె
ముడిబడగా మురిసెదమిక మోహనపు జడా !
అయ్యా నమః!మీ పద్యాల్లు చాలనచ్చాయి .. మీకు మీస్పందనకి ..ధన్యవాదపూర్వక స్వాగతం!!''జడ పజ్యాలు ..శతకం ''అనే మన పుస్తకంలో సంస్కృత పదాలు సంధులూ లాంటి పాదాలు వద్దు .. .. సెటైరూ .. చమత్కారం భాషాల్లో వేమన శ్రీశ్రీల్లా సారళ్యవ్యావహారికం (మణిప్రవాళాలైనా పర్వాలేదు )లో వేద్దాము. పండిత ప్రశంసలు కన్నా అంతంతమాత్ర పద్యపాఠకులని అలరించేలా చదివించేలా ..మీ భావాలు లాలిత్యం లో అందిచాలని .. గణబద్ధంగా కందపద్యాన్ని చెప్పమని విజ్ఞులని వినమ్రంగా వేడుకుంటున్నాను మకుటం పెడితే అన్నీ జడను సంబోధించినట్లు పద్యాలు మూసలో వస్తాయని దాని ప్రాధాన్యతని త్యజించాలని నిర్ణయించాము ..!!
రిప్లయితొలగించండిమిత్రులు కంది శంకరయ్యగారి శంకరాభరణం ద్వారమున...
రిప్లయితొలగించండిజ్యోతి వలబోజుగారికి నమస్కారములు.
మీరు సమకట్టిన యీ ప్రయోగం దిగ్విజయమంది, సాహితీ లోకంలో క్రొత్త యొరవడిని సృష్టించాలని కోరుకొంటూ...
1.
శంకరుని జటాజూటము
శంకించెను తనదుపాయ సాటియు నీవై
వంకరలు తిరిగి వెలుఁగఁగ;
నింక నెటులు నిన్ను మింతు రెవ్వారు జడా!
2.
శివకంఠాలంకృత నా
గువె నీవని బ్రమసె జనము కూరిమి నటనన్
యువతుల వీఁపున నాడఁగ;
శివశివ యిది నీదు జయమె చిత్రంపు జడా!
3.
పొట్టిగఁ, బొడుగుగ, లావుగ
దిట్టపుఁ బొంకమునఁ గదలు స్థిరతరమగు నే
పట్టున వెండ్రుకలుండిన
నట్టుల నీ వెసఁగుచుందు వందముగ జడా!
4.
రయ్యిమని వెంబడించెడి
యయ్యల మనములను దోచి యాడించుచు న
ప్పయ్యర గాలికి నూఁగుచు
నొయ్యారము లొలుకుచుందు వొక్కటను జడా!
5.
కవ్వపుఁ గొండనుఁ జుట్టిన
మవ్వపు వాసుకిని మించు మానిని జడవై
చివ్వున నటునిటు నాడెడి
దివ్వెల జడగంటలున్న ధీనిధివి జడా!
ఇంతులు దురుమగ సిగ చే
రిప్లయితొలగించండిమంతులు మల్లెలు గులాబి మందారములన్
బంతులు, సంపెగ పొగడల
నెంతైనను పొగడలేము నీసొగసు జడా !
నుడువుమన జడ పదార్ధము
రిప్లయితొలగించండిబడిలోనొక బుడుగు చెప్పె పంతులు కిటులన్
జడకుండు బ్యాండు, దువ్వెన
ముడిక్లిప్పులు ననుచు నెంత ముచ్చటగ జడా !
జడలను జూడగ నొకపరి
రిప్లయితొలగించండిజడధారికి బుట్టుగాదె జాడ్యము లెన్నో
నడవడి మారును పాపము
నుడికించుచు చంపుతావె నో వాలు జడా!
పొడుగాటి వాలుజడయే
నిడుముల బడద్రోయు నెపుడు నింతుల నిలలో
మెడికరులవి వాడవలయు
ముడివేయగ లొంగవసలు ఫో !వాలు జడా!
నడుమన వొయ్యారముగా
సడి జేయక పాము వోలె జారుతు జడయే
గడగడ లాడించు జగముల్
పడిపోవును జడను జూసి ఫాలుండైనన్ !
మడుగున దాగిన శూరుని
గొడుగుగ గిరి నెత్తినట్టి గోపాలకునన్
జడధారు ల నెందరినో
నడపింతువు నాతి చుట్టు నయముగ జడయే !
జడపై కవితల నల్లిరి
జడపై గేయములు వ్రాసి చాటిరి ఖ్యాతిన్
జడపై శతకము భళిరా
జడవేయుట మాన రెవరు చదవగ జడయే !
మకుట శతకం ఒక కవే రాస్తాడు ..ఇక్కడ శాసనోల్లంఘనమే అనివార్యం
రిప్లయితొలగించండిఅదీకాక ఒకరు వనితా మకుటం కావాలంటారు ..
మరొకరు మరోటి అంటారు.. అలా రాస్తే రాసేవాళ్ళు స్వతంత్ర కవితా ఛాయ పోయి అవధాని అవుతారు
ఈ శతకం ' పద్య ' శతకపు నిబద్ధత జోలికి వెళ్ళక ' పజ్య 'శతకం గా చేయలని ప్రచురణ కర్తల సరదా ..దాన్ని తీర్చడానికి సహకరించ మనవీ !! బ్నిం గా ఒకజోకు గమనించండి ..నాలుగోపాదం చిట్టచివర వుండే పదం .. మకుటం ఏమిటి ?? నెత్తిమీద వుండేదాన్ని మకుటం అనాలి ..చివ్వరిదాన్ని ' పద పీఠము ' అనాలి అసలు ( ఇది కార్టూనిస్టు నాలడ్జ్ ..పాపం )
ఈ బ్లాగుకి బి యెన్ మూర్తి గారి పరిచయం ఇంతకుముందు లేదని నా భావన. వారి పరిచయం?
రిప్లయితొలగించండిఇది బ్నింగారి పరిచయం
రిప్లయితొలగించండిhttp://acchamgatelugu.com/?p=6920
బ్నింగారు ఇంతకుముందు మాలికపత్రికలో చీర పద్యాలను విశ్లేషించి తర్వాత చీర పజ్యాల శతకాన్ని రచించి పుస్తకంగా మలిచారు.. అధే స్ఫూర్తితో ఇప్పుడు జడ మీద పజ్యాల శతకం తీసుకురావాలనుకుంటున్నారు..
రిప్లయితొలగించండిమరిన్ని వివరాలు ఇక్కడ చూడొచ్చు. బ్లాగులొకానికి ఆయన కాస్త తక్కువగానే వస్తారు..
http://magazine.maalika.org/2013/11/02/%E0%B0%9A%E0%B1%80%E0%B0%B0-%E0%B0%B8%E0%B1%8A%E0%B0%97%E0%B0%B8%E0%B1%81-%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1-%E0%B0%A4%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE/
ఈ ప్రయోగం లో నేను పాలుపంచుకొనలేకపోతున్నాను. నా కారణాలు నాకున్నాయి.
రిప్లయితొలగించండి'మకుటం పెడితే అన్నీ జడను సంబోధించినట్లు పద్యాలు మూసలో వస్తాయని దాని ప్రాధాన్యతని త్యజించాలని నిర్ణయించా' మంటున్నారు శ్రీ B.N. మూర్తిగారు. సరే మకుటం హుళక్కి. ఒకే కవి వ్రాస్తే కూడా ఒక శైలి అంటూ కనబడుతుందని కాబోలు అనేకమంది కవులు సామూహికశతకరచనాకార్యక్రమంలో పాల్గొనాలని ఒక నిర్ణయం చేసారు. జ్యోతిగారేమో ఒక్కొక్కరు 5కు మించకుండా పద్యాలు వ్రాయాలని నిబంధన చేసారు. నిజానికి వందమంది కవులు దొరికితే, ఐదునిముషాల్లోనో ఇంకా తొందరగానో శతకం పూర్తైపోతుంది. తప్పకుండా అదొక గొప్పరికార్డు కూడా అవుతుంది! పాతకలంవారి మనస్సుకు సానుకూలమైన ఒకే ఒక నిబంధన ఏమిటంటే గణబద్ధంగా కందపద్యాన్ని చెప్పమని అడగటం . అందుకు మాత్రం తప్పకుండా మరిన్ని అభినందనలు. ఈ రోజుల్లో అలా వ్రాయకపోయినా పద్యాలనే పిలవబడుతున్నాయన్నది కూడా వాస్తవమే! ఇవి ప్రయోగాల రోజులు కాబట్టి, వాటితో రికార్డులు సృష్టించటమే ఘనతగా ఉన్న రోజులు కాబట్టి, అన్నమయ్యకూ ఈ ప్రయోగాల దెబ్బ బాగానే తగిలింది కాబట్టి, 'ఎలా వుంటుంది .. బ్రహ్మాండంగా వుంటుంది.. కాదంటారా' అంటే ఇంకేం అంటాం? ప్రశ్నకు జవాబుకూడా నిర్వాహకులే చెప్పాక?
ఐతే తప్పనిసరిగా దిజయమౌతున్న ఈ వినూత్న సామూహికశతకభాండంలో అనేక మకుటధారి పద్యాలు వఛ్ఛిపడిపోయాయి. ఇప్పుడు వాటి గురించి నిర్వాహకులు కొంచెం ఆలోచించాలి మరి.
ఒకప్పుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు చెప్పిన పదజాలం వాడి చెప్పాలంటే, ఇలాగైతే మననూత్నప్రియత్వపు దెబ్బకు ఈ ప్రాచీన పద్యకళాప్రక్రియ తట్టుకోలేదేమో. అవశ్యం హైజాక్ ఐపోతుంది. కానివ్వండి. తెలుగుభాషయే హైజాక్ ఐపోతోంది. ఇక తెలుగు పద్యాలెంత. మహాగజాః పలాయంతే, మశకానాంతు కా గతిః?
ఏదో నా అభిప్రాయం నాది. చెప్పాలనిపించింది. చెప్పాను. ఎవరిమీదా అలకలాంటిదేమీ లేదు. నేనెంతవాడిని. కాలప్రభావాన్ని నేనైనా ఎవరైనా చూస్తూ ఉండక చేసేది లేదు! పోనీయండి. ఎవర్నైనా, ముఖ్యంగా ఈ ప్రక్రియానిర్వాహకులను నొప్పించి ఉంటే పెద్దమనస్సుతో ఈ ఛాందసుణ్ణి కాస్త క్షమించటానికి ప్రయత్నించవలసిందిగా విజ్ఞప్తి.
అయ్యా ! నాదొక విన్నపం..అందరూ ' ' జడపదార్ధం ' తోనే పద్యాలల్లనన్నారు.ఎక్కడొ ఒకచోడ ' జడ ' పదం రావాలన్నారు..జడ మకుటంగా ఉన్న పద్యాలను ..మొదటనో మధ్యనో లాగా చివరగా జడను ఉంచామనుకొనిన ..అలాగే మకుటం గా లేని పద్యాలనుకూడా స్వీకరిస్తే సరిపోతుంది...అన్ని రుచులూ అందించినట్లవుతుంది..ఇక జడ శతకం అంటున్నాం కదా శతకం కన్నా ముందు (పైన) ఉన్నది కాబట్టి మకుటమైనట్ళే కదా...( సరదాగా ) ....
రిప్లయితొలగించండి‘జడ శతకం’ ప్రకటనపై వెంటనే స్పందించి చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులందరికీ ధన్యవాదాలు. మీ పద్యాలను ఎప్పటికప్పుడు జ్యోతిగారికి పంపించాను. వారు వాటిని ‘జడ శతకం గ్రూపు’లో ప్రకటించారు కూడా..
రిప్లయితొలగించండిమన తెలుగు చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిబి.యన్. మూర్తి గారు ‘బ్నిం’గా సుపరిచితులు. జ్యోతిగారు వారి గురించే ప్రస్తావించారు.
పెద్దలు శ్యామలీయం గారికి సగౌరవ ప్రణామాలు మీరు నిష్క్రమించడం విచారకరం !!
రిప్లయితొలగించండిపెద్దలు శ్యామలీయం గారికి సగౌరవ ప్రణామాలు మీరు నిష్క్రమించడం విచారకరం !!
రిప్లయితొలగించండిశ్యామలరావు గారు,
రిప్లయితొలగించండినాదీ అదే అభిప్రాయమే.
అమ్మా జడలను వేయగ
రిప్లయితొలగించండిరమ్మా మరి గంట మ్రోగె రయముగనైనన్
డుమ్మా కొట్టక వెళ్ళెద
బమ్మెరకవి పాఠములను బడిలోవినగన్
జడలేక చిన్ని కృష్ణుడు
రిప్లయితొలగించండిముడిపింఛము దూర్చి తాను ముద్దులొలుకునా !
జడలేక శివుడు గంగను
ముడిబెట్టుచు నాపగలడ మురిపించు జడా !
మందార తైలములతో
రిప్లయితొలగించండిసుందర వేణీ చయమును చూడగ పడతుల్
కొందరు వెచ్చింతురు మరి
వందలు వేలును, జడయన వారికి వలపే!!
తిట్టరె మగువలు జడలను
పెట్టిన రంగులు తొలగగ పెట్టును బయటన్
గుట్టుగ నుంచదు వయసును
కట్టడి సేయుట పడతికి కష్టము కాదే!!
జడ పొడుగును గనిన జనులు
విడువక దానిని పొగిడిన వెలదులు మురిసెన్
జడకు జతగ పేలు కలయ
గడబిడ యయ్యను నఖముల కార్యము జరిగెన్!
బారెడు జడ గతమయ్యెను
మూరెడె నేడిట మిగెలెను, ముందేమగునో!
భారత పలుకులు మరి బం
గారు, "గతము మేలు వచ్చు కాలము కంటెన్"!
వాలములు లేని కపులీ
గోలలు సేసెడి మగలని గోముగ యనినన్
వాలములే జడలయ్యెను
కాల మహాత్మ్యమని నవ్వె కాంతను కనుచున్!!
మూరెడె నేడిట మిగెలెను, ముందేమగునో!
రిప్లయితొలగించండిజీ యస్ యన్ గారూ ! మీ జడ పద్యాలు అదిరాయండీ !
నాలుగోపాదం చిట్టచివర వుండే పదం .. మకుటం ఏమిటి ?? నెత్తిమీద వుండేదాన్ని మకుటం అనాలి ..చివ్వరిదాన్ని ' పద పీఠము ' అనాలి అసలు ( ఇది కార్టూనిస్టు నాలడ్జ్ ..పాపం ) అని బ్నింగారి ఛలోక్తి.
రిప్లయితొలగించండిదైవదర్శనం చేసేటప్పుడు దృష్టి తొలుతగా పాదాల మీదకు పోనిచ్చి పిదప క్రమంగా దానిని శిరస్సు వరకూ సారించాలన్నది నియమం అనుకుంటాను. పద్యం పరమపవిత్రంగా, సాక్షాత్తూ సరస్వతీస్వరూపంగా భావింపబడే ఛాందసపు రోజుల్లో పద్యారంభం పాదస్థానమూ పద్యంసంపూర్ణమయ్యే స్థానం శిరస్థానంగానూ గ్రహించబడేది. కాబట్టి పద్యం చివరకు ఉండే పదబంధమే మకుటం అనిపించుకుంటున్నది. హెచ్చుభాగం శతకాలు భక్తిప్రథానమైనవి కాబట్టి దైవసంబోధనం అన్నది పద్యంలో మకుటాయమానమైన సంగతి కాబట్టి అదే మకుటం ఆనటం సబబుగా ఉంటుంది.
ఈ నాడు కాలప్రభావం కారణంగా, పద్యం కేవలం వినోదం కలిగించే సరుకు మాత్రమే అవుతున్నది. తలాతోకా లేని రచనలూ పద్యరచన లనిపించుకుంటున్న నేటి రోజుల్లో, ఏది పద్యానికి శిరఃస్థానమూ ఏది పాదస్థానమూ అన్న చర్చ అసంగతం ఐపోతున్నది.
చక్కని జడతో నొప్పుచు
రిప్లయితొలగించండిమిక్కిలి మెఱవడిఁ గలిగిన మెలతను కంటిన్
గ్రక్కున మనము చలించగ
మక్కువతో చేరితిదరి మారుని హతితో
నల్లని జడ కాంతులతో
నల్లరిపిల్ల జఘనమున నల్లనఁ గదలన్
చల్లని సాయంకాలము
నుల్లము సంతసము నొందె నూష్మము తోడన్
వాలుజడలోన మెండుగ
పూలఁ దుఱిమియోలతాంగి పులకలు రేపన్
గాలమునఁ బడ్డ మీనము
నై లలన వెనుక తిరిగితి నానందముగా
శ్రీకరుని సత్య కొంగున
రిప్లయితొలగించండినే కారణమున బిగించె నెరుగన్ దరమా?
తాఁ గులికెడు భంగిమలో
నో కరమున నిన్ను బట్టి హొయలొలుక జడా!
మోహిని సుధఁ బంచెడు కో
లాహలమున నీ సొగసుల లాస్యము శివునే
యూహళ్లో తేల్చి మరుల
బాహాటముగఁ గురిపించ బలమీవె జడా!
తరుణీ మణి జీవితమున
మురిసే ప్రతి యంక మందు పొంకము నీవే!
విరులల్లిన నీ హొయలే
సరసమ్మున పతిని దేల్చు సాధనము జడా!
పరిచర్యలఁ జేయు గృహిణి
శిరమున కొప్పై కురచగ సేవింతువుగా!
పరివారమునకు పనులన్
పురమాయించెడు పొలతికి పోసరము జడా!
కోరిన కోర్కెలు దీరగ
గారముగ పతిని బట్టు గాలము నీవే!
దారికి రాకను నిక్కిన
చుర చుర మని జూచి కొట్టు చొలకాలు జడా!
( చొలకాలు = బండి నడిపే సమయంలో యెడ్లను తోలే సాఢనం )
కొమ్మా! ముద్దుల గుమ్మా!
రిప్లయితొలగించండిఅమ్మో! నీజడ తగులగ నానందమున
న్నిమ్మగు కలలను కంటిని
కమ్మని నీ కౌగిలినను కరగినటులుగన్
దేవుని వద్దను మ్రొక్కిడి
రిప్లయితొలగించండిధీవనితలు గుండు సేయ తిరుపతి లోనన్
చావుకు సిద్ధంబౌదువు
నీవచ్చట త్యాగమయివి నిక్కముగ జడా !
https://www.facebook.com/groups/1483014091957033/
రిప్లయితొలగించండిలింకు తెరుచు కొనుట లేదు..ఇంకేదైనా పద్ధతి ఉందా ...
శ్యామలరావు గారు మకుటాన్ని బాగా నిర్వచించినారు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిహనుమచ్ఛాస్త్రి గారు, మీరు ముందుగా ఫేస్ బుక్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాతే గ్రూపులో ప్రవేశించవచ్చు. గ్రూపు పోస్ట్ లు చూడవచ్చు.
శ్రీ శ్యామలీయం గారికి నమస్సులు. చక్కని వివరణతో పద్య గౌరవాన్ని నిలబెట్టిన మీకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిచివరి పద్య సవరణ:
రిప్లయితొలగించండికోరినకోర్కెలు దీరగ
గారాముగ పతిని బట్టు గాలము నీవే!
దారికిరాకను నిక్కిన
చుర చుర మని జూచి కొట్టు చొలకాలు జడా!
( చొలకాలు = బండి నడిపే సమయంలో యెడ్లను తోలేసాఢనం )
వ్యావహారికంలో వ్రాసేటప్పుడు అటువంటి ధారని చూపాలి. ఉదాహరణకి ఒక పద్యం చెప్పుతాను
రిప్లయితొలగించండిజడ మీద ఎన్ని పద్యాల్
దడదడ వడగళ్ళ లాగ దబ్బున కురిసెన్
జడదెబ్బల రుచితెలిసిన
గడుసరి కవులెట్లు రాయగలరో కనుడీ!
ఐతే ఇలా వ్రాయటం నా ధోరణి కాదు సాధారణంగా.
నేను సైతం
రిప్లయితొలగించండిగడుసరి పడతులు ముడులను
విడుచుచు యెడపెడ కురులను విసరుచు తిరుగున్
నడుమున నడిపడి నూగెడు
జడయే జవ్వనికి ఫణిగ జక్కన గాదే!
పొడగరి వనితలు జూడగ
రిప్లయితొలగించండిజడపొట్టిగ నుండ నోపజాలరు, సవరం
సడిలేకను కట్టుదురుగ
ముడికనిపెట్ట కనికట్టు మోసంపు జడా !
జడవకనే ఆయిల్సును
రిప్లయితొలగించండిపొడవగుటకు, షాంపు లెన్నొ పోషణమునకై
తడవకు తురుమగ పూలను
తడవక వానలను జూడ తరమేన జడా !
ఇకపై ..జడశతకానికి తమపద్యాలుకూడా కలపదల్చిన కవిమిత్రులందరూ తమతమ పద్యాలు ఇక్కడ ప్రముఖులకి చూపించినా .. పజ్యాలు మాత్రం (ఖచ్చితంగా 5 పంపవలెను ) jada.sathakam@gmail.com కి మాత్రమే పంపాలి . అనవసరమైన చర్చలూ .. ..పరనిందలూ.. ఆత్మస్తుతులు భజనలూ లేకుండా 5 పద్యాలు .ఫోటో . పూర్తీ ఎడ్రస్సూ ..మొబైల్ నెంబర్లూ 10 లైన్ల స్వీయపరిచయం పంప ప్రార్ధన .. ముందు అనుకుంటున్నట్లు ..అనవసర సంస్కృత పదాలు సంధులూ లాంటి పాదాలు వద్దు .. .. సెటైరూ .. చమత్కారం భాషాల్లో వేమన శ్రీశ్రీల్లా సారళ్యవ్యావహారికం (మణిప్రవాళాలైనా పర్వాలేదు )లో వేద్దాము. పండిత ప్రశంసలు కన్నా అంతంతమాత్ర పద్యపాఠకులని అలరించేలా చదివించేలా ..మీ భావాలు లాలిత్యం లో అందిచాలని .. గణబద్ధంగా కందపద్యాన్ని చెప్పమని విజ్ఞులని వినమ్రంగా వేడుకుంటున్నాను మకుటం పెడితే అన్నీ జడను సంబోధించినట్లు పద్యాలు మూసలో వస్తాయని దాని ప్రాధాన్యతని త్యజించాలని నిర్ణయించాము..ఒక్కోరచయితవి ఎన్నిపద్యాలు తీసుకునేదీ సంపాదకులనిర్ణయం ...
రిప్లయితొలగించండిఅల్లరి పిల్లకు జడలే
రిప్లయితొలగించండిఅల్లుచు తానుండ తల్లి, అలకలతోడన్
మెల్లగ కదలగ నెత్తిన
జెల్లను వేయుటయె మంచి సీనౌను జడా !
చివరి పద్య సవరణ :
రిప్లయితొలగించండికోరినకోర్కెలు దీరగ
గారముగ పతిని బట్టు గాలము నీవే!
దారికిరాకను నిక్కిన
సోరమ్ముగ వచ్చి కొట్టు చొలకాలు జడా!
( చొలకాలు = బండి నడిపే సమయంలో యెడ్లను తోలేసాఢనం )
ఇది సామూహిక పద్యవిన్యాసం కాబట్టి శతక పరిధి చాలా స్వల్పమౌతుందేమో! "జడ పద్య సహస్రం" గా మార్పుచేస్తే బావుంటుందేమో యోచించండి "బ్నిం" గారు
రిప్లయితొలగించండివాలుజడను గాంచి హరియె
రిప్లయితొలగించండివాలెను సత్య చరణములఁ బరతంత్రుండై
కూలరె మానవు లందము
గా లలనల వెన్నున జడ కదలుచు నుండన్
చీరలుఁ గట్టెడి పడతికి
రిప్లయితొలగించండిబారెడు జడ అందమొసగు, ప్యాంటులుఁ దొడిగే
నారికి పోనీటైలే
గ్యారెంటీగా పొసగును, గదరా శ్యామా!
జడ పైన పద్యలు బాగున్నాయ్
రిప్లయితొలగించండి