17, ఆగస్టు 2014, ఆదివారం

నిషిద్ధాక్షరి - 5

‘ర’ అనే అక్షరాన్ని ఉపయోగించకుండా
శివధనుర్భంగం గురించి
మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.

35 కామెంట్‌లు:

  1. జనకుని కొలువున గాధే
    యుని యానతిన శివధనువు యుక్తిగ సంధిం
    చిన యది పెళ పెళ మనుచున్
    తునుగగ కౌసల్య సుతుడు తోడ్కొనె సీతన్

    రిప్లయితొలగించండి
  2. ముని యాజ్ఞను గైకొని యా
    జనకుని సభలోన శివుని చాపము నెత్తెన్
    తనసతిగా సీతను గొని
    జనె కౌసల్యాసుతుండు జనకుడు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  3. జనకుని సభ కనులను గన
    గొనకొని శివధనువున నొక కొననిటు వంచన్
    ఇనకులమణి, సగముగ నది
    తునుగగ తన సగముగాయె తోయజముఖియే.

    రిప్లయితొలగించండి
  4. కొన్ని మార్పులతో .. అన్నీ లఘువులు కావాలని..

    జనకుని సభ కనులను గన
    గొనకొని శివధనువున నొక కొననిటు నడచన్
    ఇనకులమణి, సగముగ నది
    తునుగగ, సగముగ జనకుని దుహితయె నిలిచెన్.

    రిప్లయితొలగించండి
  5. ఉత్సాహ: శివ ధనువును దునిమి నీవు సీత చేయి బట్టి, యా
    జవనుడు ఘన గాధిజు బల జయము నణచబూని, సం
    స్తవుని చేతనున్న విష్ణు ధనువు కూడ దుంచి మా
    యవనియంత గాచినావు యనఘ ! ఇనకులాత్మజా!

    జవనుడు = ముని
    గాధిజుడు = విశ్వామిత్రుడు
    బల జయము = గర్వము

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘గాధే/యుని యానతి శివధనువును యుక్తిగ...’ అంటే పద్యం నడక సాఫీగా ఉంటుంది.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    పద్యంలో ‘జనక’ శబ్దం రెండు సార్లు వచ్చింది. ‘జనె కౌసల్యాసుతుండు జనులు నుతింపన్’ అంటే ఎలా ఉంటుంది?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ సర్వలఘు కందం బాగున్నది. అభినందనలు.
    *
    మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. జనుకుని కలత, సతి భయుము
    దనుజుల బలమహితశక్తి, తామసబాధల్
    ఇనకులమణిచే తెగెనట
    పినాకిధన్వాంకమగుచు భీషణగతితో

    మహాకవి కరుణశ్రీ పద్యమే ముందు నిలుస్తుంది. ఇలా ఎవరు వ్రాయగలరు?

    "ఫెళ్ళుమనె విల్లు,ఘంటలు ఘల్లుమనే, గు
    భిల్లుమనె గుండె నృపులకు ఝల్లుమనియె
    జానకీ దేహమొక నిమేషమ్మునందె
    నయము జయమును భయము విస్మయము కదురా"

    నృపలకు = విభులకు, కదురా = గలిగెనె అని మార్చి కరుణశ్రీవారు పూరించేవారేమో !

    రిప్లయితొలగించండి
  8. అవనిజ కనుదోయి వెలయ
    శివధనువెత్తి దునుమాడి చేపట్టె కుజన్
    దివి భువి నుతించె సత్యుని
    ప్రవిమలమగు భక్తితోడ వందన మనుచున్

    రిప్లయితొలగించండి
  9. నోట్ల కట్టలపై పద్యాలను ఆలశ్యంగా చూడటం జరిగింది కనుక తత్సంబంధిత విషయం ఇక్కడ వ్రాస్తునాను. శ్రీమతి శైలజ గారి రెండవపద్యంలో మూడవ పాదంలో "తెలుపు నలుపుల తేడాలు దేముడెరుగు" అన్నారు. ఈ "దేముడు" అనే పదం సాధువేనా?? దేవ శబ్దమ్నుండి పుట్టినది "దేవుడు". దేముడు అన్న పదానికి ఏ నిఘంటువులోనూ అర్ధం కానరాదు మరి. కాస్త పెద్దలు వివరిస్తే బాగుంటుందేమో...

    రిప్లయితొలగించండి
  10. శైలజగారూ పూరణ
    శైలిసుభగమే "ప్రవిల ని"షాదియు గాదా?

    రిప్లయితొలగించండి
  11. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    శివుని విల్లెక్కు పెట్టె సులువుగ యినకు
    లమణి ,ఫెళ్ళున ధనువు భంగమవ సీత
    గుండె ఝల్లనె కౌసల్య కొడుకు మెడను
    మాల వైచెను సభికులు హేలజెంద

    రిప్లయితొలగించండి
  12. ఫెళ్ళు మనెన్ హిమాద్రిసుతపెన్మిటి చాపము, సీత కంతటన్
    ఝల్లు మనెన్ శుభాంగకము, సన్నగ పొంకము సూపె మౌనికిన్,
    పెల్లుబికెన్ విదేహునకు ప్రీతి మనమ్మున, దైత్యకోటికిన్
    గుల్లయె గుండె లయ్యెడను, గుట్టుగ నవ్వెను కౌసలేయుడున్.

    రిప్లయితొలగించండి
  13. మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీరు చెప్పినట్లుగా జంధ్యాలవారి పద్యంలో చివరి పదం ‘కదుర’ను ‘చెలగ’ అని మార్చితే ఈనాటి నిషిద్ధాక్షరికి చక్కని లక్ష్యం అవుతుంది. ధన్యవాదాలు.
    శైలజ గారి విషయంలో మీ అభ్యంతరం సహేతుకమే.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ర’ సంయుక్తాక్షరంగా కూడా ప్రయోగం నిషేధమే.
    ‘పవనజనుతు భక్తితోడ వందన మనుచున్’ అందామా?
    *
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    అది దోషమే. దేముడు శబ్దం గ్రామ్యమే. నిన్న సమయాభావం వల్ల నేను కేవలం సమస్యాపూరణలనే సమీక్షించాను.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ వృత్తం బాగున్నది. అభినందనలు.
    ‘హిమాద్రి, ప్రీతి’ శబ్దాలు నిషిద్ధాక్షరి నియమానికి విరుద్ధం. ‘హిమాద్రిసుత’ను ‘హిమాగసుత’, ‘ప్రీతి’ని ‘వేడ్క’ అనండి.

    రిప్లయితొలగించండి
  14. తునిచెను శివచాపంబును
    జనకుని కొలువందు నవనిజానులు జూడన్
    తనియించెను భృగునందను
    మనువాడెనినకులతిలకుఁ మైధిలి నెమ్మిన్

    రిప్లయితొలగించండి
  15. కోసలేశుని తనయుడు చూసి యెత్తి
    శివ ధనుస్సును వంచెను సీత వేసె
    యతని గళములో పూ మాల ననుగు తోడ
    సంత సంబొందె జనకుడు సభికు లెల్ల

    రిప్లయితొలగించండి
  16. కోసలేశుని తనయుడు చూసి యెత్తి
    శివ ధనుస్సును వంచెను సీత వేసె
    యతని గళములో పూ మాల ననుగు తోడ
    సంత సంబొందె జనకుడు సభికు లెల్ల

    రిప్లయితొలగించండి
  17. ఫెళ్ళు మనగ విల్లు ఝల్లు మనియె మఱి
    యవని పతుల గుండె నా క్షణమున
    పూలమాల వేసె పూబోడి మెడలోన
    నినకు ల మణి మిగుల నింపు గలుగ

    రిప్లయితొలగించండి
  18. మల్లెల వారి పూరణలు
    శివధనుర్భంగ ఘట్టము

    శివుని విల్లెత్త, పేడిల్ల, సీతయపుడు
    కోస లేశుని మెడలోన కోమలముగ
    పూల మాలను వేయంగ పూతమయ్యె
    పుడమి మాతయె పులకించె పూలు విచ్చ

    కోసలేశుడు కౌశికు కొలువ, నపుడు
    మిథిల కేగెను, శివు విల్లు మీది కెత్తి
    ఫెళ్లున దునుమ, సీతమ్మ పెనిమిటతడె
    యనుచు, వేసెను పూమాల నందముగను

    రిప్లయితొలగించండి
  19. సంధించెన్ శివ చాపమంత; మిధిలేశానందనన్ తా మదిన్
    బంధించెన్; ధనుజాధినాధు నెడదన్ భంజింపగా చాపమున్
    సంధించెన్; విదళించె దాని నిన వంశాబ్ధీందు; డందంబుగా
    బంధించెన్ సుజనాళి మానసములన్ బద్మాక్షు డుల్లాసమున్

    రిప్లయితొలగించండి
  20. గురువుగారూ సవరణకు ధన్యవాదాలు.

    నేను ర అనే అక్షరాన్ని ఉపయోగించకూడదు కానీ రేఫానికి నిషిద్ధం ఉంది అనుకో లేదు.

    రిప్లయితొలగించండి
  21. ఇనకుల తిలకుడు వెసగను
    ఘనమగు శివధనువు నెత్త కలయో నిజమో
    యని పలుదేశాల పతులు
    కనుగొను చుండగ జనకుని కన్నియఁ బట్టెన్

    రిప్లయితొలగించండి
  22. ప్రణామములు గురువుగారు...నిషిధ్ధాక్షరి లో నేను పద్యం వ్రాయడం ఇదే ప్రధమం ప్ర కూడా నిషిధ్ధమని తెలియదు ..మన్నించ ప్రార్దన...


    అలాగే నిన్నటి నోట్ల కట్టల పద్యములో దేముడు అని వ్రాశాను.. పొరపాటుకు మన్నించవలెను..

    రిప్లయితొలగించండి
  23. శ్రీ చంద్రమౌళిగారికి ,శ్రీ కామేశ్వరశాస్త్రిగారికి కృతజ్ఞతలు..

    రిప్లయితొలగించండి
  24. కలయో మాయనుకొందుమో ఘనత నాకౌసల్య సూనుండు తా
    నెలమిన్ శంభుని చాపమున్ తునిచె తానే విష్ణు వయ్యుండునో
    బలిమిన్ సీతను చేగొనంగ తగు నీబాలుండనన్ మానసం
    బుల దల్చెన్ మిధిలా జనుల్ గనుచు నా పుణ్యోత్తమున్ శాంతులై

    రిప్లయితొలగించండి
  25. బేసి కన్నుల వాని భీమ చాపము నెత్తి భంజించె నినకుల భానుడంత
    దిక్కులన్నియు నూగె దిక్కులు దప్పుచు భువన భాండములన్ని బొబ్బటిల్లె
    జనకుని సభనందు జనులంత నానంద ముప్పొంగ పులకించ ముగ్ధ సీత
    కోసలేయుని పాణి గొనె నంత నెల్లలోకములందు నుత్సవ కాలమయ్యె

    రిప్లయితొలగించండి
  26. ఫెళ ఫెళ లాడె విల్లమట ఫెళ్ళను శబ్దము దాకె దిక్కులన్
    కళ వెళ పాటు నొందగను కాలము చేష్టలు దక్కి జూడగన్
    తళతళ లాడు వెల్గులను తా జనకాత్మజ మోము సిగ్గుతో
    కళకళ లాడె నంతభువి కన్నియ కోసల పట్టి చేగొనెన్

    రిప్లయితొలగించండి
  27. నానా ఛంద విశేషవస్త్ర మభి"శీనం"పద్యముల్ హృద్యమై

    రిప్లయితొలగించండి
  28. మాధవుడే రాముండై
    మాధవియౌ సీత నందె మౌనియె తోడై
    యాధనువు నెక్కు పెట్టగ
    నాదము జేయుచు తునిగిన నాధుండగుచున్!



    రిప్లయితొలగించండి
  29. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు!


    తునిమి తాటకం, దాపసితోడఁ జనియు,
    జనక జనపాలు సభను భస్మాంగు ధనువు
    భంజనము సేసి, నయనోత్సవమ్ము సభకొ
    సంగి, సీతఁ జేపట్టెఁ గౌసల్యపట్టి!

    రిప్లయితొలగించండి
  30. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వేసె/ నతని గళములో...’ అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘గుండె లా క్షణమున’ అనండి.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘పెనిమిటి + అతఁడె’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘విభుఁ డతండె’ అనండి.
    *
    ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
    వివిధచ్ఛందాలలో మీరు వ్రాసిన నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘మిథిలేశనందన, మాయ = అనుకొందుమో = మాయ యనుకొందుమో, విల్లమట (?) - విల్లచట... ఇవి కొన్ని లోపాలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వెసగను’..? ‘తా వెస’ అనండి. చివరిపాదంలో గణదోషం. ‘...జనక కన్యను బట్టెన్’ అనండి.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాని ‘రాముడు’ అన్నారు. అక్కడ ‘మాధవుఁడే యినకులుఁడై’ అన్న సవరణను (ఫోన్ ద్వారా) సూచించినవారు గుండు మధుసూదన్ గారు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    సహదేవుడు గారి పూరణకు సవరణను సూచించినందుకు ధన్యవాదాల.
    *
    యం.ఆర్.చంద్రమౌళి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  31. ఫూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణకు కృతజ్ఞతలు. చివరి పాదంలో మూడవ గణము జగణము గాని నలం గాని ఉండాలి గదా. "జనకు" అంటే నగణమే వస్తుంది గదా.

    రిప్లయితొలగించండి
  32. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    నిన్న మీ చివరిపాదంలో గణదోషం అని ఎలా అనుకున్నానో నాకిప్పుడు అర్థం కావడం లేదు... ఆ పాదం సరిగానే ఉంది. సవరణ అవసరం లేదు. పొరపాటుకు మన్నించండి.

    రిప్లయితొలగించండి
  33. గురుదేవులకు ధన్యవాదాలు. పద్యం ప్రచురించి నిద్రించే సమయంలో తప్పు జరిగినట్లు, దానిని ఉదయం యినకులుడై అని సవరిద్దామనుకుని బ్లాగు తెరిచే సరికి అదే సవరణను శ్రీ గుండు మధుసూదన్ గారు సూచించిన విషయం తెలిసింది. వారికి మరియు
    శ్రీ రాజణ్ణ చంద్రమౌళీ గారికి ధన్యవాదాలు.
    సవరించిన పద్యం :
    మాధవుడే యినకులుడై
    మాధవియౌ సీత నందె మౌనియెతోడై
    యాధనువు నెక్కు పెట్టగ
    నాదము జేయుచు తునిగిన నాధుండగుచున్!

    రిప్లయితొలగించండి
  34. సీతను పెండ్లాడ శివధను వొకదాని
    నెత్తి ముక్కలు చేసెనెంత బలుడ
    టంచును చెప్పికొనంగ నెన్నడు నైన
    మాకెట్టి యలుపది? మక్కువ కద,
    మధుబిందువులఁబోలు మాటల యందున
    పలుకుచుందుమెపుడు భవ్యకథల
    విన్న చెవులకెల్ల వేడుకయైనట్లె
    పాడెడు నోటికి పదిలమగును.

    హనుమ నేలువాని కంతట జయమగు
    మాట గాచు స్వామి! మంగళమ్ము.
    తమ్మునిఁ గని సంతతమ్ము సంతసపడు
    దేవుకెల్ల వేళ దివ్యజయము.

    రిప్లయితొలగించండి