గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని ఎలుక తన కలుగులోనికి బేకరినే ఎత్తుకుపోయిందా? * గుండు మధుసూదన్ గారూ, మీ పిండిబొమ్మ పూరణ బాగున్నది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటిపూరణ మొదటి పాదంలో గణదోషం. ‘పరమాన్నము భక్ష్యమ్ముల/ నరిసెలు నాదిగ నిడుటకు నా సిరి పూజన్’ అందాం.
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. చంద్రమౌళి గారు నాలుగవ గణము జగణము వాడారు(రెండవ పాదము మొదటి గణము). అక్కడ జగణము వాడ వచ్చా. దయ చేసి తెలియ జేయండి.
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, చంద్రమౌళి గారి ప్రయోగం సరియైనదే. అక్కడ (జరాతి) జగణం దోషం కాదు. కందంలో రెండు పాదాలను ఒక భాగంగా గ్రహిస్తే (1,2 పాదాలు ఒక భాగంగా, 3,4 పాదాలు మరొక భాగంగా గ్రహిస్తే ఒక్కొక్క భాగంలో ఎనిమిది గణాలుంటాయి)అందులో బేసిగణంగా జగణాన్ని వాడరాదు. అలాకాక కందాన్ని నాలుగు పాదాలుగా గ్రహిస్తే బేసి (1వ,3వ) పాదాలలో బేసిగణంగా, సరి (2వ,4వ) పాదాలలో సరిగణంగా జగణాన్ని ప్రయోగించరాదు. * భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మరి రాత్రి వాటి (బ్రెడ్డు ముక్కల్ని) గని బే కరిని (బేకరిలో).... ఎత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్. . అని నా భావం..ఆ అర్థం రాలేదంటారా... మరొక ప్రయత్నం చేస్తాను.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. కాని పూరించిన భావం సదిగ్ధంగా ఉంది. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, సప్తమ్యర్థంలో ద్వితీయను ప్రయోగించానంటారు. బాగుంది మీ సమర్థన. సంతోషం! రెండవ పూరణలో క్రొత్త వంటకాన్ని పరిచయం చేశారు. బాగుంది పూరణ. అభినందనలు. ఈ పూరణ చూస్తే జంధ్యాల సినిమాలో (పేరు గుర్తులేదు) శ్రీలక్ష్మి చేసిన వంటకం గుర్తుకొచ్చింది! * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
హరిదాస్ బేకరిలో పడె
రిప్లయితొలగించండిసరి బ్రెడ్డుల ముక్కలిన్ని సర్దుటలోనే
మరి రాత్రి వాటి గని బే
కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్.
మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రులందఱకును నమస్సులు...
రిప్లయితొలగించండితరుణి, కొడుకుకయి పిష్టపుఁ
గరిఁ జేయఁగఁ, గొడుకు దాని ఘనముగఁ గొని, వే
గిర మాడి, విడువఁ, బిష్టపుఁ
గరి నెత్తుకుపోయి, యెలుక, కలుఁగునఁ దినియెన్!
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిచిరుతుక లాడగ మిగిలిన
కరకజ్జము తమలపాకు కదళి ఫలము శ
క్కరలక్ష్మి బొమ్మ శుభ౦
కరి నెత్తుకు పోయి యెలుక కలుగున దినియెన్
అరుగుల బాజ్రా రొట్టె గు
రిప్లయితొలగించండిజరాతి పాచకడు పెరటి చాటున బెట్టెన్
మిరిమిడి మిరిజూపున భ-
క్కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని ఎలుక తన కలుగులోనికి బేకరినే ఎత్తుకుపోయిందా?
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పిండిబొమ్మ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
యం.ఆర్.చంద్రమౌళి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండి1.పరమాన్నము భక్ష్యమ్ము
లరిసెలు నాదిగ నిడుటకు లక్ష్మికి పూజన్
వరసగ పళ్ళెములో రుచి
కరి నేత్తుకు పోయి యెలుక కలుగున దినియెన్
2.దొరకక దొరకక యొకనికి
నరుదుగదొరికిన ఫలమది నారోగ్యముకై
పరువిడి వచ్చియు నారుచి
కరి నేత్తుకు పోయి యెలుక కలుగున దినియెన్
3.దొరికినవానిని గృహమున
విరివిగ తినియెదు నెలుకనువేటాదంగా
యెరగా విసమిడ నారుచి
కరి నేత్తుకు పోయి యెలుక కలుగున దినియెన్
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణ మొదటి పాదంలో గణదోషం. ‘పరమాన్నము భక్ష్యమ్ముల/ నరిసెలు నాదిగ నిడుటకు నా సిరి పూజన్’ అందాం.
పరిమళ పెడ్లికి జేసిరి
రిప్లయితొలగించండినరిసెలు శర్కర చిలుకలు నసురము లెన్నో!
మురియుచు దొరికిన చక్కెర
కరి నెత్తుకుపోయి యెలుక కలుగున దినియెన్
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. చంద్రమౌళి గారు నాలుగవ గణము జగణము వాడారు(రెండవ పాదము మొదటి గణము). అక్కడ జగణము వాడ వచ్చా. దయ చేసి తెలియ జేయండి.
రిప్లయితొలగించండిపురమున గల మేలగు చ
రిప్లయితొలగించండిక్కెర బొమ్మల నమ్ము చోట గేహిని యుంచ
న్నరి వీర భయంకరి శాం
కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
చంద్రమౌళి గారి ప్రయోగం సరియైనదే. అక్కడ (జరాతి) జగణం దోషం కాదు.
కందంలో రెండు పాదాలను ఒక భాగంగా గ్రహిస్తే (1,2 పాదాలు ఒక భాగంగా, 3,4 పాదాలు మరొక భాగంగా గ్రహిస్తే ఒక్కొక్క భాగంలో ఎనిమిది గణాలుంటాయి)అందులో బేసిగణంగా జగణాన్ని వాడరాదు.
అలాకాక కందాన్ని నాలుగు పాదాలుగా గ్రహిస్తే బేసి (1వ,3వ) పాదాలలో బేసిగణంగా, సరి (2వ,4వ) పాదాలలో సరిగణంగా జగణాన్ని ప్రయోగించరాదు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కర కర లాడెడు విధమున
రిప్లయితొలగించండిహరవగు వివిధ మృగ జాతి యాకృతులెల్లన్
వరి పిండితోడ జేయగ
కరి నెత్తుక పోయి యెలుగ కలుగునఁ దినియెన్!
నిన్నటి సమస్యకు నా పూరణ:
రిప్లయితొలగించండిజీవిత మంత రామునికి చేరువగా గడపంగ దల్చి యా
భావనతోడ సీత వనవాసము చేయగ మోసగించి యా
పావని నెత్తుకెళ్ళి బహు బాధలు వెట్టగ చంపె రాముడా
రావణుఁ, జేరె సీత యను రాగము లొల్కెడు పల్కులాడుచున్
మేవడి నొప్ప భర్తకడ మిక్కిలి మోదము గల్గుచుండగా!
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పరమగు దినమున నొక్కరు
రిప్లయితొలగించండిపరమాన్నము, పంచదార, ప్రతిమలఁ జేయన్
వరదునికైనిడిన ప్రతిమ
కరి నెత్తుకు పోయి యెలుక కలుగున దినియెన్
కరమది పొడవుగ లదగుట
రిప్లయితొలగించండికరి ,నెత్తుకు పోయి యెలుక కలుగున దినియె
న్జరజర బోవుచు నంగడి
నరయంగా నొక్క బల్లి నాహారముగన్
ఆర్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమరి రాత్రి వాటి (బ్రెడ్డు ముక్కల్ని) గని బే
కరిని (బేకరిలో).... ఎత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్. .
అని నా భావం..ఆ అర్థం రాలేదంటారా...
మరొక ప్రయత్నం చేస్తాను.
' బెరిజిలకరి ' యను పేరున
రిప్లయితొలగించండిసరిక్రొత్తగ వంటకమ్ము సతియే జేసెన్
మరి పతియె త్రోయ ' బెరిజిల
కరి ' నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్
మరచితి తఱగిన కూరల
రిప్లయితొలగించండిపొరబాటున వంట యింట మూతలు లేకన్
సరగున ఖండంబగు క
ర్కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
కాని పూరించిన భావం సదిగ్ధంగా ఉంది.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సప్తమ్యర్థంలో ద్వితీయను ప్రయోగించానంటారు. బాగుంది మీ సమర్థన. సంతోషం!
రెండవ పూరణలో క్రొత్త వంటకాన్ని పరిచయం చేశారు. బాగుంది పూరణ. అభినందనలు.
ఈ పూరణ చూస్తే జంధ్యాల సినిమాలో (పేరు గుర్తులేదు) శ్రీలక్ష్మి చేసిన వంటకం గుర్తుకొచ్చింది!
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
అరుగగ వేసవి కాలము
రిప్లయితొలగించండివరిమళ్ళను పాడుజేసి వంతలు పెంచన్
చిరుధాన్యపు మొలకల, తొల
కరి,నెత్తుకుపోయి యెలుక కలుగున దినియెన్
విరిసిన బొమ్మల కొలువున
వరిపిండిని జంతుతతుల వరుసలు జేయన్
సరగున రాతిరివేళ మ
కరి,నెత్తుకుపోయి యెలుక కలుగున దినియెన్
అరలో గల చదరంగపు
రిప్లయితొలగించండికరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ, దినియెన్
వరితో జేసిన కమ్మని
మురుకుల పసిపాప విడువ ముంగిట రేయిన్.
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
గురువుగారికి ధన్యవాదాలు
రిప్లయితొలగించండిఅరయగ మూసల బోసిన
రిప్లయితొలగించండికరిగించిన పంచదార ఖాద్యములందున్
పరుగులు పెట్టుచు శర్కర
కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్
బరువగు కాశ్మీరమ్మును
రిప్లయితొలగించండిపరుగులతో నెత్తినిడుచు భాజప మ్రింగెన్
నరుడా! ఇదియెట్లన్నన్:
కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్