27, ఆగస్టు 2014, బుధవారం

పద్యరచన - 659 (పెద్ద బాలశిక్ష)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
“పెద్ద బాలశిక్ష”

13 కామెంట్‌లు:

 1. ఐ పేడ్ బాల 'శిక్ష'రోజుల్లో
  పెద్ద బాలశిక్ష మరి ఏల ?
  ఐ, పేద బాల ఐతే నేమి,
  ఐపేడ్ లోలాక్షీ ఈ కాలం లో !!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. లక్షలు పోసిన దొరకని
  శిక్షణ పెద బాలశిక్ష శ్రీఘ్రమె యిచ్చున్
  దక్షణ యడగని గురువు, ని
  రక్షరకుక్షులను సాక్షరస్థుల చేయున్

  రిప్లయితొలగించండి
 3. పెద్ద బాల శిక్ష పేరున గలయట్టి
  పుస్త కమ్ము నొప్పె శా స్త్రమునకు
  గోచ రించు నందు గోప్యపు విషయాలు
  చదువు బాల !నీవు శ్రద్ధ గాను

  రిప్లయితొలగించండి
 4. పెద్ద బాల శిక్ష ప్రీతితో నేర్పించ
  నీతి విద్య లందు నేర్పు కలుగు
  భావి జీవితమున భానులై వికసింప
  బాట లేయు సుమ్మ బాలురకును(బాల్యమందు)

  రిప్లయితొలగించండి
 5. శ్రీగురుభ్యోనమ:

  పెద్దబాలశిక్ష వద్దను వారేరి
  పిల్లలైన గాని పెద్దలైన
  విషయ సంగ్రహములు వివరముగ దెలుపు
  పండితులకు మరియు పామరులకు

  రిప్లయితొలగించండి
 6. సకల సమాచారములున్
  నికరముగా తెలుపునంచు నేర్చుట మేలౌ
  నొక పెద్ద బాల శిక్షను,
  రకరకముల నీతులెల్ల రక్షించు మిమున్.

  రిప్లయితొలగించండి
 7. జిలేబీ గారూ,
  మీ భావానికి నా పద్యరూపం....

  అందరి కరములను ఐపేడు శోభించ
  పెద్ద బాలశిక్ష వేస్టు కదర!
  అంద రిచట పేద లైపేడు లోలాక్షు
  లెల్లయెడల కానుపించుచుంద్రు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  క్షప్రాసతో మీ పద్యం వినసొంపుగ నున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘పుస్తక మ్మలరెను’ అనండి.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. తెలియనివెన్నో దెల్పుచు
  సలలితముగ నుండునట్టి శాస్త్రం బిదియే
  తెలుగు పెదబాలశిక్షయె
  కలకాలం వెలుగవలయ కరదీపికగా ! !

  రిప్లయితొలగించండి
 9. పెద్ద బాలశిక్ష పెద్దలుగా దిద్దె
  నాటి పౌర కోటి నయముగాను
  నేటి బాల కిట్టి నిజమైన శిక్షణ
  లేక పోయె నయ్యొ లీలనైన.

  రిప్లయితొలగించండి
 10. బాలలకు శిక్షణయ్యది
  బాలురు పెద్దలుగనైన పలువిషయములన్
  వాలుగ జూపును, నేడే
  వీలుగ పెదబాలశిక్ష విజ్ఞత గొనుమా .

  రిప్లయితొలగించండి
 11. బాలలు వికాస మందెడు
  శీలమునిడు 'పెద్ద బాల శిక్ష' చదువగన్!
  కాలము మారగ నంత
  ర్జాలమె సర్వులకు చదువు సారము దెలుపున్!

  రిప్లయితొలగించండి
 12. పెద్దబాలశిక్షపై చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులు...
  శైలజ గారికి,
  మిస్సన్న గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి
  అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. శైలజ గారూ,
  ‘కలకాలం’ అని వ్యావహారికాన్ని వాడినారు. అక్కడ ‘కలకాలము వెలుగవలయు...’ అనండి.

  రిప్లయితొలగించండి