26, ఆగస్టు 2014, మంగళవారం

పద్యరచన - 658 (నవరాత్రి చందాలు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
“నవరాత్రి చందాలు”

15 కామెంట్‌లు:

 1. అందాలని సరదాలే
  డెందమ్మున దలతుము వినుడీ దసరాలో
  చందాలే యందాలని
  ' ధందా ' లను చేయరాగ దడబుట్టు గదా !

  రిప్లయితొలగించండి
 2. మాస్టరుగారూ ! మీరు వ్రాయమన్నది నవరాత్రి ' అంద చందా ' ల గురించా ? ' అందే చందా ' ల గురించా ?

  రిప్లయితొలగించండి
 3. మామూలే యని యడుగును
  మామూలును కొందరేమొ, మరి మూల్గుచునే
  మా 'మూల' నేది కలదని ( మూలధనం )
  మేమిడ ? మామూలనేది మీకీయ మనున్ .

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  అవి ‘అంద చందాలు’ కావు... అందరూ వచ్చి వసూలు చేసుకునే చందాలు. గణేశ నవరాత్రుల చందాలకోసం ఇప్పటికే నాలుగు మండపాల వచ్చారు. ఇంకెందరు వస్తారో?

  రిప్లయితొలగించండి
 5. చందాల రోజు లీ యివి
  చందాలకు వత్తు రిపుడు జను లందరునున్
  చందాలు దేనికనగను
  నందముగా దుర్గ మాత యర్చన కొఱకున్

  రిప్లయితొలగించండి
 6. సందు సందు తిరిగి చందాల రూపాన
  దోచు కొనుచు నుంద్రు దొరికి నంత
  బారులందుఁ జేరి తీరుగాఁ గూర్చుండి
  రాత్రి వేళ లందు త్రాగు చుంద్రు

  రిప్లయితొలగించండి
 7. శ్రీమాత చేత జచ్చిన
  ఆ మహిషాసురుని ఆత్మ అరుగిడి భువిపై
  మామూళ్ళను రూపముగొని
  సామాన్యుల నెల్లబట్టి చంపగనెంచెన్

  శ్రీ సుబ్బారావు గారూ, మీ పద్యంలో చివరి పాదంలో దుర్గమాత అన్నారు, దుర్గామాత అనడం సాధువేమో కదా.

  రిప్లయితొలగించండి
 8. మల్లెల వారి పూరణలు

  వినాయక నవరాత్రి చందాలడిగే బాలలు

  వీధి వీధి వెలుగు విఘ్నపతిని కొల్వ
  వీధి బాలలంత వెడలి యడుగ
  విఘ్న ములవి వచ్చు విడువక యనినెంచి
  స్వల్పమైన నిడరె చందగాను||

  దసరా నవరాత్రి చందాలడిగే బాలలు

  నాడు వీధి బడుల నయవార్లు జీతాలు
  లేకయుంట, పిల్లలేగి యూర
  లయ్య వార్ల కొరకు నడుగరే రూపాయి,
  పప్పు బెల్ల మంద పావలాను||

  రిప్లయితొలగించండి
 9. మోదకములను భుజియించి ముదము మీర
  నెలుక వాహన మెక్కి తా నేగు వేళ
  పొండు చందా సమర్పించి ముందు కనగ
  మంది, పాపము గణపతి మాయమయ్యె.

  రిప్లయితొలగించండి
 10. పాల వాడు మొదలు బంట్రోతు వరకును
  నిత్య మెదురు పడుచు నెరుగు వారు
  నవ్వు పులుము కొనుచు నవరాత్రి చందాల
  నందు కొనగ వత్తు రాశ తోడ!

  పండుగొచ్చె ననుచు పరవశ మెక్కడ?
  ముందు నొసగు జీతమోటు బోయె
  నప్పు జేయ కున్న తప్పని బ్రతుకులు
  దుర్గ కరుణ కొరకు తొల్లి చూచు!

  రిప్లయితొలగించండి
 11. సీ .నవ రాత్రి వేళలన్ నవ యువ లోకమ్ము
  నవ విధ ( భక్తి ) మార్గాల నడచు వారు,
  మంట పమ్ములు దీర్చి మనసారా భావించి
  మననంబు జేయుచూ మసలు వారు,
  నిత్యాన్న దానాలు నిరుపమ ధర్మాలు
  సంప్ర దాయము లన్ని సలుపు వారు,
  కులములు వేరైన గోత్రాలు వేరైన
  సమతను జాటుచూ సాగు వారు,
  తే గీ వారి ఆశయ మది యౌను భూరి యశము
  యశము గల్గగ భావికి దిశను జూపు
  దిశను సాగిన వారితో దేశమగును
  దేశ సంపద మనకింక దేవళమ్ము
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 12. ఈనాటి శీర్షికకు చక్కని పద్యాలను వ్రాసిన కవిమిత్రులు....
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  శ్రీఆదిభట్ల కామేశ్వర రావు గారికి,
  మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
  మిస్సన్న గారికి,
  సహదేవుడు గారికి,
  కొరప్రోలు రాధాకృష్ణ మూర్తి గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. పేరడీ
  అందుగలడిందులేదని
  సందేహంబు వలదిచట చందా దందా
  సందుల గొందుల యందున
  యెందుల దాగిన విడువక నిప్పించుకొనున్

  రిప్లయితొలగించండి
 14. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి