3, ఆగస్టు 2014, ఆదివారం

పద్యరచన - 640

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

 1. ఎండిన కొబ్బరి చిప్పలు
  దండిగ పడియున్నవచట తైలము తీయన్
  మెండుకొన పిండివంటలు
  వండుటకును, తలకురాయ వాడగవచ్చున్

  రిప్లయితొలగించండి
 2. పెండ్లి మంటపమందున పెద్ద చిన్న
  వ్రతములందున మరికొన్ని వంటలందు
  యెండు కొబ్బరి కావలె మెండుగాను
  తైలమియ్యది మంచిదె తలకు బూయ.

  రిప్లయితొలగించండి
 3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. ఎండు కొబ్బరి చిప్పలు మెండు గాను
  నేల మీదన పడియుండె నీల !చూడు
  మెన్ని యున్నవో లెక్కించి యిపుడు చెప్పు
  సంచి కెత్తుద మన్నింటి బంచు కొనుడు

  రిప్లయితొలగించండి
 5. ఎండు కొబ్బరి చిప్పల దండి గాను
  కువ్వ బోసిరి రైతులు కోన సీమ
  మంచి ధరలోన నమ్మగా నెంచి మదిన
  కూరునా వారు మదిలోన కోరు రేటు?

  రిప్లయితొలగించండి
 6. సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. కోన సీమను కల్పవృక్షము కొబ్బరే విను సోదరా
  పూని కాయల వల్చి చిప్పల పొందుగా విడదీసినన్
  మానుగా కురిడీ యనందగు మంచి కొబ్బరి వచ్చురా
  నూనె నిచ్చును యెండబెట్టుక నువ్వు మిల్లున వేసినన్.

  రిప్లయితొలగించండి
 8. మిస్సన్న గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి