12, ఆగస్టు 2014, మంగళవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 51

రావిపాటి లక్ష్మినారాయణ
రామాయణము-
సీ.    రాముఁడు సంగ్రామ(భీముఁ డచటఁ జంపె
        బిరుదుని దనుజుఁ గి)ల్బిషు విరాధు
    లక్ష్మణుఁ బ్రీతి (గలసి; మునులునుఁ గర
        (మ్మీరు సాధులు జడదారు లెచ్చు)
    నఘులఁ ద్రుంచెదరంచు (నలరుచుఁ గన నా ఘ
        నుల గొన; బాశుప)క్షి లలి నెక్కు
    మురహరాంశుఁడగు రామునిఁ జుట్టిరి మఱి చూ
        తమని మించి; విజయుఁడు మహితశివు)
గీ.     తరపుఁ గోపలక్షణుఁడగు తమ్ముతోడ
    రాముఁ డచ్చోటు వాసి, గారామున శర
    భంగుని సుతీక్ష్ణు నంతఁ గుంభజునిఁ గనెఁ; బ్రి
    యమున వారి హితోపదేశము సలిపిరి. (౬౬)

భారతము-
ఆ.     భీముఁ డచటఁ జంపె బిరుదుని దనుజుఁ గి
    మ్మీరు సాధులు జడదారు లెచ్చు
    నలరుచుఁ గన నాఘనులఁ; గొనఁ బాశుప
    త మని మించి విజయుఁడు మహితశివు. (౬౬)

టీక- భీముఁడు = (రా) భయంకరుఁడు; (రా) కరమ్ము, ఈరు = ఇద్దఱు సాధులు, (భా) కిమ్మీరుఁ డనెడు రాక్షసుని; గొనబున్ = అందమును; ఆశుపక్షిన్ = వేగమగు పక్షిని (గరుత్మంతుని); విజయుఁడు = (రా) జయశీలుఁడు, (భా) అర్జునుఁడు; (భా) అనిన్ = యుద్ధమందు, మించి, పాశుపతమును, కొనన్ = తీసికొనఁగా; బిరుదు = శూరుఁడు; కిల్బిషు = పాపి; తరపు = సమానపు.
                                                                                                                              

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి