2, ఆగస్టు 2014, శనివారం

పద్యరచన - 639

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

 1. ఒంటరిగా పల్లెపడుచు
  వంటచెరకును తనశిరముపైనిడుకొని తా
  నింటికి వయ్యారంబుగ
  వెంటన జనుచింపుగొలిపె వీక్షణములకున్
  (వెంట=మార్గము )

  రిప్లయితొలగించండి
 2. నిన్నటి పద్య రచనకు పూరణ
  అవనిని గలరీ నాటికి
  శ్రవణుని బోలిన తనయులు చక్కగ సేవిం
  చు విడువక తల్లిదండ్రుల
  భువిపై దైవంబులనుచు మోయుచుతిరుగున్

  రిప్లయితొలగించండి
 3. నడు మందమొంపు సొంపుల
  నడి నెత్తిన బరువు మోయు నాట్య్త మయూరై
  తడబడు వడకల యడుగులు
  కడు రమ్యము గాంచి నంత కావ్యమ్మల రన్

  రిప్లయితొలగించండి
 4. బరువెక్కి పంట, పొలమున
  నొరుగుచు తానుండె నటుల నొక్కటి మోపున్
  శిరమున దాల్చుక పడతియె
  మరి కనులకు పంటగానె మసలుచునుండెన్.

  రిప్లయితొలగించండి
 5. పశుల గ్రాసమున్ మోయుచు వచ్చు చుండె
  పల్లె చిన్నది యెక్కటి పరవశముగ
  వంపు సొంపులు హ్రుదిలోన నింపుగొలుప
  మదన భాణము తాకెను మానసమున
  నించు పూబోడి సోయగ మెంచ తరమె

  రిప్లయితొలగించండి
 6. కట్టెల మోపును తలపై
  పెట్టుకునొకపల్లెపడుచు విడ్డూరముగా
  నెట్టుచు చేలను సొగసుగ
  గట్టున బడి పోవుచుండె గజగామినిలా

  రిప్లయితొలగించండి
 7. పైట కొంగును బిగబట్టి పధ్దతిగను
  గడ్డి మోపును తలనిడి గట్టు పైన
  కులుకులొలికెడి నడకతో కుందరదన
  పయన మయ్యెతా నింటికి పల్లెపడుచు

  రిప్లయితొలగించండి
 8. సొంపు లన్నియు గనబడ నింపుగాను
  నెత్తి మీదన నొకమోపు నొత్తి యుంచి
  వంగి కుడిచేత మఱియొక చెంగలి గల
  గడ్డి మోపును నెత్తుట గనుడు మీరు

  రిప్లయితొలగించండి
 9. చక్కని చీరను దీర్చెను
  పిక్కల పైదాక, కొంగు బిగచుట్టగ పై
  నిక్కిన సోయగ మదిరెన్
  జిక్కదె మది గడ్డి మోపు చేతుల కెత్తన్?

  రిప్లయితొలగించండి
 10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది.అభినందనలు.
  ‘జనుచు నింపుగొలిపె’ అనవలసింది. అక్కడ ‘జనుచుండ వేడ్క వీక్షణములకున్’ అందామా?
  నిన్నటి శీర్షికకు మీ పద్యం బాగున్నది.
  *
  అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘వంపుసొంపులు’ సరియైన ప్రయోగం అనుకుంటాను.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  మొదటిపద్యం చివర ‘గజగామినిగా/ గజగామినియై’ అనండి.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. పచ్చగడ్డిని మోసెడు పడుచుపిల్ల
  చేల గట్లను సాగెడు చిలుక మల్లె
  వంపు సొంపులు వెలబోయు వాలు గల్లె*
  సాగి పోవుచు నుండెగా సంజవేళ

  *(వాలుగ చేప లాగా)

  రిప్లయితొలగించండి
 12. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘మల్లె, అల్లె’ అనడం గ్రామ్యం. చిలుక రీతి, వాలుగ వలె అనండి.

  రిప్లయితొలగించండి
 13. ఎండుటాకుల నడుమ
  ఎంకి నే గంటి,
  ఎంకి నడు మొంపులో
  ఎల నాగనే గంటి!
  ఆకు తానైతెను
  అగ్గి నేనవతానంటి ,
  మనువాడి బతుకులో
  మగ్గి పొదామంటి ,
  క్రీగంట ననుజూసి
  నన్నంటు కోమంటి!
  వెన్నంటి తావెంట
  నేనుంట నంటి ,
  ఎంకి బావగ,నే
  నింకి పాతానంటి !
  "వెన్నంటి" తనతోనే ,
  నేనుంట నంటిరా !
  "వెన్నంటి",తనతోనే ,
  వెన్నంటి, ఉంటిరా !!....డా.కృష్ణ సుబ్బారావు పొన్నాడ 30/07/2014

  రిప్లయితొలగించండి
 14. డా. పొన్నాడ కృష్ణ సుబ్బారావు గారూ,
  చివరికి వ్యాఖ్యను ప్రచురించడం సాధించారు. చాలా సంతోషం.
  మాత్రాఛందస్సులో చక్కని గేయాన్ని వ్రాశారు. అభినందనలు.
  ఇక గణ యతి ప్రాసలతో పద్యాలు వ్రాయడమే ఆలస్యం. స్వస్తి!

  రిప్లయితొలగించండి
 15. గురువుగారు నమస్సుమాంజలులు . పద్య రచన కి, గణ యతి ప్రాసలతో కూడి , సులువైనదానిని సూచనలతో సూచించ వలసినదిగా మనవి . భవదీయుడు .డా.కృష్ణ సుబ్బారావు పొన్నాడ

  రిప్లయితొలగించండి