శ్రీపతి శాస్త్రి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. మొదటి పాదంలో గణదోషం. ‘వేటకు వీలులేక...’ అనండి. * గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిజాడ లేదాయె వనములు బీడులాయె
గూడు గోల్పోయె మృగరాజు కోపముడుగె
దీనమైపోయె బ్రతుకులు దినదినంబు
చింత జేసెడి సింగపు చిత్ర మిదియె
దాహము తీరెడి మార్గము
నూహింపగ శక్తిలేక నుస్సురుమనుచు
న్నీహరి చతికిల బడినది
శ్రీహరి నీవేను దిక్కు శీఘ్రము రావే
మానవ మృగముల మధ్యన
మా మనుగడ సాగుటెట్లు మాధవ గనుమా
క్షేమము గూర్చుచు రయమున
స్వామీ! కరుణింపుమయ్య సరసిజనేత్రా
mastaaru ninnati padya rachana sameekshincha praardha.a
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిసవరణ
జాడ లేదాయె వనములు బీడులాయె
నీడ గోల్పోయె మృగరాజు నీరసించె
దీనమైపోయె బ్రతుకులు దినదినంబు
చింత జేసెడి సింగపు చిత్ర మిదియె
తరువాఇ పద్యములు సింహము మదిలోని భావనలుగా ఊహించి వ్రాసినాను.
'మోదీ మోదీ'అలసి సొలసి నది బెంగాలు టైగరు
రిప్లయితొలగించండిగుజరాతు జూలు సింహము సరసన అణగి మణగి
అదిగో , దీదీ 'సింహపుర' విజయము
కలసివచ్సినచో బెంగాలు టైగరు వీర విహారము !!
చీర్స్
జిలేబి
రెండుసింహములచ్చటపండుకొనుట
రిప్లయితొలగించండిచూడ ముచ్చట గలిగించుజూపరులకు
వాని పొత్తులుజూడగవాహవహహ
భేషుగాగని పించెనుబ్రీతి జూడు
వేటయు లేక తిన వేళకు మేతయు లేక యాకటన్
రిప్లయితొలగించండికూటికి దేబిరించు గతిగూడెను పెంటియు సొమ్మసిల్లె యె
చ్చోటనుగాంచినన్ వనులు శూన్యములయ్యెను గహ్వరంబు లున్
చేటయె జంతుజాలములు చేడ్పడి క్రుస్సెను దిక్కులేమిచేన్
సేద దీరెడు వేళలో చేర సుతుని
రిప్లయితొలగించండితండ్రి సింగము జిహ్వతో తాకి నిమిరె
తల్లి దండ్రుల సాంగత్య తన్మయమ్ము
తనివి దీర్చదు పుడమిన ననుభవించ!
హరియందురు మనుజులు కే
రిప్లయితొలగించండిసరియందురు మనల నెప్డు సరి దరి జేరన్
హరిమనిపింతురు తమకే
సరిపోవని హరిణ గణము చంపుకు తినగా !
ధీర గంభీరమైనట్టి దేహమున్న
రిప్లయితొలగించండిసింహరాజుకు ఎదురొడ్డి చేవతోడ
నిలువ గల్గిన ధైర్యము నేలపైన
నేరికి గలదు సృష్టిని ?యెఱుక లేదు.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. ‘వేటకు వీలులేక...’ అనండి.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.