20, ఆగస్టు 2014, బుధవారం

దత్తపది - 39 (గద్యము-పద్యము-మద్యము-హృద్యము)

కవిమిత్రులారా!
గద్యము - పద్యము - మద్యము - హృద్యము
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో 
కవిత్వప్రయోజనాన్ని వివరిస్తూ పద్యం వ్రాయండి.

27 కామెంట్‌లు:

 1. శ్రీగురుభ్యొనమ:

  భారతి కంఠహారమున భస్కరతేజము ప్రజ్వలింపగా
  కారణమేమిటో యనుచు కాంచగ,కన్ గొని విస్మయంబునన్
  భారములాయె నాకనులు భాష్పపుధారలుగారుచుండగా !
  మా రవితేజపండితుడు మమ్ముల వీడెను ముక్తినొందుచున్

  రామాయణ కృతికర్తా
  ప్రేమగ మము తీర్చిదిద్దు పెద్దన సముడౌ
  నేమాని పండితోత్తమ
  స్వామీ, శ్రద్ధాంజలిదియె పావనమూర్తీ !

  గురువర్యులు శ్రీ పండితనేమాని కవీవీశ్వరుడు పరమపదినించినారను విషయమును బ్లాగు మిత్రులు శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి ద్వారా తెలిసినది. మిగుల దు:ఖకరమైన విషయము. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారు జయప్రదముగా నిర్వహించుచున్న భువనవిజయము వంటి శంకరాభరణము నందు మహాకవి పెద్దన వలె మనకు యెన్నో అమూల్యమైన సూచనలను, భాషా సంపత్తిని,కవితామృతమును అందించిన గౌరవనీయులు శ్రీ పండిత నేమాని గురువర్యుల ఆత్మకు శాంతి కల్గి ఆ సరస్వతి సన్నిధానమున సేవలనందింతురని ప్రార్థించుచున్నాను.

  రిప్లయితొలగించండి
 2. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  గద్యము శబ్ద వాద్యముల ఘల్లను కంకణ నిక్వణ మ్మిడన్
  పద్యము రాగతాళ యుత భావన,స్పందన,స్ఫూర్తి నీయగా
  హృద్యములైన కావ్యములు సృష్టిని జేయుము విశ్వ శ్రేయమై
  మద్యము గ్రోల నేమగును మైమరపే గద బుద్ధి మాంద్యమున్

  రిప్లయితొలగించండి
 3. పద్యము సంగీతమునకు
  హృద్యము గా సాధనమ్ము యిరు సంధ్యలలో
  గద్యము వలె సాగిన చో
  మద్యము సేవించి నట్లు మత్తెక్కించున్

  గద్యము కంటెను విషయము
  పద్యము లో దెలుపు నాడు ఫలితము మెండౌ
  హృద్యము గా కవులు సలుప
  'మద్యము' గా కవిత నెంచి మసలుట గనమే !

  హృద్యము గా పద్యము లనె
  గద్యము బలె రచన జేయ గనియొకడనియెన్
  'మద్యము సెవించె నితడు '
  పద్యము నకు సాటి లేదు ప్రక్రియ లందున్

  రిప్లయితొలగించండి
 4. మల్లెల వారి పూరణలు

  హృద్యము నైన భావముల, హృద్య రసాత్మక మైన వాక్యమే
  గద్యము నైన కావ్యమని, కైతను గూర్చియు తెల్పి రార్యులున్
  పద్యము లందు నయ్యదియె బాగుగ శోభిలు విశ్వశ్రేయమై
  మద్యము వంటి మత్తులను మానవ జాతికి దూరముంచుగా

  హృద్యము నైనను భావము
  పద్యము నైనను, శుభమును బాగుగ గూర్చే
  గద్యము నైనను, జగతికి
  మద్యము లాదియు నిడు, చెడు మాన్పగ జేయున్

  మద్యము వోలెను కాకను
  హృద్యము నౌగతి రసమయ హృదయాలను వే
  గద్యము లందున, శ్రేయపు
  పద్యము లందున జగతిని బాగుగ దిద్దున్

  మద్యము చెరచును మంచిని
  గద్యము లైనను మనుజుల కష్టము దీర్చే
  పద్యము నీతుల నైనను
  హృద్యమునౌ భావములిడు హృద్యపు కవితల్

  మద్యము మత్తునిచ్చు నది మానవ జాతికి నాశ హేతువై
  గద్యము శబ్దసంయుతము కంకణ నిక్వణ మట్లు నింపునై
  పద్యము రాగతాళయుత వాద్యము నట్టుల శ్రావ్య నాదమై
  హృద్యము నైన భావముల సేవిత కైతయె కాచు విశ్వమున్

  రిప్లయితొలగించండి
 5. గద్యము కదళీ పాకము
  పద్యము ద్రాక్షా ఫలరస పాకములరయన్
  మద్యము పోలిక కావవి
  హృద్యములౌనా రచనలు హృధి వెల్గించున్

  రిప్లయితొలగించండి
 6. గద్యము కన్నా మిన్నగ
  పద్యము లనుమెచ్చుగాదె పామరు లైనన్
  హృద్యముగా పద్యములను
  మద్యము వలె గ్రోలుచున్న మైమరపించున్

  రిప్లయితొలగించండి
 7. గద్యము కంటెను చక్కని
  పద్యము ప్రజలమది చేరు పదముల వెంటన్
  హృద్యముగ పాడు గళముల
  మద్యము నతిగాఁ గొన నది మానముఁ జెరచున్

  రిప్లయితొలగించండి
 8. గద్యము కన్న వీనులకు కమ్మగ విందును జేయు నెంతయో
  హృద్యమునై విరాజిలును హేలగ దోచును గ్రోలు కొద్దియున్
  మద్యము రీతి ముంచు నిను మత్తున నా కవితా రసమ్మహో
  పద్యము దీని ప్రాభవము బ్రహ్మకునైన గణింప శక్యమే?

  రిప్లయితొలగించండి
 9. గద్య మయిననేమి తెలుగు
  పద్య మయిననేమి ఫ్రెంచి మద్యము కన్నన్
  హృద్యము గాదా! యవనిని
  యుద్యమముల కండ నిలిచి యూపిరి పోసెన్

  రిప్లయితొలగించండి
 10. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘సాధనమ్ము + ఇరు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సాధన మగు నిరు...’ అనండి.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘కవిత + ఐనన్’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘అవనిని + ఉద్యమ’ మన్నప్పుడు ‘అవని నుద్యమ’మౌతుంది. అక్కడ ‘యీ భువి/ నుద్యమముల...’ అనండి.

  రిప్లయితొలగించండి

 11. పద్య గద్యము లాయవి హృద్యముగను
  నుండి మనసును నాహ్లాద మొంద జేయు
  మద్య పానము చేసిన మంద లించి
  కలుగ సద్బుద్ధి , వ్రాతురు కవన ములను

  రిప్లయితొలగించండి
 12. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. గద్యములోని సర్వసుభగత్వము పెంపొనరించునట్లునీ
  పద్యము శ్రేష్టపూర్ణతకు బాటలువేయును గాదె నెంచగా!
  హృద్యముగా కవిత్వమునహీన విధంబున వెల్గజేయకన్
  మద్యముమత్తులోనబడి మానమునేల హరించుకొందురో.

  రిప్లయితొలగించండి
 14. చంద్రమౌళి సూర్యనారాయణ గారి పూరణం లో
  పద్యం- ఫ్రెంచి మద్యం.... ప్రయోగం బాగుంది కానీ
  రెండవ పాదంలో "ప"ద్యం "మ"ద్యం లకు యతి పొసగునా!

  రిప్లయితొలగించండి
 15. గద్యం బిచ్ఛా విహరిణి
  పద్యము ఛందస్సులోన బందీ యగుగా
  హృద్యం బైన కవిత్వము
  మద్యము తో వచ్చు ననుట మంచిది యగునా!

  రిప్లయితొలగించండి
 16. గద్యము తథ్యమౌ కవితగా వెలయించినచో సభాస్థలిన్
  పద్యము వేద్యమౌ విషయ భాష్యము సాధ్యము చేయు బాధ్యతన్
  మద్యము హీనమౌను రసమాధురిలో కవనంబు ముందటన్
  హృద్యముగన్ కవిత్వమును హిండన జేసిన వాడు ధన్యుడౌ

  రిప్లయితొలగించండి
 17. గత సమస్యకు నాపూరణ...

  ' ఈ కోటి మీది ' ప్రోగ్రాం
  శ్రీకరరావడిగె ప్రశ్న శేషాచారిన్
  ఓకే యని చారిట్లనె
  శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే.

  రిప్లయితొలగించండి
 18. పద్యము జదివితి తిక్కన
  గద్యమునే చదివినాడ కావ్యమునందున్
  హృద్యముగా నుందంటిని
  మద్యము గోలెందుకయ్య మధ్యన గ్రోలన్.

  రిప్లయితొలగించండి
 19. పనుల్లో మునిగి, ఉదయంనుండి సంచిక చూసె వ్యవధిలీక , ఇప్పుడే చూశాను. అందరి పూరణలూ అందంగా ఉన్నవి. వైవిధ్యంగా వ్రాయడనికి ఏమీ మిగిలినట్టులేదు. కాని, అవధానాల్లో, కొన్ని వేళ, దత్తపదులలో, ఆ పదాల అర్థంరాకుండా వేరె పదాలుగా మార్చి, పద్యరచన చేయవలసియుంటుంది. అలాంటిదే ఈ ప్రయత్నం. అలంకారాలతో మంచి కవిత్వాన్ని రచనజేసే అవకాశమున్న ఈ దత్తపదికి, నేను చేపట్టినమార్గంలో న్యాయంచెల్లించలేదుగనుక మన్నించాలి.

  భావ గాద్గద్యములదెచ్చు పాడ, భవ్య
  కవితఁ హృద్యమున యుప్పొంగి కదలి సాగు
  పదమపద్యములు గాక రస బంధురముగ
  మద్యదేశమున తెలుగునన్ మాన్యమయ్యెన్

  (గాద్గద్యము- గద్గదిత కంఠము) (హృద్ యమున) (అపద్యము = నీచము) (మద్యదేశము - భారతము)

  రిప్లయితొలగించండి
 20. Rama Krishna Murthy Renduchintala గారూ!
  • ప, ఫ, బ, భ, వ & • ప, ఫ, బ, భ, మ లకు యతి చెల్లుతుంది కానీ 'మ' కి 'వ ' కి చెల్లదు - అని మాత్రము తెలుసు. ఇంకెవరన్నా ఇంతకన్నా వివరణ ఇస్తే బాగుంటుంది

  రిప్లయితొలగించండి
 21. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  సూర్యనారాయణ గారి పద్యంలో అది యతి దోషమే. నేను గమనించలేదు.. ధన్యవాదాలు.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ మొదటి పూరణలోని యతిదోషాన్ని సవరించండి.
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘పఫబభ’లకు మకారంతో యతిమైత్రి లేదు. కేవలం ఉఊఒఓలతో కూడిన పఫబభమ లకు యతి చెల్లుతుంది.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ నిన్నటి పూరణ, ఈనాటి పూరణ... రెండూ బాగున్నవి. అభినందనలు.
  *
  మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
  ఈనాటి దత్తపదికి అన్యార్థంలో పూరణ అసాధ్య మనుకున్నాను. కానీ మీరు దానిని సాధించి, ప్రశంసాపాత్రు లయ్యారు. చక్కని వైవిధ్యం కల పూరణకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. శ్రీగురుభ్యోనమ:

  గురువుగారికి నమస్కారములు. శ్రీపండిత నేమాని గురువర్యులకు శ్రద్ధాంజలిగా నేను వ్రాసిన పద్యములలోని దోషములను క్రిందివిధముగా సవరించుచున్నాను.
  1. శ్రీగురుభ్యొనమ: X = శ్రీగురుభ్యోనమ: ,/
  2. 1వ పద్యము 1వ పాదములో భస్కరతేజము X = భాస్కరతేజము ,/

  3. 2వ పద్యము 3వ పాదము "నేమాని పండితోత్తమ" X
  "నేమాని పండితార్యా" ,/

  పైవిధముగా సవరించి చదువుకొనవలసినదిగా ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 23. చంద్రమౌళి గారి పద్యం హృద్యంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 24. గద్యము కైలాస శివుడు
  పద్యము సురగంగ వలెను పారగ శిగలో
  హృద్యమ్మౌ శివ రూపము
  మద్యము కాదది తెనుగున మాధుర్య సుదౌ!

  రిప్లయితొలగించండి
 25. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సుధ + ఔ = సుధ యౌ’ అవుతుంది. అక్కడ ‘మాధుర్య మిడున్’ అనండి.

  రిప్లయితొలగించండి
 26. గద్యమునకు మరి సొగసగు
  పద్యమునకునెట్లు భేదపఱచుట ననగా
  మద్యముల సారనిపుణికి
  హృద్యముగా వివరణనిడె హితుడొక నాటన్.

  రిప్లయితొలగించండి