31, ఆగస్టు 2014, ఆదివారం

దత్తపది - 41 (కరి-గురి-దరి-విరి)

కవిమిత్రులారా!
“కరి - గురి - దరి - విరి”
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.

32 కామెంట్‌లు:

 1. తరలి వెళ్లెద సంధికి కరిపురంబు
  నలుగురికి మీ మనంబును తెలియ జేయ
  బెదరి చనుట కాదిది, మీకు పేరు గల్గు
  మీదె భావి! రిత్త యగునె నాదు మాట!!

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  నర్తనశాల సినిమాలో
  "జననీ శివకామినీ " పాట సందర్భంలో :

  01)
  ______________________________

  విరటుని కొలువు పై గురి - పెట్టి కృష్ణ
  వినిచె శంకరి దరి జేరి - వినతి తనదు !
  వినిన విరిబోడి వేగమె - వివర మడిగి
  విధిని దూరుచు సైరంధ్రి - వెతల దీర్చ
  విరటు కొలువున జేర్చెను - విరులు ముడువ !
  ______________________________
  విరిబోడి = స్త్రీ(సుధేష్ణ)

  రిప్లయితొలగించండి
 3. పాండవ వనవాసము సినిమాలో
  "ఉరుకుల పరుగుల దొరా" పాట సందర్భంలో :

  02)
  ______________________________

  కరిబలుడు భీమసేనుడు - కలయదిరిగి
  పుష్పము గురించి వెదకుచు - పురము జేరి
  యడ్డు సుందరి మెప్పించి; - యాజి గెలిచి
  విరివిగానున్న కొలనులో - విరుల బొందె !
  ______________________________
  పురము = అలకాపురి
  అడ్డు = అడ్డగించు
  ఆజి = యుద్ధము
  విరులు = సౌగంధిక పుష్పములు

  రిప్లయితొలగించండి
 4. కం . ఒకరికి సేనల నిచ్చెను
  ఒకవంకన తాను నిల్చి ఒరిమిక గురిసెన్,
  ఒకరికి దరిసెన భాగ్యము
  సకలము తన విశ్వ రూప సంగతి విరియన్
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 5. శ్రీ రాధాకృష్ణ గారి కంద పద్యం చాలా బాగున్నది. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 6. క్రూర కౌరవ పతనమే గుఱి యటంచు
  కరిపురమ్మున తాఁ బడ్డ కష్టములను
  విన్న వించెను విరిఁబోడి విష్ణువునకు
  నశ్రుధారలఁ గురిపించి యంబుజాక్షి
  వేరు దరిలేదు మాకటంచు విశద పఱచె

  రిప్లయితొలగించండి

 7. కరివరదు కృష్ణు దలచుచు
  దరిజేకొని విల్లునెత్తి తానర్జునుడే
  గురిజూచి కొట్టె చేపను
  విరిమాలను వేసె కృష్ణ వేడుక గలుగన్.

  రిప్లయితొలగించండి
 8. కరిపు రంబుదరికి నేగి కరము విరియ
  మనసు వారిది, దె లియజే తును గ మంచి
  గాను నలుగురి యెదుటన గలుగ శుభము
  లాన తీయుము మఱి నాకు నార్య !బావ !

  రిప్లయితొలగించండి
 9. కరిఁ జంపి గురుద్రోణుని
  గురిచేయుచు ధర్మరాజు కూసెను బొంకుల్
  దరిమిల ధృష్టద్యుమ్నుఁడు
  విరిదల గావించె ద్రోణు వేరముతోడన్

  రిప్లయితొలగించండి
 10. సంధిని గురించి విరివిడి శౌరి చెప్ప
  నదరి పడియెను బాధతో నంబుజాక్షి
  కరిపురమ్మున శత్రువుల్ కాలు వరకు
  నడుగుఁ బెట్టను నేనట కనుచు నేడ్చె

  రిప్లయితొలగించండి
 11. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  దత్త పదాలను స్వార్థంలో ప్రయోగించిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  నేను స్వార్థంలో ప్రయోగించరాదని నియమం పెట్టలేదు కనుక మీ రచనలో దోషం లేదు.
  *
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మారెళ్ళ వామన్ కుమార్ ప్రశంసించినట్లు మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
  ధన్యవాదాలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘మాకటంచు’ అన్నచోట గణదోషం. ‘మాకని’ అంటే సరి.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘వేగము’ టైపాటు వల్ల ‘వేరము’ అయినట్టుంది.

  రిప్లయితొలగించండి
 12. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. కరిభిదుని కోరి పొందగ
  నరిభంజన శస్త్ర చయము నాక్రీడి గురిన్
  పర వీరుల నావిరిజే
  సి రయము సమవర్తి దరికి జేర్చెన్ చిచ్చై

  రిప్లయితొలగించండి
 14. మాస్టారూ వేరము అంటే విరోధము అనే అర్ధం లో వ్రాశాను

  రిప్లయితొలగించండి
 15. కరిబలుడా భీమునిగని
  విరిబోడి హిడింబి వలచి విరహము తోడన్
  పరిణయ మాడెడి గురితో
  దరిజేరెను కుంతిసుతుని తన్మయ మగుచున్


  గురిపెట్టి విరటు గొలువున
  విరిచెను గద విల్లు క్రీడి వేదిజను గొనెన్
  కరివేల్పు సంతసించగ
  దరిజేరిన కృష్ణతోడ తరలెను పురికిన్

  రిప్లయితొలగించండి
 16. చేయునది లేక రిపులను చెండ లేక
  వెనుక కేగు రిత్త కరాల వీర కర్ణు
  జూడ ముందరి వరుసలో చోద్య మాయె
  నవ్వుపువ్వులు విరిసెను నరుని కపుడు.

  రిప్లయితొలగించండి
 17. మల్లెల వారి పూరణలు

  కరి పుర మందున ద్రోణుడు
  విరివిగ శస్త్రములు నస్త్ర విద్యలు నేర్పన్
  దరి నుండి కాంచె భీష్ముడు
  గురి విలు విద్యను పృథసుతు గొప్పను పొగిడెన్

  విరివగు యుద్ధము నందున
  కరి యశ్వత్థా మనునది కాంచగ మృతినే
  దరిఁగని ధర్మజు డరచెను
  గురి సేసి దృపద సుతుడటు కూల్చెను ద్రోణున్

  విరి వాన యట్లు, శరములు
  కరిపై బడి నట్లు గాను, కదిసెను సేనన్
  దరి దురుముచు నా భీముడు
  గురిగా గదఁగొట్టి చంపె కుప్పలు వడగా

  విరిదౌ వ్యూహము నందున,
  కరిపై సింగము ననువున కను నభిమన్యున్,
  దరిఁజేరగలేక యెటులొ
  గురి వెనుకగ వింటి దునుమి కూల్చిరి భీతిన్

  కరిపై నెక్కిన యుద్ధము
  గురి చూచియు బాణములను గొప్పగ విడువన్
  విరివగు నస్త్రపునిపుణత
  దరి పరివేక్షణను తెల్పె తాద్రోణుండే

  రిప్లయితొలగించండి
 18. కరియూధంబును ఢీకొనెన్ కరినిభాకారుండు భీముండు తా
  గురిచేసెన్ పరవీరులన్ పగయు నుక్రోషంబు పెంపొందగన్
  దరిలేనట్టి పరాక్రమంబున గదాదండంబు చేబూని తా
  విరిచెన్ కౌరవ చక్రవర్తి తొడలన్ వీరోద్దతిన్ క్రోధుడై

  రిప్లయితొలగించండి
 19. ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  నేను కొంచెం ఆలోచించి ఉండవలసింది. తొందరపడ్డాను. మన్నించండి. మీ భావమే సరియైనది.
  *
  శైలజ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  కాని రెండవ పూరణలో మీరు చెప్పిన భావాన్ని మరొకసారి గమనించండి.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘విరివగు’ అని రెండు చోట్ల ప్రయోగించారు. ‘విరివి + అగు’ యడాగమం వచ్చి విరివియగు అవుతుంది. సంధి లేదు.

  రిప్లయితొలగించండి
 20. కరివరదు ముఖ కమలమున
  విరియన్ బరిమళఁపు గీత విజయుని గొరకున్
  గురి కుదర యుద్ధ మందున
  కురు వీరుడు విజయపు దరి కుదురుగఁ జేరెన్.

  రిప్లయితొలగించండి
 21. దత్తపది స్వార్థముగానిరీతిలో..
  విజయుడు, అళుకరియైన ఉత్తరకుమారునకు కౌరవప్రముఖులను గురితించిజెప్పి
  ఉత్తరగోగ్రహణ సమర విజేతుడైన సందర్భం.

  నరుడళుకరియుత్తరునకు
  గురితించెను భీష్మకర్ణ గురులన్, తానం
  దరినచ్చట గని బెదర, తి
  విరి, సమరవిజేతుడయ్యె విజయుడు బలిమిన్

  రిప్లయితొలగించండి
 22. కె.ఈశ్వరప్ప గారి పూరణ

  ఐదు గురికిఆలిగ ద్రౌ
  పది పాండవులదరిజేరి పాతివ్రతగా
  మెదలుట శాంకరి దయయే
  విధివిరి బోణి నొసగినపవిత్రత జూడన్

  రిప్లయితొలగించండి
 23. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘విజయుని కొఱకున్’ అనండి.
  *
  మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
  మీ తాజా పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  పతివ్రత అని కాక ‘పాతివ్రత’ అన్నారు. అక్కడ ‘పతిదేవతగా’ అనండి.

  రిప్లయితొలగించండి
 24. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు గురిగా నేసె శరముల౦
  దరి జూడ్కులు మెచ్చుగొనగ తద్యంత్రము నా
  కరివరదుసఖుడు పార్ధుడు
  వరించె విరిదండ వైచి పాంచాలి తగన్

  రిప్లయితొలగించండి
 25. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. కె యస్ గురుమూర్తి గారి పూరణ వెలుగోడు
  కాదలవి రిపులకు గెలవగా కిరీటి
  కరి పయిన్ బడి ఛి౦దగ కరటి మెదడు
  అదరి పోదురు కురువీరు లందరింక
  పదుగురి బ్రతుకు లిక పోరు వలదు సేయ

  రిప్లయితొలగించండి
 27. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  క్రొత్త క్రొత్త కవిమిత్రులను బ్లాగుకు పరిచయం చేస్తూ, వారి పద్యాలను పంపే శ్రమకూడా తీసుకుంటున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
  *
  కె.యస్. గురుమూర్తి గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. శ్రీగురుభ్యోనమ:

  ప్రేమ పంచక రిపులుగా పెంచినారు
  పాండు సుతు లైదుగురిపైన పగను బూని
  కృష్ణ సోదరికిన్నీవు కీడు జేయ
  విరిగె నీ తొడ కురురాజ! విఱ్ఱవీగ

  రిప్లయితొలగించండి
 29. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
  కరివరదు ముఖ కమలమున
  విరియన్ బరిమళఁపు గీత విజయుని కొరకున్
  గురి కుదర యుద్ధ మందున
  కురు వీరుడు విజయపు దరి కుదురుగఁ జేరెన్.

  రిప్లయితొలగించండి
 30. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి