11, ఆగస్టు 2014, సోమవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 50

రావిపాటి లక్ష్మీనారాయణ

రామాయణము-
సీ.    గుహుని నమస్కృతుల్ కొని, దాటి గంగాన
        దిని, భరద్వాజు మన్ననల నంది
    చిత్రకూటంబునఁ జెలువొప్ప వారుండఁ
        బుత్రమోహంబునఁ బొగిలి దశర
    థుఁడు సేరె దివి; భరతుఁడు గుంది, తానన్న
        కడ కేగి, రమ్మని యడిగె; నతఁడు
    రానన్నఁ బాదుకల్ బ్రభుపీఠి నిలిపి తా
        మనెను నందిగ్రామమున; నిచటను
గీ.     (శరభకరిభల్లుకాళి గజరిపుకిటుల
    వ్యాఘ్రతతుల క్ష్మాపతనయు లంత రహినిఁ
    గనుచుఁ జనిరి వే తిరులై మృగయుతవనికి
    నధికమోదముతో) దండకాటవికిని. (౬౫)

భారతము-
కం.     శరభకరిభల్లుకాళి గ
    జరిపుకిటుల వ్యాఘ్రతతుల క్ష్మాపతనయులం
    త రహినిఁ గనుచుఁ జనిరి వే
    తిరులై మృగయుతవనికి నధికమోదముతో. (౬౫)

టీక- గజరిపు = సింహము; కిటి = పంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి