16, ఆగస్టు 2014, శనివారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 55

రావిపాటి లక్ష్మీనారాయణ

రామాయణము (నాగబంధము)-
చం.    హరి (మిగులౌ నివాతకవచావగుణుల్ తనరంగఁ జంపెఁ బా
         లితకృతిశ్రీ)ల నీతి నల లీలను నున్న నికామబాణుఁ డా
         పతి, (తగవారిఁ బాతకుల వాలగు దుష్టుల బాగుగాను నా
         యతరమతో)న; ఖ్యాతి నఱి యాఱిరి పెల్లరి బంతిజోదులున్. (౭౦)

భారతము-
కం.    మిగులౌ నివాతకవచా
         వగుణుల్ తనరంగఁ జంపెఁ బాలితకృతి శ్రీ
         తగవారిఁ బాతకుల వా
         లగు దుష్టుల బాగుగాను నాయతరమతో. (౭౦)

టీక- నివాతకవచ = (రా) గాలిదూఱని కవచములుగల, (భా) నివాతకవచులను రాక్షసులు; నికామబాణుఁడు = యథేచ్ఛమగు బాణములు గలవాఁడు; హతి = కొట్టుటయందు; అవగుణులు = దుర్గుణులు; కృతి = సమర్థుఁడు; అఱి = నశించి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి