18, ఆగస్టు 2014, సోమవారం

సమస్యా పూరణం – 1503 (శ్రీకృష్ణుని మేనమామ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే.

27 కామెంట్‌లు:

  1. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు "శ్రీకృష్ణజన్మాష్టమి" శుభాకాంక్షలు!

    ఆ కంసుండే యయెనయ
    శ్రీకృష్ణుని మేనమామ; శిశుపాలుండే
    చేకొనె మిత్తిని దుడుకున,
    శ్రీకృష్ణుఁడు నూఱు తప్పు లెంచి వధింపన్! (1)


    చేకొని బాలుఁడు వ్రాసెను
    "శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే!"
    చీకాకుఁ జెంది గురు "విటు
    కాకూడదు, ’బావ’, ’మామ’గా నయ్యె" ననెన్!(2)

    ఆ కఱ్ఱి యెవని సఖుఁడయ?
    యా కంసుం డతనికేమి యగునో? మడిసెన్
    జేకొని యెవఁ డతని వలన?
    శ్రీకృష్ణుని, మేనమామ, శిశుపాలుండే!(3)

    రిప్లయితొలగించండి
  2. గుండు మధుసూదన్ గారూ,
    ఖండన,వాక్యదోషం, క్రమాలంకారం అనే మూడు ప్రసిద్ధమైన పద్ధతులలో మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉండి, సమస్యాపూరణంలో ఔత్సాహికులకు మార్గదర్శకాలుగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

  3. వ్రేకటులఁ గాచి శిశువుల
    రాకను కాంక్షించి చంపు రాజే శిశుపా
    లాకారపు కంసుడనిన
    శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే.

    రిప్లయితొలగించండి
  4. ఆకృతిలో నరు ,'డసురుడె'
    శ్రీకృష్ణుని మేనమామ; శిశుపాలుండే
    వికృతపు చేష్టలజేసి పు
    రాకృత కర్మఫలముగనె యసువుల వీడెన్

    రిప్లయితొలగించండి
  5. వీకన తాకెను కసితో
    శ్రీకృష్ణుని మేన మామ, శిశుపాలుండే
    శ్రీకృష్ణుని దూషించెను
    వైకుంఠముఁజేర వేగ వైరము తోడన్

    రిప్లయితొలగించండి
  6. మల్లెల వారి పూరణలు

    తాకడ తేర్చెను మధురన్
    శ్రీకృష్ణుని మేనమామ, శిశుపాలుండే
    తాకావర మున బలుకగ
    వేకూల్చనతని, సభనటు, పెన్ చక్రముతో

    ఆకంసుడు పాపియుగా
    శ్రీకృష్ణుని మేనమామ, శిశుపాలుండే
    తాకష్టముగా గపలుక
    వే కడ తేర్చవె జగముల పెంపుకు దేవా

    రిప్లయితొలగించండి
  7. ఆకూళుండగు కంసుడు
    శ్రీకృష్ణుని మేనమామ,శిశుపాలుండే
    శకటారికి బావై తా
    శ్రీకృష్ణుని చుట్టలుగుకు చిక్కెను గాదా!

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    లోకమెరు౦గును కంసుడె
    శ్రీకృష్ణునిమేనమామ.శిశుపాలుండే
    ఛీ కొట్టి నిండు సభలో
    శ్రీకృష్ణుని చేత మడిసి శివమును జెందేన్

    రిప్లయితొలగించండి
  9. ఆ కంసుడే గ దామఱి
    శ్రీకృష్ణుని మేనమామ, శిశుపాలుండే
    యాకృష్ణుని దూషించుత
    నేకముగా నూఱు మార్లు , నీ డ్వం బడియెన్

    రిప్లయితొలగించండి
  10. ఆ కంసుం డే యగుగద
    శ్రీకృష్ణుని మేనమామ, శిశుపాలుండే
    మో కృష్ణు మేనబావగు
    యా క్రూరు లిరువురు చచ్చెనధమాధములై

    రిప్లయితొలగించండి

  11. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    మరియొక పూరణ:ఆ కంస పాంసనుండే
    శ్రీకృష్ణుని మేనమామ,శిశు పాలుండే [శిశువులను పాలించ వలయు వాడు]
    చేకొని శిశు హంతాయెను
    గోకులమున కృష్ణు జంప గోరెను భీతిన్

    రిప్లయితొలగించండి
  12. మీకొకటి జెప్ప గోరితి
    కాకలు దీరిన నటులుగ గర్వించ దగన్
    ఢీకొను ప్రస్తుత నాటక
    శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే!

    రిప్లయితొలగించండి
  13. ఆ కుటిల క్రూర కంసుడు
    శ్రీ కృష్ణుని మేనమామ , శిశుపాలుండే
    శ్రీ కాంతుని దూషించగ
    చేకొని చక్రాయుధంబుచే వధియించెన్.

    రిప్లయితొలగించండి
  14. మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఫలము గనె నసువుల వీడెన్’ అనండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీరు మలేషియా వెళ్తున్నందుకు సంతోషం. అక్కడకు చేరిన తర్వాతైనా సమయానుకూలతను బట్టి బ్లాగుకు పద్యాలు వ్రాస్తూ ఉండండి.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నా కుత్సితు మురవిరోధి నామం బడచెన్’ అనండి
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మాధురి గారూ,
    మల్లెల వారి పూరణలను ఎప్పటికప్పుడు బ్లాగులో ప్రకటిస్తున్నందుకు ధన్యవాదాలు. టైప్ చేసేసమయంలో పదాల మధ్య వ్యవధానాన్ని సరిగా పాటించండి.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘బావ + అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘మేనబావయె’ అనండి.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. నా పూరణ....

    ఈమాట చెప్పెను గురువు
    “శ్రీకృష్ణుని మేనబావ శిశుపాలుండే”
    సోమరి శిష్యుడు వ్రాసెను
    “శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే”

    రిప్లయితొలగించండి
  16. అయ్యా శంకరయ్యగారూ నమస్తే

    ఈ విధంగా ఒకటీ మూడూ పాదాలకో ప్రాసనూ రెండూ నాలుగూ పాదాలకు మరో ప్రాసనూ ఉపయోగిస్తూ కందం వ్రాయవచ్చునా??

    రిప్లయితొలగించండి
  17. కామేశ్వర శర్మ గారూ,
    నా పద్యాన్ని చూసుకుంటే నాకు నవ్వు వస్తున్నది. అందరికీ శకునాలు పలికే బల్లి కుడితిలో పడ్డదట!
    నా పద్యంలోని లోపాన్ని చూపినందుకు ధన్యవాదాలు. సవరిస్తాను.

    రిప్లయితొలగించండి
  18. పూజ్జ్యులు గురుదేవులుశంకరయ్యగారికి వందనములు మరియొక పూరణ
    శ్రీకృష్ణుడు గో పాలుడు
    శ్రీకృష్ణుని మేనమామ శిశు పాలుండే
    కైకానుకగా పూతన
    రాకాసిని చన్ను గుడుప రమ్మని బంపెన్

    రిప్లయితొలగించండి
  19. సవరించిన నా పూరణ....

    మాకిటులం జెప్పె గురువు
    “శ్రీకృష్ణుని మేనబావ శిశుపాలుండే”
    శ్రీక రనువాడు వ్రాసెను
    “శీకృష్ణుని మేనమామ శిశుపాలుండే”

    రిప్లయితొలగించండి
  20. శంకరయ్యగారూ వందనములు

    భాగవతులవారు,శైలజగారుపూరణలోమూడవపాదము
    లఘువుతోప్రారంభమయింది తమరు గమనించలేదు

    రిప్లయితొలగించండి
  21. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    ఏమిటో ... ఈరోజు అన్నీ పొరపాట్లే.. మీరు చెప్పేదాక నేను గమనించలేదు. ధన్యవాదాలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణలో మూడవ పాదాన్ని ‘వైకృతచేష్టల జేసి పు’ అందాం.
    *
    శైలజ గారూ,
    ‘శ్రీకాంతుని బావై తా’ అనండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. దొందూదొందే....


    శ్రీకృష్ణారావు చెప్పెను
    శ్రీకృష్ణుని కన్నతల్లి రేవతి గాదే
    శ్రీకృష్ణ మూర్తి చెప్పెను
    శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే.

    రిప్లయితొలగించండి

  23. ఈ కోటి మీది ప్రోగ్రాం
    శ్రీకరరావడిగె ప్రశ్న శేషాచారిన్
    నాకే తెలుసని చెప్పెను
    శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే.

    రిప్లయితొలగించండి

  24. ఈ కోటి మీది ప్రోగ్రాం
    శ్రీకరరావడిగె ప్రశ్న శేషాచారిన్
    ఓకే యని చారిట్లనె
    శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే.

    రిప్లయితొలగించండి
  25. కాకర కాయను విబుధులు
    కీకర కాయగ పలుకుచు క్రీడించంగన్
    పోకిరి బావయె మామవ
    శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే

    రిప్లయితొలగించండి