15, ఆగస్టు 2014, శుక్రవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 54

రావిపాటి లక్ష్మీనారాయణ
రామాయణము-
సీ.    కలకల నగె క్ష్మాజ; (కామినియునుఁ దీవ్ర
        తామసంబునఁ బోయె) ధరణిపుత్రిఁ
    దినఁ బోవ నగ్రజాజ్ఞనుఁ గోసె సౌమిత్రి
        (భవ్యజిష్ణుసుకృతి పౌరుషంబు)
    వఱల ముక్కు సెవుల; (వదల దూఱు చడలఁ
        జద లది యజ్ఞాత) చరితులైన
    రాసుతులు మదించి చేసి రింతని జన
        స్థానస్థుఁ డగు ఖరుతో నుడువుచు
గీ.     నేడ్చె వలవల, వాఁడు దండెత్తె హత్తి
    మొన; క్షితిజతో ననుజు బిల(మునను నుండ
    సలిపె ఘనుఁడగు హరి)వంశబలుఁ; డెదిర్చె
    సేన; శరవర్షము గురియించి రరు; లట్లు. (౬౯)

భారతము-
ఆ.    కామినియునుఁ దీవ్రతామసంబునఁ బోయె
    భవ్యజిష్ణుసుకృతిపౌరుషంబు
    వదల దూఱు చడలఁ జద; లది యజ్ఞాత
    మునను నుండ సలిపె ఘనుఁ డగు హరి. (౬౯)

టీక- జిష్ణు = (రా) జయశీలునియొక్క, (భా) అర్జునునియొక్క; పౌరుషంబు = (రా) కోపము, (భా) పురుషభావము (పుంస్త్వము); దూఱుచు = తిట్టుచు; వదలన్ = (రా) వదలఁగా, (భా) వీడునట్లు; అది = (రా) శూర్పణఖ, (భా) ఆ తిట్టు; హరి = (రా) సూర్యునియొక్క, (భా) ఇంద్రుఁడు; చదలు = ఆకాశము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి