1, ఆగస్టు 2014, శుక్రవారం

పద్యరచన - 638

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. శ్రవణకుమారుడు మరలా
    భువిలోనే పుట్టినాడు పుణ్యాత్ముడురా !
    స్తవనీయుడె మరి వా
    స్తవమేనాయనును నేటి వసుధను ప్రజలే !

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మరలా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘కుమారుండు మరల’ అందాం. అలాగే ‘యనును నేటి వసుధను ప్రజయే’ లేదా ‘యంద్రు నేటి వసుధను ప్రజలే’ అనండి.

    రిప్లయితొలగించండి
  3. అభినవ శ్రవణకుమారుడు
    శుభముగ జన్మించెగనుడు సుందర భువిలో
    నభిరూపుడు మెచ్చునతని
    కభివాదము జేయరారె నాహా! యనుచున్!

    రిప్లయితొలగించండి
  4. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. పండు ముసలి వారు దండుగని తలచి
    ఇంటి నుండి సుతులు గెంటు చుండ
    ముసలి తల్లి దండ్రి మోసుకొని పోవుచు
    తనదు ప్రేమ జూపె తనయు డొకడు

    రిప్లయితొలగించండి
  6. జన్మనిచ్చి పెంచి జాగృత పరిచిన
    తల్లిదండ్రిసేవ దలిచెనతడు
    ధర్మమెరిగి మసలె ధన్యుడతడిలలొ
    కావడినను మోసి కీర్తిపొందె.

    రిప్లయితొలగించండి
  7. నడకలు నేర్పిన జనకుల
    కడపటి జీవిత గమనపు కలతలు బాపన్
    పుడమిన నీ యభినవ శ్రవ
    ణుడు కావడిఁ జేర్చె మిగుల నుతియించరయా!

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    ‘పానుగంటి’ గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘ఇలలొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాసారు. నాలుగవ పాదంలో యతి తప్పింది.
    ఆ రెండు పాదాలకు నా సవరణ...
    ధర్మమెరిగి మసలె ధన్యు డిల నతండు
    కావడినను మోసి ఘనత నందె.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. కంది శంకరయ్య గారికి ధన్యవాదాలు. ఈమధ్య రాయడం క్రమం తప్పింది. తప్పులు లేకుండా రాస్తాను.

    రిప్లయితొలగించండి
  10. మంచితనమ్మనునది యిం
    కొంచెమ్మిక్కాలమందు కూడను గలదే
    యంచని అచ్చెరువొందకు
    మంచని పల్కునిది చిత్తమందున నిలుచున్.

    రిప్లయితొలగించండి
  11. పలు క్షేత్రంబులు తల్లి దండ్రులకు సంప్రాప్తించ పుణ్యార్థముల్
    'అల దీక్షా పరుడైన శ్రీ శ్రవణుడో' యన్నట్లుగా ద్రిప్పుచున్
    కలి కాలంబున మోయుచుండెను గదా స్కంధాటిలో నేడు వీ డిల నాదర్శవరేన్యు డాయెను గదా యీ భూమి పుత్రాలికిన్.



    రిప్లయితొలగించండి
  12. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. మాస్టరుగారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు.
    సవరణతో...

    శ్రవణకుమారుండు మరల
    భువిలోనే పుట్టినాడు పుణ్యాత్ముడురా !
    స్తవనీయుడె మరి వా
    స్తవమేనాయంద్రు నేటి వసుధను ప్రజలే !

    రిప్లయితొలగించండి
  14. అవనిని గలరీ నాటికి
    శ్రవణుని బోలిన తనయులు చక్కగ సేవిం
    చు విడువక తల్లిదండ్రుల
    భువిపై దైవంబులనుచు మోయుచుతిరుగున్

    రిప్లయితొలగించండి