8, ఆగస్టు 2014, శుక్రవారం

వరలక్ష్మీ స్తుతి

వందేహం శ్రీహరిప్రియామ్


వందేహం శ్రీమహాలక్ష్మీం
వందే భక్త వరప్రదామ్ |
వందే వారిజ పత్రాక్షీం
వందేహం శ్రీహరిప్రియామ్ ||

వందే పూర్ణేందు బింబాస్యాం
వందే చంద్ర సహోదరీమ్ |
వందే మందస్మితాం పద్మాం
వందేహం శ్రీహరిప్రియామ్ ||

వందే సంపత్ప్రదాం దేవీం
వందే దారిద్ర్య నాశినీమ్ |
వందే హిరణ్మయీం శాంతాం
వందేహం శ్రీహరిప్రియామ్ ||

వందే సువర్ణ భూషాఢ్యాం
వందే దేవగణార్చితామ్ |
వందే సౌభాగ్య సంపన్నాం
వందేహం శ్రీహరిప్రియామ్ ||

వందే సౌఖ్యప్రదాం లక్ష్మీం
వందే మంగళ దేవతామ్ |
వందే దయామయీం సాధ్వీం
వందేహం శ్రీహరిప్రియామ్ ||

కీ.శే. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

6 కామెంట్‌లు:

  1. ''నేమాని ''ని స్మరియించెద
    నామాటను చని '' గజపతి నగరము '' నందున్
    తాము 'శివానంద లహరి '
    గ్రామస్తుల సభ పఠించి గాంచిరి ఖ్యాతిన్

    శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు గారు తాము రచించిన '' శివానంద లహరి '' ని
    నా కోర్కె పై ''చైతన్య భారతి గజపతినగరం'' సభలో తే 31/07/2011దీన ఆధ్యాత్మిక
    ప్రవచనం గావించిన ధన్యులు

    రిప్లయితొలగించండి
  2. లేవులేవాయెయికమాకు లేవునీవు
    యెచటికేగితినీవార్య!యిచటనుండి
    రమ్ము మాకొఱ కొకసారి రామజోగి!
    శంకరాభరణ గురువర!శర్మ!మీరు

    రిప్లయితొలగించండి
  3. వరముల నిచ్చెడితల్లిని
    వరలక్ష్మిగ పూ జ సేయ వరముల నిచ్చున్
    అరమరిక లేక యుండగ
    సరియగు పద్దతిన మీరు సలుపుడు పూ జల్ .

    వరలక్ష్మి వ్రతము రోజున
    వరువాత నె లే చి మీ రు వదలని భక్తిన్
    వరలక్ష్మి పూజ చేసిన
    వరలక్ష్మి యె నిచ్చు గాత !వరములు మీ కున్ .

    రిప్లయితొలగించండి
  4. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    పండిత నేమాని వారి నిధనము శ్రద్ధా౦జలి

    1.జాతున కేనాటికి ని
    ర్యాతము తథ్యమ్ము గాని యాత్మ యవధ్య౦
    బీతనువు మాసిపోయి
    పాత వలెను విడిచి నూత్న వస్త్రము దొడుగున్
    2.నేమాని పండితార్యుల
    కీమరణము ప్రాప్త మయ్యె నేకాదశినిన్
    నీమమ్ము జెడక పొందిరి
    యే మునివర్యులకు రాని యిట్టి సుగతులన్
    3.ప్రాముఖ్యమైన పాండితి
    నాముష్మికుడై రచించె నాధ్యాత్మికమౌ
    రామాయణమ్ము తెనుగున
    యా ముని వ్యాసుండు వోలె ఖ్యాతిని వడసెన్
    4.ఎన్నడు గరువము నెరుగడు
    చిన్నగ బోధించు వాడు శిష్యగణముకున్
    చెన్నుగ కవిమిత్రులకున్
    యెన్నగ తరమా యాతని హిత వచనములన్
    5. రామాయణమ్ము వ్రాయగ
    బాములు జెందంగ నింక భవముండదనన్
    ధీమంతులంద్రు పుణ్యని
    ధీ!మరు జన్మమ్ము లేదు ధీవర! నీకున్

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు!

    ధరలోనఁ జల్లఁగా మముఁ
    గరుణనుఁ గనుమమ్మ! వెతలు కలుగక యుండన్
    సరగునఁ గాపాడుచు నో
    వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

    నరులను సురలనుఁ బ్రోచుచుఁ
    దరుణముఁ గని రాక పోకఁ దనరించుచు వే
    గిరముగఁ గటాక్ష మిడు నో
    వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

    సిరులకు నిక్కయి, సతతము
    పరమార్థ మ్మిడుచు, జనుల ప్రార్థనములనున్
    గరుణనుఁ జేకొని, ప్రోచెడు
    వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

    చిరయశము గలుగవలెనని
    స్థిరముగ మేమంత నిన్నుఁ జేరి కొలువ స
    త్వరముగ దరిఁజేర్చియు నిఁక
    వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

    వరదాయి! విష్ణువల్లభ!
    కరుణామయి! సింధుకన్య! కమలాలయ! సుం
    దర దరహాస కటాక్షిణి!
    వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!


    -oO: శుభం భూయాత్ :Oo-

    రిప్లయితొలగించండి