చందమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. మొదటిపాదం చివర గణదోషం. ‘బ్రత్కుచు’ అనడం సరికాదు. ‘చచ్చుచు బుట్టుచు భూమిపైన నే/ లోపము...’ అని అందామా?
కం. మణు బూరెలు, గారెలు మరి చణకము మింగిన గణపతి జటరము బగులన్, అణకము లాడిన తారా గణ నాధుని కినుక బూని గౌ రి శపించెన్ కొరుప్రోలు రాధా కృష్ణ రావు guruvu gariki namaskaramulu jataramu lo ta ane aksharam otthu ta ravatam ledu
కవిమిత్రులు మన్నించాలి... హైదరాబాదుకు పోయి ఇప్పుడే తిరిగి వచ్చాను. ప్రయాణపు బడలిక వల్ల ఈనాటి పద్యాలను సమీక్షించలేకపోతున్నాను. వీలైతే రేపు ఉదయం పరిశీలిస్తాను. పద్యాలను పంపిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
శాపగ్రస్తుని స్వగతము :
రిప్లయితొలగించండిశాపము కాక యేమిటిది చచ్చుచు బ్రత్కుచు యీ భువిన్ యే
లోపము లేక పోయినను లోకులు లోకువ చేసి చూచుచున్
పాపము చేసినట్లు పెను బాధలు పెట్ట సహించుచున్ మన
స్తాపము బొంది మార్కొనగ శక్తియు చాలక తల్లడిల్లితిన్
చందమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మొదటిపాదం చివర గణదోషం. ‘బ్రత్కుచు’ అనడం సరికాదు. ‘చచ్చుచు బుట్టుచు భూమిపైన నే/ లోపము...’ అని అందామా?
శాపమునిచ్చెడు ఋషులకు
రిప్లయితొలగించండిబాపెడు శక్తియును గలిగి పక్వత తోడన్
కోపము పైన నియంత్రణ
చూపగలిగియుండిరనుట చొక్కపు నిజమౌ.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ధర్మ నిరతి భువిని గలిగిన క్రీడిలా
రిప్లయితొలగించండిశాపమేను వరము సజ్జనులకు
పాప బుద్ధి గలుగ భస్మాసురునివలె
శాపమౌను వరము సత్యమిదియె.
పాపముఁ జేసిన గతమున
రిప్లయితొలగించండిశాపముగా తాకు మీది జన్మమునైన
న్బాపగ గత పాప ఫలము
నాపరమేశుని భజించు డారాధనతో
మునులకు గోపము వచ్చిన
రిప్లయితొలగించండివెనువెంటనె శాప మీయ వెనుకాడరుగా
మనసంతయు రాజగుటను
కనలేకను మునియు రాక కలిగెను శాపమ్
ముని =దూర్వాసుడు
మనసంతా రాజు =శకుంతలకు
రాజు =దుష్యంతుడు
కోపము వచ్చిన మునులకు
రిప్లయితొలగించండిశాపము లిచ్చెదరుగాదె శాంతము లేకన్
తాపసులిడు శాపములకు
పాపము దశరధుడు కర్ణ భాధల నొందెన్
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండికోపావేశము కలిగిన
తాపములే మిగులుగాని దనురుగ జూడన్
కోపము లుడిగిన వారికి
శాపములే వరములగును శాంతినిగూర్చున్
శిక్షను శిక్షగ తలచిన
కక్షలు కలహములె కల్గు కలతలు మిగులున్
శిక్షను శిక్షణ యనుకొన
రక్షించును విద్యనొసగి రక్షకుని వలెన్
కం. మణు బూరెలు, గారెలు మరి
రిప్లయితొలగించండిచణకము మింగిన గణపతి జటరము బగులన్,
అణకము లాడిన తారా
గణ నాధుని కినుక బూని గౌ రి శపించెన్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
guruvu gariki namaskaramulu jataramu lo ta ane aksharam otthu ta ravatam ledu
పాపముఁ జేసితి నేమో?
రిప్లయితొలగించండిశాపముగా దాపురించె సంఘటనంచున్
కోపము జెందకు మోయీ
దీప మనెడు తెలివిఁ జూపి తీరుము మహిలో!
రిప్లయితొలగించండికవిమిత్రులు మన్నించాలి...
హైదరాబాదుకు పోయి ఇప్పుడే తిరిగి వచ్చాను. ప్రయాణపు బడలిక వల్ల ఈనాటి పద్యాలను సమీక్షించలేకపోతున్నాను.
వీలైతే రేపు ఉదయం పరిశీలిస్తాను.
పద్యాలను పంపిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.