21, ఆగస్టు 2014, గురువారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 60

రావిపాటి లక్ష్మీనారాయణ

రామాయణము-
చం.    మనముల నెన్నుచున్ (మిగుల మాన్యచరిత్రులు మేటి మత్స్య)లో
చన నుడిఁ, గోఁతికాఁ(పురము సద్రుచిఁ జేరిరి మోదమంది;) తా
    ము నయముగా మదిన్ (మఱువఁబోక హితంబును మాఱురూపు) లం
    తనుఁ బడి నంతఁ, జా(ల ధృతిఁ దాల్మి ధరించిరి లగ్గు మించఁ)గన్. (౭౫)

భారతము-
గీ.     మిగుల మాన్యచరిత్రులు మేటి మత్స్య
    పురము సద్రుచిఁ జేరిరి మోదమంది,
    మఱువఁబోక హితంబును మాఱురూపు
    ల ధృతిఁ దాల్మి ధరించిరి లగ్గు మించ. (౭౫)

టీక- (రా) కోఁతికాఁపురము = ఋశ్యమూకాద్రి; మాఱురూపు లంతనుఁ బడి వంతన్ = అంతట దుఃఖముచే కళావిహీనులై; లగ్గు = శ్రేయము; మత్స్యలోచన నుడి = శబరి మాటలు; వంత = దుఃఖము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి