ఒక లోభి, తను చచ్చాక ధనము పరులకెవ్వరికి దక్కరాదని ఆస్తినంతా విక్రయించి, ప్లాటినమ్ కొని, ఆ లోహముతొ ఒక్క అరటిపండుజేయించి, దానితోపాటు సముద్రంలో మునిగి చచ్చెనట !పరమలొభియైన బహుధనవంతునిచావులోనె ధనము జారిపోయె !!ప్లాటినము ఫలముతొ వార్ధిలొ మునిగెనుఅరటిపండు మూల్య మాఱుకోట్లు.
కొండవీటి రాజు కొడుకాడుకున్నట్టిపసిడి బొమ్మలన్ని పలికె వేల మందు గుఱ్ఱమేన్గు, హంస, మామిడిపండు నరటిపండు మూల్య మాఱుకోట్లు.
అరటిపండు మూల్య మాఱుకోట్లుగ జెప్ప కొనెడు వాడు లేక కొంత క్రుళ్ల మిగులు భాగమునకు మిలియన్లు వెచ్చించ నాక మేగుదురన నరక మొచ్చె
యం.ఆర్.చంద్రమౌళి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘ఫలముతొ, వార్ధిలొ’ అని ప్రత్యయాలను హ్రస్వంగా ప్రయోగించారు. ‘ప్లాటినంపు ఫలముఁ బట్టి వార్థిని మున్గె’ అందాం.*గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.*భాగవతుల కృష్ణారావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘ఒచ్చె’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. అక్కడ ‘నరక మొదవె’ అందాం.
మాన్యుడొకరు దిగె విమానాశ్రయంబునదొరికె నతని వద్ద చిత్రపరటి పండుపండు లోన మెరిసె వజ్రాల మెరుపులుయరటి పండు మూల్య మాఱు కోట్లు
మల్లెల వారి పూరణలుశ్రావణంబునందు చక్కనౌ పూజలోతమల పాకునందు తగను నిడెడుఅరటి పండ్ల గొనియు, అమ్మయే సిరులిచ్చుఅరటి పండు మూల్యమారు కోట్లుగౌరి దేవి గొల్చి కాంతలే యిచ్చేటివాయినంబు రెండు పండ్లు నవియెమూడు ముళ్ళ నిలుపు ముత్తైదుసేసలన్అరటి పండు మూల్యమారు కోట్లువరము లక్ష్మి పూజ బాగైన పండ్లలోఅరటి ముఖ్యమవియునంది లక్ష్మికోటి సిరుల నిచ్చు కొల్చేటి వారికిఅరటి పండు మూల్యమారు కోట్లుఆరుగాల మందు నందేటి పండ్లవేఅరటి పండు తినగ నందు శక్తిముక్తి గూర్చు పూజ ముదముగా నిడినంతఅరటి పండు మూల్యమారు కోట్లుమూడు కోట్ల తెలుగు ముత్తైదులందరుఅనువు గాను నిడరె అరటి పండ్లురెండు, వాయినంబు లింపౌను వానిచేఅరటి పండు మూల్యమారు కోట్లుఅరటి పండ్ల వొకటె యనువుగా దొరుకనిపూజలందు వాని పొలుపు వాడఅరటి పండ్ల ధరలు నాకస మంటేనుఅరటి పండు మూల్యమారు కోట్లుఅరటి మూలమదియె ననువుగా పాకునుఅరటి డొప్పలందు నలరు దివ్వెఅరటి యాకు లందు అన్నంబు తిననింపుఅరటి పండు మూల్యమారు కోట్లు
తీవ్రవాది యొకడు తినరంభ ఫలమిచ్చి పాప నెత్తు కొనియు పరుగు తీసె నారుకోట్ల నిస్తె నమ్మాయి మీదనె నరటిపండు మూల్య మాఱుకోట్లు.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు పూరణ: అరటిసిరులగొనుడు ఆకు మరకతమ్ము పాద మగ్నిభమ్ము బోదె పీత పూవు లోహితమ్ము పూసలు పొదిగిన అరటి పండు మూల్య మారు కోట్లు
ధనము విలువ తగ్గి ధరలు పెరుగుచున్న సగటి మనిషి మనువు సాగు నెట్లు?అరటిపండు మూల్య మారు కోట్లుండిన పట్టెడన్నమైన భాగ్య మగునె?
అరటి పండు లోన నరుదైన వజ్రములుదాచి పంపె నొకడు తనయులకును దొరికి పోయె నదియె దొరవారి సముఖాననరటి పండు మూల్య మారు కోట్లు
సహదేవుడు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.రెండవ పాదంలో గణదోషం.. చిత్రపు + అరటి = చిత్రపుటరటి అవుతుంది. ఆ పాదాన్ని ‘దొరికె నతనివద్ద నరటిపండు’ అంటే సరి. అలాగే ‘మెరుపులు + అరటి’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘వజ్రాల ధగధగ/ లరటిపండు...’ అనండి.*మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ ఏడు పూరణలు బాగున్నవి. అభినందనలు.‘ఇచ్చేటి, ముత్తైదు(వ), కొల్చేటి, అందేటి, అంటేను వ్యావహారిక, గ్రామ్య పదాలను ప్రయోగించారు.*గండూరి లక్ష్మినారాయణ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘ఇస్తె’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.*కెంబాయి తిమ్మాజీ రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.*ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.*శైలజ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.1,3 పాదాలలో గణదోషం. ‘వజ్రముల్, దొరవారి యెదుట’ అంటే సరి.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములుమరియొక పూరణ:తే.గీ.శ్రావణమ్ములన లక్ష్మి పూజలు సలుపుచు అప్పనగను తాంబూల మరటి పండు మూల్య మారు కోట్లు తెనుగు ముత్తయిదువు లిడగ నరువది కోట్లుగా లెక్కదేలు
గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :మాన్యు డొకరు దిగె విమానాశ్రయంబునదొరికె నతని వద్ద నరటి పండుపండు లోన మెరిసె వజ్రాల ధగధగలరటి పండు మూల్య మారు కోట్లు!
ఒక లోభి, తను చచ్చాక ధనము పరులకెవ్వరికి దక్కరాదని ఆస్తినంతా విక్రయించి, ప్లాటినమ్ కొని, ఆ లోహముతొ ఒక్క అరటిపండుజేయించి, దానితోపాటు సముద్రంలో మునిగి చచ్చెనట !
రిప్లయితొలగించండిపరమలొభియైన బహుధనవంతుని
చావులోనె ధనము జారిపోయె !!
ప్లాటినము ఫలముతొ వార్ధిలొ మునిగెను
అరటిపండు మూల్య మాఱుకోట్లు.
కొండవీటి రాజు కొడుకాడుకున్నట్టి
రిప్లయితొలగించండిపసిడి బొమ్మలన్ని పలికె వేల
మందు గుఱ్ఱమేన్గు, హంస, మామిడిపండు
నరటిపండు మూల్య మాఱుకోట్లు.
అరటిపండు మూల్య మాఱుకోట్లుగ జెప్ప
రిప్లయితొలగించండికొనెడు వాడు లేక కొంత క్రుళ్ల
మిగులు భాగమునకు మిలియన్లు వెచ్చించ
నాక మేగుదురన నరక మొచ్చె
యం.ఆర్.చంద్రమౌళి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఫలముతొ, వార్ధిలొ’ అని ప్రత్యయాలను హ్రస్వంగా ప్రయోగించారు. ‘ప్లాటినంపు ఫలముఁ బట్టి వార్థిని మున్గె’ అందాం.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఒచ్చె’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. అక్కడ ‘నరక మొదవె’ అందాం.
మాన్యుడొకరు దిగె విమానాశ్రయంబున
రిప్లయితొలగించండిదొరికె నతని వద్ద చిత్రపరటి పండు
పండు లోన మెరిసె వజ్రాల మెరుపులు
యరటి పండు మూల్య మాఱు కోట్లు
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండిశ్రావణంబునందు చక్కనౌ పూజలో
తమల పాకునందు తగను నిడెడు
అరటి పండ్ల గొనియు, అమ్మయే సిరులిచ్చు
అరటి పండు మూల్యమారు కోట్లు
గౌరి దేవి గొల్చి కాంతలే యిచ్చేటి
వాయినంబు రెండు పండ్లు నవియె
మూడు ముళ్ళ నిలుపు ముత్తైదుసేసలన్
అరటి పండు మూల్యమారు కోట్లు
వరము లక్ష్మి పూజ బాగైన పండ్లలో
అరటి ముఖ్యమవియునంది లక్ష్మి
కోటి సిరుల నిచ్చు కొల్చేటి వారికి
అరటి పండు మూల్యమారు కోట్లు
ఆరుగాల మందు నందేటి పండ్లవే
అరటి పండు తినగ నందు శక్తి
ముక్తి గూర్చు పూజ ముదముగా నిడినంత
అరటి పండు మూల్యమారు కోట్లు
మూడు కోట్ల తెలుగు ముత్తైదులందరు
అనువు గాను నిడరె అరటి పండ్లు
రెండు, వాయినంబు లింపౌను వానిచే
అరటి పండు మూల్యమారు కోట్లు
అరటి పండ్ల వొకటె యనువుగా దొరుకని
పూజలందు వాని పొలుపు వాడ
అరటి పండ్ల ధరలు నాకస మంటేను
అరటి పండు మూల్యమారు కోట్లు
అరటి మూలమదియె ననువుగా పాకును
అరటి డొప్పలందు నలరు దివ్వె
అరటి యాకు లందు అన్నంబు తిననింపు
అరటి పండు మూల్యమారు కోట్లు
తీవ్రవాది యొకడు తినరంభ ఫలమిచ్చి
రిప్లయితొలగించండిపాప నెత్తు కొనియు పరుగు తీసె
నారుకోట్ల నిస్తె నమ్మాయి మీదనె
నరటిపండు మూల్య మాఱుకోట్లు.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిపూరణ: అరటిసిరులగొనుడు ఆకు మరకతమ్ము
పాద మగ్నిభమ్ము బోదె పీత
పూవు లోహితమ్ము పూసలు పొదిగిన
అరటి పండు మూల్య మారు కోట్లు
ధనము విలువ తగ్గి ధరలు పెరుగుచున్న
రిప్లయితొలగించండిసగటి మనిషి మనువు సాగు నెట్లు?
అరటిపండు మూల్య మారు కోట్లుండిన
పట్టెడన్నమైన భాగ్య మగునె?
అరటి పండు లోన నరుదైన వజ్రములు
రిప్లయితొలగించండిదాచి పంపె నొకడు తనయులకును
దొరికి పోయె నదియె దొరవారి సముఖాన
నరటి పండు మూల్య మారు కోట్లు
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం.. చిత్రపు + అరటి = చిత్రపుటరటి అవుతుంది. ఆ పాదాన్ని ‘దొరికె నతనివద్ద నరటిపండు’ అంటే సరి. అలాగే ‘మెరుపులు + అరటి’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘వజ్రాల ధగధగ/ లరటిపండు...’ అనండి.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ ఏడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘ఇచ్చేటి, ముత్తైదు(వ), కొల్చేటి, అందేటి, అంటేను వ్యావహారిక, గ్రామ్య పదాలను ప్రయోగించారు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఇస్తె’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
1,3 పాదాలలో గణదోషం. ‘వజ్రముల్, దొరవారి యెదుట’ అంటే సరి.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిమరియొక పూరణ:తే.గీ.శ్రావణమ్ములన లక్ష్మి పూజలు సలుపుచు
అప్పనగను తాంబూల మరటి పండు
మూల్య మారు కోట్లు తెనుగు ముత్తయిదువు
లిడగ నరువది కోట్లుగా లెక్కదేలు
గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిమాన్యు డొకరు దిగె విమానాశ్రయంబున
దొరికె నతని వద్ద నరటి పండు
పండు లోన మెరిసె వజ్రాల ధగధగ
లరటి పండు మూల్య మారు కోట్లు!