12, ఆగస్టు 2014, మంగళవారం

పద్యరచన - 646

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
ఈ చిత్రాన్ని పంపిన పరుచూరి వంశీ గారికి ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

  1. హృద్యంబై కవి వర్ణిత
    పద్యంబై సాగర తటి భాసితమయ్యెన్
    విద్యుత్కాంతుల వెలుగుల
    ఖద్యోతుని యస్తమయము కనువిందయ్యెన్
    (విద్యుత్తు= సంధ్య )

    రిప్లయితొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    హృద్యమైన మీ పద్యం అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. సాగర ముందుకు నీవే
    సాగరమే నీకు తోడు సరి భానుండే
    సాగగ నాకాశంబున
    రాగముతో నీవుకూడ రాగము తోడన్.

    1 రాగము= ఎరుపు
    2 రాగము= పాట

    రిప్లయితొలగించండి
  4. మోడము మూసిన వేళల
    చూడ మనోహరము నింగి సొబగులు భళిరా!
    పాడగ పద్యములు మదిని
    వేడుక కలిగెను మరింత ప్రియమగు రీతిన్.

    రిప్లయితొలగించండి
  5. కను చీకటిపడు చుండెన్
    మునిమాపునలోకమంత మురియుచు నుండెన్
    వినుకెంపు తాక నాహా!
    మినమిన మనిమెరయుచుండె మీనాలయమే!

    రిప్లయితొలగించండి
  6. లలన !దినమంత పుడమికి వెలుగు నిచ్చి
    తనర మార్తాండు డొయ్యన వనధి యందు
    నస్త మించగ సమకట్టె నచట చూడు
    సూర్య బింబపు సొగసులు చూడ్కు లలర .

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    పద్యరచన:శీర్షిక అస్తమయ భాను బింబమ్మునలరె నబ్ధి.
    చిత్రణ :
    ఉదయ మునలేచి పయనమై చదలత్రోవ
    కొంత సేపైన తాళ విశ్రా౦తిలేక
    పశ్చిమా౦బుధి జేరెను బడలికగను
    పాదమిడి తూలి భానుడు పల్లటిలెను
    అరుణ కా౦తులు విరియ౦గ నాత్రపడుచు
    సంధ్య యనురాగ భరితయై చౌకలించి
    కిరణు ముద్దిడి తనదు కౌగిలిని జేర్చె
    అలసి సొలసిన భర్తకు నమృత మదియె

    రిప్లయితొలగించండి
  9. తూరుపు కొండలు దాటియు
    దారిని విశ్రాంతి గొనక తగు వేగముతో
    చేరెను సంధ్యను పశ్చిమ
    నీరధిలో సంగమించ నీరజ సఖుడున్

    రిప్లయితొలగించండి
  10. అరచేతి నడ్డు పెట్టుచు
    కరి మేఘము సూర్య కాంతి కడ్డిడ చూడన్
    అరుణిమ దాల్చెన భానుడు?
    తరణీ దీప్తులు మెరయని తరుణము గలదే!

    రిప్లయితొలగించండి
  11. పద్మినీ వల్లభుడు తాను పశ్చి మాద్రి
    చేర సాంధ్యా సమయమందు, ముదము గల్గి
    కడలి కెరటములుప్పొంగె కరము శక్తి
    సుందరమగునా దృశ్యము శోభ గూర్చె

    రిప్లయితొలగించండి
  12. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం హృద్యంగా ఉంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పూజ్య గురు దేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. రెండవ పాదములో యతి తప్పింది. "ముదము గల్గి" బదులుగా " చెన్ను గాను" అంటే సరిపోతుంది. Excuse me for the mistake.

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి వారూ,
    నిజమే... నేను గమనించలేదు.. సవరణకు సంతోషం!

    రిప్లయితొలగించండి
  15. మెరిసేటి సురీడా
    పరుగాపి మేఘాల్లో కను
    మరుగాయె మురిసెను చం
    దురుండ వనిన్ ముద్దాడ మురిపెముగా
    ( గురువు గారు ప్రణామములు నాకు కొంచం యతి నియమాల గురించి సూచించగలరు/వివరించగలరు/ . ప్రార్ధన) _/||\_

    రిప్లయితొలగించండి