28, ఆగస్టు 2014, గురువారం

సమస్యా పూరణం – 1509 (పురుషుల ప్రాణముల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్.

44 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    కఠినచిత్తలగు గంగవంటి స్త్రీలు
    పురుషుల ప్రాణములు తీయుటకే కదా పుట్టేది :

    01)
    __________________________________

    పురుషోత్తముడౌ భీష్ముని
    యురుతర సోదరుల నెత్తి - యుడువున గలిపెన్ !
    పరుషహృదయ గంగను గన
    "పురుషుల ప్రాణములఁ దీయఁ - బుట్టిరి వనితల్ "
    __________________________________

    రిప్లయితొలగించండి
  2. వసంత కిశోర్ గారూ,
    సంతోషం!
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. అరినైనన్ హరినైనన్
    తిరముగఁ వీక్షణపు బాణతీవ్రతతోడన్
    మురిపింతురు మరపింతురు
    పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్.

    రిప్లయితొలగించండి
  4. కఠినచిత్తలగు కుంతి వంటి స్త్రీలు
    పురుషుల ప్రాణములు తీయుటకే కదా పుట్టేది :

    02)
    ________________________

    ఉరుతర సుందర రూపుని
    పెరిమను విడి గంగ నొదిలె - పృథ యదె జూడన్ !
    కరుణా మూర్తులు గాదులె
    "పురుషుల ప్రాణములఁ దీయఁ - బుట్టిరి వనితల్ "
    ________________________
    పెరిమ = మమకారము
    పృథ = కుంతి

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా ధన్యవాదములు !
    మీరు యీ సమయములో****

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా !
    వాలుచూపులతోనే ప్రాణాలు తీస్తారన్న
    మీ పూరణ చాలా బావుంది !

    రిప్లయితొలగించండి
  7. వసంత కిశోర్ గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఒదిలె’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.
    నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.
    ఎందుకో ఇంకా నిద్రపట్టక ఇలా కూర్చున్నా...
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. కఠినచిత్తలగు కుంతి వంటి స్త్రీలు
    పురుషుల ప్రాణములు తీయుటకే కదా పుట్టేది :

    02అ)
    __________________________________

    ఉరుతర సుందర రూపుని
    పెరిమను విడి గంగ ద్రోసె - పృథ యదె జూడన్ !
    కరుణా మూర్తులు గాదులె
    "పురుషుల ప్రాణములఁ దీయఁ - బుట్టిరి వనితల్ "
    __________________________________
    పెరిమ = మమకారము
    పృథ = కుంతి

    రిప్లయితొలగించండి
  9. శంకరార్యుల స్ఫూర్తితో :

    విరహమనే అగ్నిలో వేచుట కొఱకేగా స్త్రీలు పుట్టేది :

    03)
    __________________________________

    సురముని నారదు నైనను;
    హరుడగు శంకరుని గాని; - అవ్యయునైనన్
    విరహానలమున నేచుచు
    పురుషుల ప్రాణములఁ దీయఁ - బుట్టిరి వనితల్ !
    __________________________________
    హరుడు = మన్మథహరుడు
    ఏచు = వేచు

    రిప్లయితొలగించండి
  10. కొంతమంది గయ్యాళి భార్యలు పుట్టేదందుకే :

    04)
    __________________________________

    పెరిమను మరతురు మరియును
    వరులను తూలుచును ప్రేలు - వఱ హీనముగా !
    పరుషపు వాక్కుల తోడుత
    పురుషుల ప్రాణములఁ దీయఁ - బుట్టిరి వనితల్ !
    __________________________________
    వరుడు = భర్త
    తూలు = తిట్టు
    ప్రేలు = చిటపటలాడు
    వఱ = హద్దు
    వఱ హీనముగా = హద్దన్నదే లేకుండా

    రిప్లయితొలగించండి
  11. సీతపుట్టింది దేనికి?
    రావణాదుల అంతానికేగా :

    05)
    __________________________________

    పరమపతివ్రత సీతను
    పరదారను చెఱను బెట్టి - పరమము జేరెన్
    సురబరులు రావణాదులు !
    పురుషుల ప్రాణములఁ దీయఁ - బుట్టిరి వనితల్ !
    __________________________________
    పరమము = పరమాత్మ
    బరి = శత్రువు

    రిప్లయితొలగించండి
  12. పురుషులను కని పాలిచ్చిపెంచి పోషించి ప్రేమను పంచే దేవతలేగదా స్ర్తీలు :

    06)
    __________________________________

    తరమగునె స్త్రీల కే విధి
    పురుషుల ప్రాణములఁ దీయఁ? - బుట్టిరి వనితల్
    పురుషుల కూపిరు లూదుచు
    పెరిమను పాలిచ్చి పెంచి - ప్రేమను పంచన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  13. పురుషులను వలపుల్లో ముంచి తేల్చేవారే గదా స్త్రీలు :

    07)
    __________________________________

    వరవర్ణుల కేమి కలుగు
    పురుషుల ప్రాణములఁ దీయఁ? - బుట్టిరి వనితల్
    పురుషుల లాలన జేయుచు
    విరలిని ముంచుచును దేల్చ; - వేడుక జెందన్ !
    __________________________________
    వరవర్ణిని = స్త్రీ
    విరలి = వలపు

    రిప్లయితొలగించండి
  14. మరమనుషులు కారోయీ
    పరదా చాటు సరదాలమర్చ తెరగునన్
    కరుడుల్ గట్టిన గరువపు
    పురుషుల ప్రాణములఁ దీయఁ - బుట్టిరి వనితల్ !

    కరుడుల్ అనవచ్చో లేదో తెలియదు. కరుడుగట్టిన అనే అర్థం లో రాయాలని అనుకున్నాను.

    రిప్లయితొలగించండి

  15. స్మరునైదుశరములన్ని య-
    మరియున్నవిశాలనేత్ర మహితేక్షణముల్
    సరిపోవుననజుడెంచిన
    పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్

    రిప్లయితొలగించండి
  16. వినాయకచవితి ముందు తదియగౌరీ వ్రతము ఈ రోజు.

    అందుకే గౌరీ దేవి అసురుల బాపిన సందర్భాన్ని తలచుకుంటూ

    సురలకు వైరులు, నీచుల
    సురులనుఁ జంపగ రణమునఁ జొక్కపు రీతిన్
    గిరిసుత సేనగ వేవేల్
    పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్.

    రిప్లయితొలగించండి
  17. శ్రీగురుభ్యోనమ:

    కఱకగు హృదయులు కారీ
    పురుషుల ప్రాణములఁ దీయఁ, బుట్టిరి వనితల్
    మురిపించుచు మాతృత్వపు
    కరుణామృతరసము పంచి కష్టము దీర్చన్.

    రిప్లయితొలగించండి
  18. వసంత కిశోర్ గారూ,
    మీ మిగిలిన ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    మాజేటి సుమలత గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నెరి కరడుగట్టు గరువపు’ అనండి.
    *
    మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సరిపోవుననజుడు’...?
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. పరిహృతి జేయుచు మహిషా
    సురాది దనుజులను దుర్గ జేపట్టి భవున్
    సరణిని కలిగించెను కా-
    పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్.

    రిప్లయితొలగించండి
  20. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    తరువున కిసలయములుగా
    పరిమళ మొసగెడి విరులుగ పరువము నందున్
    మరుని శరమ్ముల వోలెను
    పురుషుల ప్రాణముల దీయ బుట్టిరి వనితల్

    రిప్లయితొలగించండి
  21. పురిటిని బరువనక నిలిపె
    పురుషుల ప్రాణములఁ , దీయఁ బుట్టిరి వనితల్
    కురిపించగ యను రాగము
    కరుణను స్త్రీలిడిన భిక్ష గద మగబ్రతుకుల్
    తీయ=ఇంపైనది

    రిప్లయితొలగించండి
  22. శ్రీ శంకరయ్య గారు,
    _/\_

    సరిపోవునని అజుడు ఎంచిన = సరిపోవుననజుడెంచిన. అన్నాను, దానికి బదులుగా " సరిపోవుననియజు దలచి" అనవచ్చును.
    పురుషులను నిర్జింప తరుణుల కనుగొనలే పంచబాణనివాసమని యోచించి బ్రహ్మ, స్త్రీలను సృష్టించెనను కల్పన !!

    రిప్లయితొలగించండి
  23. పురుషులు రాక్షసు లగునె డ
    వెరవక మఱి యింతు లెపుడు వీర్యము తోడన్
    సరగున సమరము జేయుత
    పురుషుల ప్రాణముల దీయ పుట్టిరి వనితల్

    రిప్లయితొలగించండి
  24. కరమగు కోర్కె లడరగా
    పరిపరి విధముల పురుషుల బాధలఁ బెట్ట
    న్నరకము భువిలోఁ జూపుచు
    పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్

    రిప్లయితొలగించండి
  25. చెరబట్టిన రావణులన్
    నరకాదుల వంటి ఖలుల నాశము జేయన్
    పరమేశ్వరి నంశములై
    పురుషుల ఫ్రాణములు దీయ బుట్టిరి వనితల్

    రిప్లయితొలగించండి
  26. కరమగు ప్రేమను పంచుచు
    పరితోషమునిడ పతులకు పరిచారికలై
    పరదారలఁ బట్టిన కా
    పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్

    రిప్లయితొలగించండి
  27. మురిపెము లాడెడు తన సతి
    పరుషము లాడ గనలేని పతి గతి తెలిసెన్
    భరపడి కోరిక తీర్పగ
    పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్.

    రిప్లయితొలగించండి

  28. కె.ఈస్వరప్పగారి పూరణ
    పరదేశీయుల తరుముచు
    చిరు వయసున ఝాన్సి లక్ష్మి,చెన్నమ్మ.భయ౦
    కర శత్రుల హత మార్చగ
    పురుషుల ప్రాణమ్ము దీయ బుట్టిరి వనితల్

    రిప్లయితొలగించండి
  29. నరకాధిపు నొకతె గెలిచె
    నరకాసురు నొకతె జంపె నాధుని కొరకై
    పరదేవత లీ భువి నే
    పురుషుల ప్రాణములదీయ బుట్టిరి వనితల్?

    రిప్లయితొలగించండి
  30. శంకరయ్య గారికి నమస్కారములు

    మీ పూరణ చాలా బాగుంది. అయితే "అరి నైనను హరి నైనను" అంటే పద్యం నడక బాగుంటుందేమో ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  31. తరగని తరణుల కోర్కెలు
    నెరవేర్చని భర్త లెల్ల నిర్వేదముతో
    తరచుగ బలుకుదు రిట్టుల
    పురుషుల ప్రాణములు దీయ పుట్టిరి వనితల్.

    రిప్లయితొలగించండి
  32. మల్లెల సోమనాధ శాస్త్రి, హనుమాన్ జంక్షన్. వారి
    పూరణలు.
    సురకయి,వనితల,విత్తము
    కొరకయి యుద్ధములు ధరను కొల్లగ జరిగెన్
    వరుసగ,తా వ్యసనపరుల
    పురుషుల ప్రాణములదీయ బుట్టిరి వనితల్

    సుర విడి,మోహిని కొరకయి
    పరువిడి చెడరే యసురులు,పరగును నిట్లే
    వరుసగ ‍ఋజువులవెన్నో
    పురుషుల ప్రాణములదీయ పుట్టిరి వనితల్

    వరుసగ యుద్ధము లెన్నియొ
    జరిగెను వనితల కొఱకయి, సతులై వారే
    సరగున కాచిరి పెరలై,
    పురుషుల ప్రాణములదీయ పుట్టిరి వనితల్

    ధర గన పురుషులు, వనితల
    వరియింతురు కామవశత, వారే సరిగా
    వరలమి,కామోద్రిక్తత
    పురుషుల ప్రాణములదీయ పుట్టిరి వనితల్

    అరయగ నొక వనితకునై
    పెరవారలు నౌచు తాము విజ్జత విడరే
    ధరలో కొట్టుక చత్తురు
    పురుషుల ప్రాణములదీయ పుట్టిరి వనితల్

    రిప్లయితొలగించండి
  33. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
    నిన్నటి పూరణలో రెండు పాదములు వ్రాసిన పిదప ఇది నిర్వోష్ట్యాక్షరాలతో వ్రాయాలని మరచినాను.
    మీ సూచనలకు ధన్యవాదములు

    సవరించి వ్రాసిన పద్యము చూడండి

    కల్లు సారాయి త్రాగిన నొళ్ళుచెడును
    జీవన వహన కగచాట్లు చేరువగును
    కల్ల గాదు సేవించకు మిల్లు గుల్ల
    చేసి యవి నీకు చివరికి చింత నిచ్చు

    రిప్లయితొలగించండి
  34. పురుషాంశమెగొని మోయుచు
    పురుషునిగని పాలనిచ్చి పుడమిని పెంచన్
    పురుషుడె పరుషతబొందిన
    పురుషుల ప్రాణములదీయ పుట్టిరి వనితల్

    రిప్లయితొలగించండి
  35. కం . నరకాసుర మహిషాసుర
    సుర వై రులు బొంది రంత సుమనస వరముల్,
    వరముల్ ఘన ముగ బొందిన
    పురుషుల ప్రాణ ముల దీయ బుట్టిరి వనితల్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  36. ధరణిజ కై దశకంఠుడు
    పర సతికై కీచకుండుఁ బాయగ నశువుల్
    ధర మోహాతిశయపు పర
    పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టరి వనితల్!

    రిప్లయితొలగించండి
  37. ధన్యవాదములు మాస్టారు గారు. సవరించిన పద్యం :

    మరమనుషులు కారోయీ
    పరదా చాటు సరదాలమర్చ తెరగునన్
    నెరి కరడుగట్టు గరువపు
    పురుషుల ప్రాణములఁ దీయఁ - బుట్టిరి వనితల్ !

    రిప్లయితొలగించండి
  38. కవిమిత్రులు మన్నించాలి...
    హైదరాబాదుకు పోయి ఇప్పుడే తిరిగి వచ్చాను. ప్రయాణపు బడలిక వల్ల ఈనాటి పూరణలను సమీక్షించలేకపోతున్నాను.
    వీలైతే రేపు ఉదయం పరిశీలిస్తాను.
    పూరణలు పంపిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  39. సరసను సముద్రమున్నను
    వరములు కోకొల్లలున్న పది తలలున్నన్
    పరకాంతను మోహించిన
    పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్

    రిప్లయితొలగించండి
  40. అభినవ గాంధారి:

    నరవరు డంధుని గొనుచున్
    సరసపు మాటలను వీడి చంపుకు తినుచున్
    వరుసగ మూర్ఖుల గనుచున్
    పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్

    రిప్లయితొలగించండి