గణపతి! భక్తి తో నిడుదు కంఠము నందున పూలమాల నీ ప్రణవపు తుండమున్ కదిపి భాసుర లీలను నా శిరస్సు పై నణచుచు నాదు దోసముల నాశిషముల్ దయసేసి వేగ నా ప్రణయ విభున్ పరేతరుని పాలికి జేర్చవె ధన్యనై మనన్.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘ఆర్థితోడ’ అన్నారు. ‘ఆర్థి’ అనగా ఉపమాలంకార భేదం. మీ ఉద్దేశం ‘ఆర్తితోడ’ అనుకుంటాను. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, నిన్నటి, నేటి శీర్షికలకు మీరు వ్రాసిన రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. మొదటి పద్యం మూడవ పాదంలో ‘దొరవారు’ అన్నచోట గణదోషం.. టైపాటా? రెండవ పద్యంలో ‘సంతును/ న్నొసగి...’ అనండి. * శ్రీపతి శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘గణనాథుని’... టైపాటు వల్ల ‘గణానాథుని’ అయింది. * లక్ష్మీదేవి గారూ, వారం పదిరోజులు లీవు పెట్టి వెళ్ళివచ్చిన విద్యార్థి అన్ని రోజుల హోంవర్కును ఒక్కసారే చూపించి దిద్దమంటే నా వంటి వృద్ధోపాధ్యాయునికి కాస్త ఇబ్బందే! నా మెయిల్‍కు వచ్చిన మీ పూరణలను, పద్యాలను పైపైన చూశాను. వీలు కుదిరినప్పుడు సమీక్షిస్తాను. పద్యరచన పట్ల మీకున్న శ్రద్ధాసక్తులకు సంతోషం! మీ పద్యం బాగుంది. అభినందనల ‘దండ వైచి మ్రొక్కెదన్’. * గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. మాల ‘నళ్ళు’... మాల నల్లు. ఉదరస్వామి అన్నప్పుడు ర గురువై గణదోషం. ‘ఉమ కొమరుడు’ అనండి.
దైవమునకు సమర్పించఁ దలపు కలుగ
రిప్లయితొలగించండిపూలమాలను తనుమద్య యాలయమున
నల్లు చున్నది కడునిష్ట నార్థి తోడ
కోర్కె లేమి తాఁ గోరునో కోమలాంగి
పన్నగధర పుత్రునకే
రిప్లయితొలగించండికన్నియ తా గట్టుచుండెగా పూమాలన్
చెన్నుగ విఘ్నములణగుచు
కన్నులలో నున్న సఖుడె కావలె విభుగా.
గణపతి! భక్తి తో నిడుదు కంఠము నందున పూలమాల నీ
రిప్లయితొలగించండిప్రణవపు తుండమున్ కదిపి భాసుర లీలను నా శిరస్సు పై
నణచుచు నాదు దోసముల నాశిషముల్ దయసేసి వేగ నా
ప్రణయ విభున్ పరేతరుని పాలికి జేర్చవె ధన్యనై మనన్.
కరివదనుని పూజించగ
రిప్లయితొలగించండివిరులన్నియు మాలగట్టి వేయగ మెడలో
కరణించ మనుచు గన్నియ
శరణం చునుగౌరి సతుని సన్నుతి జేసెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినినిన్నటి పద్య రచన :
రిప్లయితొలగించండిఅమాయక లంబాడీ వనితలు పట్నవాసమేగిన తమ పతుల గూర్చి సంశయాత్మకంగా...
పట్నవాస మేగి బంగాకు త్రాగునో?
పేక ముక్క లాడ పైక మిడునొ?
మధువు త్రాగ నేర్చి మనువునే మరచునో?
మగని చిత్త మెటులొ? వగపు గూర్చు!
నేటి పద్యరచన:
శరణము గౌరీ తనయా!
విరమించగ విఘ్న గతులు వేలుపు నీవే!
మెరిసే వరమణి నీయగ
విరిమాలను భక్తి తోడ పేర్చెద స్వామీ!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఆర్థితోడ’ అన్నారు. ‘ఆర్థి’ అనగా ఉపమాలంకార భేదం. మీ ఉద్దేశం ‘ఆర్తితోడ’ అనుకుంటాను.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
నిన్నటి, నేటి శీర్షికలకు మీరు వ్రాసిన రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
గణనాధుని బూజించిన
రిప్లయితొలగించండిగుణవంతుండౌ పతిదొరకుననుచు లలనా
మణి పూలు మాలగ్రుచ్చెడు
నణువణువున భక్తిఁ దేవు నర్చించంగన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిపూలదండ నల్లు బాల సొబగు
1.నీలి పట్టు పరికిణి ధరించి భుజముపై
వంగపండు రంగు వల్లె వాటు
దొరవారు రైక దొడిగిన యాకన్నె
పూలదండ నల్లు లీల గనుమ
2.కుసుమములన్ని మాలగను గూర్చుచు నుంటివి దీక్ష బూని యో
బిసరుహ నేత్ర నెమ్మదిని విఘ్న వినాయకు వేడు చుంటివా ?
పొసగుడుసత్ప్రవర్తనుడు పుణ్య వ్రతుండగు భర్త,సంతుయు
న్నొసగ,నభస్య మాసమిక నోర్మి వహించుము పూజసేయగా
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిశ్రీగణానాథుని సేవకు
వేగముగా దరలివచ్చి వేదికనెక్కెన్
లోగిలి మ్రుగ్గులు వైచెను
బాగౌ సుమమాల గూర్చు బాలామణితాన్
అహో, వినాయకా! ధరిత్రియందునన్ జనించితిన్,
రిప్లయితొలగించండిమహానుభావ! నీవె దిక్కు మాకునిచ్చటెప్పుడున్!
సహానుభూతి చూపుమయ్య! చక్కనైన చూపుతోన్
దహించు మాదు పాపరాశి, దండవైచి మ్రొక్కెదన్.
చిత్త మందున నిల్పియు శ్రీ గణేశు
రిప్లయితొలగించండిపూజ జేయగ భక్తితో పూల మాల
నళ్ళు తెలుగింటి యమ్మాయి యాత్మలోన
నున్న నీ కోర్కెలను దీర్చు నుదర స్వామి.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యం మూడవ పాదంలో ‘దొరవారు’ అన్నచోట గణదోషం.. టైపాటా?
రెండవ పద్యంలో ‘సంతును/ న్నొసగి...’ అనండి.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘గణనాథుని’... టైపాటు వల్ల ‘గణానాథుని’ అయింది.
*
లక్ష్మీదేవి గారూ,
వారం పదిరోజులు లీవు పెట్టి వెళ్ళివచ్చిన విద్యార్థి అన్ని రోజుల హోంవర్కును ఒక్కసారే చూపించి దిద్దమంటే నా వంటి వృద్ధోపాధ్యాయునికి కాస్త ఇబ్బందే! నా మెయిల్‍కు వచ్చిన మీ పూరణలను, పద్యాలను పైపైన చూశాను. వీలు కుదిరినప్పుడు సమీక్షిస్తాను. పద్యరచన పట్ల మీకున్న శ్రద్ధాసక్తులకు సంతోషం!
మీ పద్యం బాగుంది. అభినందనల ‘దండ వైచి మ్రొక్కెదన్’.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు. మాల ‘నళ్ళు’... మాల నల్లు. ఉదరస్వామి అన్నప్పుడు ర గురువై గణదోషం. ‘ఉమ కొమరుడు’ అనండి.
పూజ్యులు గురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిదోరవారుఅనగాఎర్రని అని అర్ధము పొరపాటున దొరవారు అని టైపు పడినది.సంతుయున్ అనుటకుబదులు "సంతును న్నొసగి"అని మీసూచనకు ధన్యవాదములు
శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
రిప్లయితొలగించండిదోషమును గుర్తించి సవరించిన మీకు ధన్యవాదములు .