కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
పాత సమస్యలకు పద్యాలు. ఆలశ్యానికి మన్నించగలరు.
రిప్లయితొలగించండిసతము నీదు పదంబులన్ స్వాంత మందు
సుస్థిరముగ నిల్పి భజింతు సురుచిర శుక
పాణి సామగానంపు సుస్వర కళా భ
గవతి నీ పద యుగళ సద్గతి నొసగుమ
కృష్ణుని పై యశోద ఆగ్రహం
వమ్ముగ రేపల్లియ గో
పమ్మల తగుజాణతనపు మాటలు వినగా
నమ్మంజూడకుమీ మా
యమ్మ యని పిలువగానె యాగ్రహమందెన్
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండి.సమస్య:వల్లకాడులో పెళ్లి స౦బ౦ద మమరె
పూరణ:
కొండ రేడగు హిమవంతు కూతు రుమకు
బండలింగడు శివునకు వావి కుదుర
సురలు మునులును వచ్చిరి తరలి పెద్ద
వల్లకాడులో పెళ్లి స౦బ౦ద మమరె
మాధవ శివపురమ్ముల మధ్య నడవి
రిప్లయితొలగించండినిరుకు దారినబడి పెండ్లి కేగు వారి
బండ్ల చక్రములవి రెండు పంక్చరుగుట
వల్ల, కాడులో పెళ్ళి సంబంధ మమరె
మాధవ పుర మల్లికి శివపు రాధవునకు
కారుదిగి సేద దీరెడి కాలమందు
అందమగు ప్రకృతిని కన యడవికేగ
రిప్లయితొలగించండిమగువ యొక్కతి కనుపించి మదిని దోచె
మరులుకొనజేసినట్టి యామరుని శరము
వల్ల, కాడులో పెళ్ళి సంబంద మమరె
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిచలనచిత్రపు టూహల కలలలోన
పలు విధంబుల కథలను వ్రాసినంత
నటన జేసెడి నాయక వటుని కొరకు
వల్లకాటిలో పెళ్ళిసంబంధ మమరె
'ఆరు కాడు' లో ఉన్న అమ్మాయి కి
రిప్లయితొలగించండిచెలికాడు తగిలె సరస కాడై సంధించె ,
ఔసుకాడు , కొంటెగాడితో మది కుదిరె ,
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె.!!
జిలేబి
కొల్లలుగ గాలు శవములు
రిప్లయితొలగించండివల్లకాడులో, పెళ్లి సంబంధ మమరె
యల్లా గరుణన వాణికి
చల్లగ వారిరువురుండజరుపుదు పూజల్
1) వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె
రిప్లయితొలగించండిపెళ్లి జరిగెను ముష్టి వాకిళ్ళ లోన
తేనే చంద్రుని పండగ, తెగులు బుట్ట
ఫష్టు క్లాసు'కుపే'లోనవారికయ్యె(తేనెచంద్రుడు=హనీమూన్)
2) పెండ్లి జరుగగ తర్వాత పెండ్లి బండి
విరుగ మరణించ వరుడట విధవ కపుడు
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె
వరుని తమ్ముడు విధవకు వరుడు గాగ !
3) నిండు చూలాలి నొక్కడు మొండి కతన
పుస్తె కట్టక విడువ గా పొయెనామె
వల్లకాటికి, పౌరులు వాని బట్ట
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె.
4) వధువు లగ్నపు వేళనే వదలె నుసురు
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె,
కాటికేగుచు నుండగా కడకు వరుడు
వధువు చేల్లెలినే గోర పట్టుబట్టి !
5) పోయె ననుకొని యొకని గొంపోవ కాటి
కాతడు లేచెను ; జూసిన కాటిలోన
జనులు , పరుగిడ నొకకన్య మనసు పడగ
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె.
6) అచ్చి రావని పెళ్ళిళ్ళు నచ్చ కెపుడు
వల్లకాటినె పందిళ్ళు పాకలుంచి
పెళ్లి చూపుల నుంచగ వేడ్క మీర
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె.
7) కాటి కాపరి కంటెను మేటి వరుడు
గుంట కెవ్వడు రాడని తుంట రెవడొ
తోట, నింటను ,గాక నా కాటి నెంచ
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె.
8) పండితుడు పెట్టు మూర్తము దండ గిపుడు
పచ్చ నింటను చూపులు పనికి రావు
కాటి యొక్కటె గలదదె కనకమనగ
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె.
కరుడు కట్టిన పెద్దల కరకు దనము
రిప్లయితొలగించండిప్రేమ పక్షుల విడదీయు బెట్టు జూప
విగత జీవులై కాయముల్ వెలసి నంత
వల్లకాడులో, పెళ్ళి సంబంధ మమరె !
శవమును పరిణయమాడిన శాశ్వతముగ
రిప్లయితొలగించండిమంత్రి పదవి నిల్చుననుచు మంత్రవేత్త
జెప్ప, మూఢ మంత్రి వరుఁడు చీరఁ గట్ట
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె!!
రిప్లయితొలగించండిస్థలము నిర్జనము పచ్చగ విశాలముగను
లేక రుద్రభూములయందె లెస్సగాను
కలయ న్యూయార్కులో క్రొత్త కాలుత్రొక్కు
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె
మ్యాన్ హ్యాటన్ నగరంలో ఈ ’సమస్యే’ లెదు. సిమెట్రీలు అందమైన పచ్చని ప్రదేశములే పెళ్ళిళ్ళకు ప్రశస్తమని, రోజుకి మూడువేల డాలర్లైనాపెరిగిపోతున్న క్రొత్త ప్యాశన్. వివరాలకు :
http://www.dailymail.co.uk/femail/article-2181153/Til-death-start-The-rising-trend-cemetery-weddings.html#comments
పెళ్ళి కుదరక చనిపోయి ప్రేమజంట
రిప్లయితొలగించండిప్రేతములుగాను మారిరి, ప్రీతి తోడ
ప్రేతగణములు తలపోసి వేడ్క జేయ
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె
ఫాల నేత్రుడైన హరుఁ నివాసమేమొ
రిప్లయితొలగించండివల్లకాడులో, పెళ్ళి సంబంధ మమరె
పార్వతీ దేవితో హిమపర్వతమున
చేసె కాపురమ్మేమొ కైలాసమందు
అడవి యన్నలతో జేరె నతివ యొకతి
రిప్లయితొలగించండికొన్ని నాళ్ళకు మనువాడ కోర్కె పుట్టె
నామె చేరియున్న దళ నాయకుని యండ
వల్ల కాడులో పెళ్ళి సంబంధ మమరె.
మృత్యుదేవత ప్రాణాల మెల్లఁదీయ
రిప్లయితొలగించండిబంధుగణమెల్ల తోడును వదలిపోఁగ
కట్టె కాయగ్ని సాక్షిగ కట్టెతోడ
వల్లకాడులో పెళ్ళి సంబంధ మమరె.
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండిమరణ శయ్యను నుండగా మాట గొనెను
తనదు అక్కయె, తనకూతు ధర్మ పత్ని
గాగ, కొనుమని, యతడును గారవించె
వల్లకాడు లో పెళ్లి సంబంధ మమరె
వల్ల కాడున వెల్గేటి వాడు హరుడు
పార్వ తాతని పతిగాను పడయ నెంచ,
ఎట్ట కేలకు నొప్పు కొన్నట్టి యెడను
వల్లకాడు లో పెళ్లి సంబంధ మమరె
భార్య మరణించి చితిపైన పార్థివంపు
దేహ మున్నప్డె, కొదరు తెల్పిరతని
పెండ్లి యాడంగ పిల్లను వేరునొకతె
వల్లకాడు లో పెళ్లి సంబంధ మమరె
సమయ సందర్భ మెరుగని సఖుడు నొకడు
భార్య చితిపైన నుండగా పలికె, వాని
కొడుకుకు తనదు కూతును కొనగ వేడె
వల్లకాడు లో పెళ్లి సంబంధ మమరె
రిప్లయితొలగించండికె.ఈశ్వరప్ప గారి పూరణ
తల్లి దండ్రులు మెచ్చిన తరుణి యూరు
"వల్లకాడు"లో పెళ్ళి సంబంధ మమరె."
యూరు పాతదే బంధులే వారు మనకు
అర్ధరాత్రి ముహూర్తమ్మట౦చు తెలిపె
మాజేట్ సుమలత గారూ,
రిప్లయితొలగించండిమీ న్యస్తాక్షరి, సమస్యాపూరణం రెండూ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పెద్ద వల్లకాడు’ అనడం మీ భావం?
*
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రాసయతికోసం ‘శివపురపు ధవుడు’ శివపురాధవు డయ్యాడు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
సినిమా వాళ్ళు ఏం చేయడానికైనా సమర్థులు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
సమస్య తేటగీతిలో ఉంటే మీరు మిగతా మూడు పాదాలకు కందాన్ని వ్రాశారు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ ఎనిమిది పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఐదవ పూరణలో కాటి/కతడు అనవలసింది టైపాటు వల్ల కాటి/కాతడు అయినట్టుంది. గణదోషం.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. సవరించండి.
*
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. సవరించండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో ‘వెల్గేటి’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘వెల్గెడు’ అంటే సరి. ‘పార్వతి + ఆతని’ అన్నప్పుడు సంధి లేదు. ‘పార్వతి యాతని’ అవుతుంది. అక్కడ ‘పార్వతి యతని పతిగను పొందదలచి’ అనండి.
*
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తే గీ అంత్య సంస్కార మెచ్చట ఆచరింత్రు?
రిప్లయితొలగించండిభారతీయుల దాంపత్య బంధ మేది?
శివుని విల్లును విరవ వి శేష మేమి?
వల్లకాడులో, పెళ్లి, సంబంధ మమరె
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు శ్రీ నాధుడు కాశీఖందములో పెద్దవల్లకాడని కాశేపట్నా న్ని అభివర్ణి౦చారు వేదవ్యాసుడు శిష్యులనుసంబోధిస్తూ
రిప్లయితొలగించండి"అబ్బెనే నేడు మీకు మధ్యాహ్న భిక్ష ?
.........................
.........................
వాడవాడల నీపెద్ద వల్లకాడు అని అడుగుతాడు పెద్దవల్లకాడనగాకాశీ పట్నమన్నఅర్ధ౦లో ప్రయోగించాను
మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు.
రిప్లయితొలగించండినేఁటి సమస్య: "వల్లకాడులో పెళ్లి సంబంధ మమరె" నిది వ్యావహారికములోనుండుటవలన దీనిని గ్రాంథికములోనికి మార్చుకొని పూరణముఁ జేయుచుంటిని. మన్నింపఁగలరు.
నా పూరణము:
పెండ్లి కాకుండ గిట్టిన పిన్నబాలు
నకును, జిల్లేడువృక్షమ్మునకునుఁ బెండ్లి
సేయవలెఁగానఁ, గాటిలోఁ జేయఁబోవ,
వల్లకాటిలోఁ బెండ్లి సంబంధ మమరె!
కొరప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
రిప్లయితొలగించండిక్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
నిజమే... మరిచిపోయాను.. మన్నించండి.
*
గుండు మధుసూదన్ గారూ,
సమస్యలో మీరు చేసిన మార్పు వ్యాకరణ బద్ధమైనది. ధన్యవాదాలు.
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
కవిమిత్రులకు మనవి....
రిప్లయితొలగించండికొందరు మిత్రుల కోరికపై రోజురోజుకు నిన్న చెప్పిన క్రమం కాకుండా సమస్య - దత్తపది - సమస్య - నిషిద్ధాక్షరి - సమస్య - న్యస్తాక్షరి - ఈక్రమాన్ని పాటిస్తానని గమనించి సహకరించండి.
ఈ క్రమంలో రేపు ‘దత్తపది’ ఉంటుంది.