19, ఆగస్టు 2014, మంగళవారం

పద్యరచన - 652

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. బిందెల నెత్తిన బెట్టుకు
    సందడిగా నీటిలోన జనుచున్ ముదితల్
    తొందరగ యేరు దాటగ
    నందంద దగ్గరగ కరమునందుకరమిడెన్
    (అందంద = మఱిమఱి)

    రిప్లయితొలగించండి
  2. చుక్క మంచి నీళ్ళను పొందు దిక్కు లేక
    నీరు దెచ్చుచు నుండిరి యేఱు దాటి
    యేఱు యురవడి తోడను పాఱు చుండ
    చేయి చేయిని కలిపిరి చేడె లంత(చేర దరికి)

    రిప్లయితొలగించండి
  3. చుట్టూతా నీళ్ళు న్నా తాగటానికి
    కడివెడు నీళ్లకై మైళ్ళు పయనం
    నరేంద్రా , దామోదరా , ఉమ
    ఎప్పుడు గంగని వడి గట్టున్ ??

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. ఇన్నేని మంచినీటికి
    మున్నీటను సగము మునిగి ముదితలు దాటున్
    అన్నీటి బిందె మోయుచు
    కన్నీరే వారిచుట్టు కదలినదేమో !

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    చివరి పాదంలో గణదోషం. సవరించండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    జిలేబి గారూ,
    _/\_
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నీరు బిందెల నిండుగ నింపుకొనుచు
    నడుము లోతును గలయట్టి మడుగు లోన
    పోవు చుండిరి భామలు మూవు రచట
    చూడ చక్కని దృశ్యము చూడు బాల !

    రిప్లయితొలగించండి
  7. ధన్యవాదములు మాష్టారు ....సవరించిన పద్యము
    బిందెల నెత్తిన బెట్టుకు
    సందడిగా నీటిలోన జనుచున్ ముదితల్
    తొందర పడుచునొకరి కర
    మందింకొక రి కరమునిడి మడుగును దాటన్

    రిప్లయితొలగించండి
  8. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. దరిదాపుల గొంతుఁ దడుప
    సురగంగను దింప కున్న చుక్కెడు జలమున్
    అరవై యెనిమిది దాటిన
    నిరంతరము దొరకఁ జేయు నేతలెవరయా?

    రిప్లయితొలగించండి
  10. బిందెల దొంతర నెత్తిన
    నందమ్ముగ మంచినీరు నందగ కదలన్
    సుందర మైనన్ మనమున
    సందియమే కలుగు దేశ స్వాతంత్ర్యముపై!

    రిప్లయితొలగించండి
  11. వడి ఉన్న వాగు దాటగ
    వడి వడిగ బిందెలెత్తుకు
    వొడి తడవగ నీటనున్న
    వనితలందరు కదలెన్.!!

    నాకు చందస్సు ఏ మాత్రమూ రాదు...ఇక్కడ నా మొదటి ప్రయత్నం...మిత్రులు తప్పులుంటే మన్నిస్తారని ఆశిస్తూ.

    రిప్లయితొలగించండి
  12. నీరుతలను దాల్చి యేరు దాటగజూచు
    ముదితచయము చూడ ముచ్చటౌను
    బిందె దింపి దాహమంది యీయగ వచ్చు
    శ్రమకు విలువ కట్ట శక్య మగునె?

    రిప్లయితొలగించండి
  13. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    సుసర్ల నాగజ్యోతి గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    ఛందస్సు నేర్చుకొనడం చాలా సులభం. ఛందస్సు అని గూగుల‍లో వెదికితే ఛందస్సు నేర్పే ఎన్నో బ్లాగులు మీకు దొరుకుతాయి. ప్రయత్నించండి.. తప్పులు సరిదిద్ది సరైన మార్గం చూడడానికి నేనున్నాను, మిత్రులున్నారు. స్వస్తి!
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. దవ్వునకు నేఁగ నీరము తగ్గ శుభ్ర
    మయిన రీతి దొరకునంచు నమ్మలెల్ల
    కష్టమును లెక్కసేయక కదలుచుండ్రి
    యక్కటా కండ్లు తడిసెనె నందరికిట.

    రిప్లయితొలగించండి