26, ఆగస్టు 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1508 (కామదాసులైన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కామదాసులైనఁ గలుగు ముక్తి
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

39 కామెంట్‌లు:

 1. మాస్టరు పలికెనిది "యజ మానులైన ,
  దాసులైనఁ గలుగు ముక్తి"
  తమ్మి! గుర్తె
  అక్షరములైన "యజమానులైన కామ
  దాసులైనఁ గలుగు ముక్తి"
  తరచి చూడ!!

  రిప్లయితొలగించండి
 2. హరునియంశ యైన హనుమయే దాసుడై
  రాము గొలిచె తాను, రండు రండు
  గొప్ప కాదు మనము గోరంత చీమంత
  కామ ? దాసులైనఁ గలుగు ముక్తి.

  రిప్లయితొలగించండి
 3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ చక్కని విరుపుతో మంచి పూరణ చేచినారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. కోరు కున్న దాని చేరుకునే దాక
  దాసుడగుచు సాగ దక్కు నదియె
  మనుజు లెవ్వ రైన మహిలోనఁ గన మోక్ష
  కామ దాసు లైనఁ గలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 5. కవిమిత్రులు గోలి వారు బాగా విరిచారు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. రామతారకమును రమణికిచ్చినవేల్పు
  జాళువింటివాడు జంగమయ్య
  కాలకంఠు శివుని కాశినాథుని జిత
  కామదాసులైనఁ గలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 7. కామి కానివాడు కాబోడు తామోక్ష
  కామి యనెడు మాట కలదు భువిని
  తలచెనొకడు దాని తప్పుగా నీరీతి
  కామ దాసులైన కలుగు ముక్తి.


  శ్రీ గూండా వేంకట సుబ్బ సహదేవుడుగారూ, నమస్కారం. మీ పద్యంలో మోక్ష కామ దాసులు అని ప్రయోగించేరు. ఇది ఎంతవరకు సమంజసం అంటారూ?? మోక్ష కామి లేదా మోక్ష కాములు అంటే అర్ధవతంగా ఉన్నంతగా మోక్ష కామ దాసులు అంటే ఉందంటారా??

  పెద్దలు కాస్త చర్చిస్తే బాగుంటుందేమో

  రిప్లయితొలగించండి
 8. శ్రీగురుభ్యోనమ:

  అర్థ కామములను స్వార్థముతో గాక
  ధర్మ రక్షకొరకు ధారవోసి
  దేశ దేవ సేవ తృప్తిగా జేయు స
  త్కామ దాసులైన గలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 9. ఇహము పరము కూడ నిడుమలే యుండును
  కామదాసు లైన , గలుగు ముక్తి
  భక్తి శ్రద్ధ తోడ భగవంతు బూజించ
  దయను జూపు నతడు దైవ మేను

  రిప్లయితొలగించండి
 10. కామి గాక మోక్ష గామికాడందురే !
  కల్ల కాదు నదియె కఠిన నిజము
  చింత లన్ని విడచి శివతత్వ మరయుచు
  కామ దాసు లైన కలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 11. ఆ. వె . దైవ చింత మనకు కావలె కామమ్ము
  భక్తి పొంగి పొరలి ముక్తి గలుగు ,
  రామ నామ మన్న కామమ్ము గలుగంగ
  కామ దాసు లైన గలుగు ముక్తి.
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 12. ఆ. వె . దైవ చింత మనకు కావలె కామమ్ము
  భక్తి పొంగి పొరలి ముక్తి గలుగు ,
  రామ నామ మన్న కామమ్ము గలుగంగ
  కామ దాసు లైన గలుగు ముక్తి.
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 13. శ్రీకామేశ్వర శర్మ శ్రీఆదిభట్ల గారికి నమస్కారములు. మోక్షాన్ని పొందాలనే కామానికి దాసులు కావడం అనే అర్థంలో వ్రాశాను. ఒప్పనే అనుకుంటున్నాను. పెద్దల నిర్ణయము తెలియజేయగోర్తాను.

  రిప్లయితొలగించండి
 14. కలుగ బోదు భక్తి కడముట్టు వరకు
  కామ దాసు లైన, కలుగు ముక్తి
  కామ దాసు గాక రామదాసవ్వగ
  మోక్ష సీమ నంది మోద మలరు

  రిప్లయితొలగించండి
 15. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  కామి క్రోధి లోభి గాకుండధర్మార్ధ
  కామమోక్షములకు గామి యగుచు
  కర్మఫలము శివున కర్పి౦చు భక్తుండు
  కామ దాసుడైన కలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 16. వరుస వావి విడిచి విరివిగా పరులతో
  కామసుఖము నొంద కలుగు నఘము
  సొంత దారచెంత సుఖములఁ గోరుచు
  కామదాసులైన కలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 17. బాల కుండు చదివె బడిలోన పద్యము
  కామ దాసు లైన కలుగు ముక్తి
  అచ్చు తప్పు నంచు ననుయోక్త సరిదిద్దె
  కాళి దాసు లైన కలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 18. కర్మ యోగులిలను కామ్యకర్మలు ధర్మ
  మైన రీతి చేసి మాన్యులౌచు
  కృష్ణ భక్తి గల్గి, గృహపత్ని యందుస
  త్కామ దాసులైన గలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 19. నిత్య మొకటె బ్రహ్మసత్యము, జగమంత
  నిత్య చంచలములె నిలుకులేక
  తత్త్వమెరిగి చేతనత్వమెయగుచు ని-
  ష్కామదాసులైనఁ గలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 20. కామ దాసులైన కలుగు ముక్తి,నరుడ!
  నీతి ధర్మ కర్మ నియతి నుండి,
  యిళ్ళు వళ్ళు చెడును యిల్లాలు దుఃఖించు
  దాసు లైన బ్రతుకు దారి తప్పు

  రిప్లయితొలగించండి
 21. మల్లెల వారి పూరణలు

  కామి గాని వాడు కనగాను మోక్షంబు
  నంద లేడు నండ్రు, నందు చేత
  కామ మందు రోత కలిగిన యపుడేను
  కామ దాసు లైన కలుగు ముక్తి

  కామ మందు మునిగి కాంక్షదీరినయంత
  కామి మోక్ష మార్గ గామి యగును
  పలికె ధూర్జటటులె బాగు శతకమందు
  కామ దాసులైన కలుగు ముక్తి

  కామ మదియ మనసు కాల్చివేయును గాదె
  కామికెపుడు మనసు కాంతయందె
  కామ మంతమైన కాంతుడు దైవంబె
  కామ దాసు లైన కలుగు ముక్తి

  నమ్మి భక్తి విప్ర నారాయణుండును
  ముక్తి నందలేదు. మోహనంపు
  కాంత దాసుడయ్యు, కాంచడే ముక్తిని
  కామ దాసు లైన కలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 22. అమ్మ దివ్య రూప మమ్మ పాదమ్ముల
  నమ్మ కరుణ కురియు నట్టి కనుల
  చూడ గోరు తపన శుభముల నిడు నిట్టి
  కామదాసులైనఁ గలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 23. భక్తి యున్న దొరయు భగవతి దీవెన
  వదల వలదు మాత పాదములను.
  జగమునందు పడయు సౌఖ్యంబులను, శివ
  కామ దాసు లైనఁ గలుగు ముక్తి.

  రిప్లయితొలగించండి
 24. ధర్మవర్తనంబు త్యాగంబునీశ్వర
  చింతనాదికములఁ సేయుచుండి
  సకల జనుల శాంతి సౌభాగ్యమనెడి స
  త్కామదాసులైనఁ గలుగు ముక్తి.

  రిప్లయితొలగించండి
 25. కామ దాసులైన కలుగు ముక్తి, నరుడ !
  నీతి , ధర్మ ,కర్మ, నియతులందు
  యిల్లు నొళ్ళు చెడును యిల్లాలు దుఃఖించు
  దాసు లైన బ్రతుకు దారి తప్పు

  రిప్లయితొలగించండి
 26. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణలోని భావాన్ని అర్థం చేసికొనలేకపోతున్నాను. దయచేసి వివరించండి.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  విలక్షణమైన విరుపుతో చక్కని పూరణ నందించారు. అభినందనలు.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కామమంటే కోరిక. మోక్షముపట్ల కోరికకు దాసుడు అనే అర్థం గ్రహించడంలో దోషం లేదని నా అభిప్రాయం.
  *
  మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణ మొదటి పాదంలో ‘వరకు’ అన్నచోట గణదోషం.
  ‘అచ్చుతప్పు నంచు’ అన్నచోట ‘అచ్చుత ప్పటంచు’ అనండి.
  *
  కొరుప్రోలు రాధాకృష్ణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 27. గురువుగారు,
  నా పూరణ విరామ చిహ్నమైన కామాను(,)అక్షర రూపములో 'కామ ' అని వ్రాస్తే ఇలాఉంటుంది అని చెప్పడం.

  విరామ చిహ్నముతో చెప్పినది:- యజ మానులైన , దాసులైనఁ గలుగు ముక్తి
  (ముక్తి అన్నది భక్తి మీద ఆధారపడిఉంటుంది కాని యాజమానా, సేవకుడా అని కాదు అని భావము)

  విరామ చిహ్నమైన కామాను అక్షరములుగా మార్చిన:- యజమానులైన కామదాసులైనఁ గలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 28. జిగురు సత్యనారాయణ గారూ,
  ఇప్పుడు మీ పద్యం పూర్తిగా అర్థం మయింది. మీరు పూరణతో పాటు ఆ కామా(,) చిహ్నాన్ని గురించి ప్రస్తావిస్తే బాగుండేది.
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి


 29. కె.ఈశ్వరప్ప గారి పూరణ పరుల మేలు గోర పరమాప్తుడ oదురు కరుణ కలుగు వాడె వర సుతుండు
  తల్లి తండ్రి గురువు తత్వమ్ము నెరిగెడి కామ దాసు డైన కలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 30. చక్కగ పదములను సంక్షిప్తపరచుచు
  బాలకుండొకండు పలికె నిటుల
  కా.మ. యనగ వచ్చు కాళీయ మర్దనుని
  కా.మ.దాసులైనఁ గలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 31. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మర్దనుని’ అన్నప్పుడు గణదోషం. ‘మర్దనున్’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 32. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
  కవిమిత్రులు శ్రీపతి శాస్త్రి గారికి, సహదేవుడుగారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 33. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు

  కామితమ్ముఁ దీర్పఁ గష్టాలఁ బడవలెఁ
  జేయఁ దగని పనులు సేయవలయుఁ
  గాన, లోకమందుఁ గడు ముదమున "దగ్ధ
  కామ" దాసులైనఁ గలుగు ముక్తి!

  రిప్లయితొలగించండి 34. చిత్తమందు హరిని స్థిరముగా నిల్పుచు
  రాగముక్తు లై విరాగు లగుచు
  తుదకు మోక్షమొసగు త్రోవలో నడిచిన
  కామదాసులైన కలుగు ముక్తి.

  రిప్లయితొలగించండి 35. చిత్తమందు హరిని స్థిరముగా నిల్పుచు
  రాగముక్తు లై విరాగు లగుచు
  తుదకు మోక్షమొసగు త్రోవలో నడిచిన
  కామదాసులైన కలుగు ముక్తి.

  రిప్లయితొలగించండి
 36. మధుర భక్తి నెంచి పదముల పాడుచు
  తానె రాధ యగుచు తల్ల డిల్ల
  కలుగ లేద? నీలఘనశ్యాము కౌగిలి
  కామ దాసు లైనఁ గలుగు ముక్తి

  రిప్లయితొలగించండి
 37. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కమనీయం గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మాజేటి సుమలత గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఘనశ్యాము’ అన్నప్పుడు గణదోషం. ‘ఘనవర్ణు’ అనండి.

  రిప్లయితొలగించండి
 38. సవరించినందుకు ధన్యవాదములు మాస్టారు గారు.

  రిప్లయితొలగించండి