31, ఆగస్టు 2014, ఆదివారం

పద్యరచన - 663 (వేమన పద్యములు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“వేమన పద్యములు”

13 కామెంట్‌లు:

 1. సరళమగుతెలుగున చక్కగ వేమన
  పద్యరచనచేసె పాటవముగ
  నీతి వాక్యములను నేర్పుగ కూర్చెను
  యాటవెలదిలోన ధీటుగాను

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  వేమన పద్యములు :

  01)
  ______________________________

  వినిన వేమన పద్యముల్ - విద్య గలుగు
  వినిన వేమన పద్యముల్ - వెతలు దొలగు
  వినిన వేమన పద్యముల్ - విధియె మారు !
  వినుము వేమన పద్యముల్ - విని తరించు !
  ______________________________
  విద్య = ఙ్ఞానము

  రిప్లయితొలగించండి
 3. వేమన పదములును సామెతలై వెల్గె
  పల్లె జనుల నోటి పలుకు తోడ
  వేన వేల యేండ్లు వెలుగుచు నుండును
  నిత్య జీవితమున సత్యములుగ

  రిప్లయితొలగించండి
 4. కం పొందుగ పదములు గూర్చియు
  సుందర భావంబు జెప్పి సొగసుల తోడన్,
  అందరి కందెడు పదపలు
  కందమ్మున వేమన కవి కైతలు చెప్పెన్ ,
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు
  గురువు గారికి నమస్కారములు ఈ పద్యం 13/11/05 న సప్తగిరి దూరదర్శన్ లో సమస్యా పూరణ
  కార్య క్రమం లో ప్రసారమైంది

  రిప్లయితొలగించండి
 5. అలతి యలతి పదములతో
  నలరించుచు నీతి దెలిపె నాటవెలదినన్
  లలితంబగు భావములను
  పలికించెను వేమన కవి పద్యము లందున్

  రిప్లయితొలగించండి
 6. మాస్టరు గారూ ! 2013 మార్చి 4 న ఇచ్చిన ఈ అంశమునకే నేను వ్రాసిన పద్యములు...( అనుకోకుండా ఈ రోజు వరుసలో నా బ్లాగులో కూడా ఈ పద్యములే పెట్టినాను )

  కందము:
  వేమన వెలదిని వదలెను
  వేమన తానాట వెలది వినుమని వ్రాసెన్
  వేమన పద్యము లనగ ని
  వే 'మన' పద్యములనట్లు వేడుక గలుగున్

  కందము:
  వ్రాసెను వేమన ముందట
  పోసెను ఘన పద్య రాశి పుణ్యము మనదే
  వాసిగ తెనుగున, చదువగ
  జేసిన పిల్లలకు శుభము చేకురు గదరా !

  రిప్లయితొలగించండి
 7. రచన గావించె వేమన రమ్యముగను
  తనదు పేరన మకుటంబు దనరు నట్లు
  పద్దెముల శత మవియన్ని యర్ధ మగుచు
  పిల్ల వానికి కూడను బ్రీతి గలుగు

  రిప్లయితొలగించండి
 8. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘కూర్చెను + అటవెలది’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘కూర్చినా/ డాటవెలది...’ అనండి.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  కొరుప్రోలు రాధాకృష్ణరావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘పదపలు’....?
  *
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘ఆటవెలదిన్’ అనవలసింది. అక్కడ ‘ఆటవెలదిలో’ అంటే సరిపోతుంది.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మతిమరుపు ఎక్కువౌతున్నది. గతంలో ఇచ్చిన విషయం మీరు చెప్పేదాక తెలియలేదు. పద్యరచనకు ఏ అంశం ఇవ్వాలా అని ఆలోచిస్తుంటే బీరువాలో ‘వేమన పద్యరత్నములు’ పుస్తకం కనిపించింది. అదే ఇచ్చాను. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. రాధాకృష్ణ రావు గారూ,
  చివరిపాదం ‘కందమున’ అని ప్రారంభమైనదనుకున్నాను. మీ పద విభాగం బాగుంది.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. తేట తెనుఁగు లోన ఆట వెలదు లల్లి
  నీతి జెప్ప మనకు నిజముఁ బలికి
  వినుతి కెక్కె మిగుల వేమన యోగియై
  సులువు సామెతలవె తెలుగు నోట

  రిప్లయితొలగించండి
 11. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. శ్రీగురుభ్యోనమ:

  నీతుల నెన్నో జెప్పెను
  జాతికి, మూఢత్వముడుగ జంకులు లేక
  న్నేతరమందున నైనను
  ప్రాత:స్మరణీయమైన పద్యము వేమా!

  రిప్లయితొలగించండి