25, ఆగస్టు 2014, సోమవారం

పద్యరచన - 657 (నానృషిః ...)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
‘నానృషిః కురుతే కావ్యమ్’

24 కామెంట్‌లు:

  1. కృషి గలిగిననెవరైనను
    ఋషికాగలరిలను, గొప్ప ఋషియౌ వాడే
    ధిషణగలిగి గ్రంధంబులఁ
    విషయ పరిజ్ఞానములను విశదము చేయున్

    రిప్లయితొలగించండి
  2. కవనమ్ము సాహిత్య సవనమ్ము నిష్ఠతో
    ********** మించు శ్రద్ధను నిర్వహించవలయు ;
    కవనమ్ము శారదా భవనమ్ము సర్వదా
    ********** స్థిర భక్తితో ప్రవేశించవలయు ;
    కవనమ్ము భవ్య నాక వనమ్ము ప్రేమతోఁ
    ********** దిలకించి పులకించి తీరవలయు ;
    కవనమ్ము ధార్మిక ప్రవణమ్ము తలవంచి
    ********** చెలఁగి సంతతము పూజించవలయు ;

    కవనమన వేదమే వేరుకాదు నిజము !
    కవనమనఁగ నోంకారమే కనఁగ నిజము !
    కవనమే పరా దేవత కాన భువిని
    నా నృషిః కురుతే కావ్యమౌ నిజమ్ము !!!

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    డా. విష్ణునందన్ గారూ,
    మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. తపముగ జీవనమ్ము, మది దల్చిన భావన సత్యమైనచో
    కృప నొక యింతయేని తన కృష్ణుడు చూపుట నిత్యమైనచో
    యుపమలు పెక్కులౌచు తగనొప్పుగ వ్రాయుట తథ్యమే సుమా!
    చపలత వీడి యొక్క ఋషి సామ్యము పొందుటగత్యమౌనుగా!

    రిప్లయితొలగించండి

  5. కావ్యము వ్రాయగ జాలున
    శ్రావ్యంబుగ ఛందమందు సత్కృతి నిడునా
    సవ్యంబుగ ఋషిగాకను
    సువ్యాపకమందలేరు చూడగ భువిలో.

    రిప్లయితొలగించండి
  6. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘నిత్యమైనచో/ నుపమలు...’ అనండి. ‘పొందుట + అగత్య’మన్నప్పుడు సంధి లేదు. ‘పొంద నగత్య’ మనండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. ఎంత చదువునుజదివిననెంతయైన
    చేయరాదుగకావ్యముజేవగలుగ
    ఋషిది యంశములేనిచోనెవరికైన
    నానృషి;కురుతేకావ్యమౌ నిజము

    రిప్లయితొలగించండి
  8. ప్రాగ్దిక్కందున భానుమూర్తి పగిదిన్ ప్రాద్భూత త్రైయాత్మకుల్
    వాగ్ధారల్ గురిపించి సత్య తపులై వాంగ్మానసద్రష్టలై
    వాగ్దేవీ వర సిద్దులై విహిత సర్వార్ధాత్మ తత్వజ్ఞులై
    దగ్ధక్రోధ ఋషుల్ సుకావ్య జనకుల్ ధాత్రిన్ కవీంద్రోత్తముల్

    రిప్లయితొలగించండి
  9. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
    ఎంత చక్కని పద్యాన్ని వ్రాశారు. చాలా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. శంకరయ్య గారూ ! ధన్యవాదాలు . శ్రీ షీనా గారి పద్యములో వాక్యం అసంపూర్ణంగా ముగిసిందనిపిస్తోంది . మరియు ' ప్రాద్భూత ' పదార్థానికి సంబంధించి వివరణ అవసరమై ఉంది .

    రిప్లయితొలగించండి
  11. కృషితో పదునై ధృతి శే
    ముషి యుగఋత సారమెల్ల పూనికయైనన్
    ఋషి యుదయించును, బ్రహ్మమ
    హిషి దాగునె? సుళువుగాదు! హీరము విరళం

    రిప్లయితొలగించండి
  12. భారత రామాయణములఁ
    దీరిచి నట్టి ఋషివరుల తేజము జూడన్
    దీరవె యనుమానమ్ముల్
    కారణ జన్ములకె చెల్లు కావ్యము వ్రాయన్!

    రిప్లయితొలగించండి
  13. శీనా శ్రీనివాస్ గారూ,
    డా. విష్ణునందన్ గారి వ్యాఖ్యను చూశారు కదా? మీ సమాధానం?
    *
    ముత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    విరళం అని వ్యావహారిక పదాన్ని ప్రయోగించారు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. ఆర్యా! నా పద్యం లో వాక్యం అసంపూర్తిగా వుందని నాకూ అనిపించింది.గుర్తు చేసి సరిదిద్దుకునే అవకాశం గల్పించిన విష్ణునందన్ గారికి ధన్యవాదములు.గురువర్యులు శంకరయ్య గారికి నమస్సులు. ప్రాద్భూత పదార్ధం అంటే తప్పేనేమో! నేను యెక్కడొ యెవరో వుపయోగించిన పదాన్ని పుట్టిన లేదా వుద్భవమైన అనే అర్ధం లో వాడినాను. తప్పైతే క్షమించండి. నా శార్దూల పద్యాన్ని కొంత సవరించి మీ సముఖం లో వుంచుతున్నను. పద్య విద్య లో తప్పటడుగులు వేస్తున్నవాడిని. సరిదిద్దుకోవటానికి సదా సంసిద్దుడనై సవినయంగా మీ శీనా


    ప్రాగ్దిగ్భాసిత పద్మబంధు పగిదిన్ ప్రజ్ఞాత్రిమూర్త్యాత్మకృద్
    వాగ్ధారా ఝరితోద్భవంబులిల కావ్యంబుల్; ఋషీంద్రోత్తముల్
    వాగ్దేవీ వరసిద్దులౌ సుచరితుల్ వాంగ్మానస ద్రష్టలౌ
    దగ్ధ క్రోధులె, కావ్యసృష్టికి దగున్ ధాత్రిన్ కవుల్ వారలే

    రిప్లయితొలగించండి
  15. గురువుగారు, సవరణలతో...

    తపముగ జీవనమ్ము, మది దల్చిన భావన సత్యమైనచో
    కృప నొక యింతయేని తన కృష్ణుడు చూపుట నిత్యమైనచో
    నుపమలు పెక్కులౌచు తగనొప్పుగ వ్రాయుట తథ్యమే సుమా!
    చపలత వీడి గొప్ప ఋషి సత్తముడౌటను సందియమ్మొకో?

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శీనా గారూ మీ ధారా శుద్ధి ప్రశంసనీయమైనదే కానీ దీర్ఘ సమాస సంఘటనం చేయాలనే ఆత్రంలో కొన్ని దోషాలు దొర్లుతున్నాయి. పద్మబంధువు పగిది అనవలసి ఉంటుంది . " ప్రజ్ఞాత్రిమూర్త్యాత్మకృద్వాగ్ధారా ఝరితోద్భవంబు " అంటే అర్థం తెలియడం లేదు ,' ఝరిత ' అనే పదాన్ని ఎక్కడ నుండి సంగ్రహించారు ? వాఙ్మానస ద్రష్టలు అంటే కూడా అంతే వాక్కు చేత , మానసము చేత చూచేవారు అని.. ఋషులకు ఎలా అన్వయిస్తుందా అని ? నిరాశ పడకుండా మీ కృషినిలాగే ఇంకా కొనసాగించి పద్య విద్యలో ఉన్నత స్థాయికి చేరుకోగలరని ఆకాంక్ష !

    రిప్లయితొలగించండి
  17. ప్రాగ్దిగ్భాసిత పద్మబంధువు వలెన్ ప్రజ్ఞాత్రిమూర్త్యాత్మకృద్
    వాగ్ధారా ఝరులేను దివ్యమగు కావ్యంబుల్; ఋషీంద్రోత్తముల్
    వాగ్దేవీ వరసిద్దులౌ సుచరితుల్ వాచస్పతుల్ ద్రష్టలౌ
    దగ్ధ క్రోధులె, కావ్యసృష్టికి దగున్ ధాత్రిన్ కవుల్ వారలే

    రిప్లయితొలగించండి
  18. మరొక్క పద్యము

    ఘనులై, చీకటిదారులన్ వెలుగు సాకారమ్ముఁ జేయంగ స
    న్మణులై, లోకపు ప్రాణులన్ తగ నసామాన్యంబు కారుణ్యమున్
    గనుచున్, ప్రాకట సత్కవిత్వముల శ్రీకారంబుగా బోధలం
    దొనరింపంగ జనించుచుంద్రు ఋషులై, యొక్కొక్క చోనీ ధరన్.

    రిప్లయితొలగించండి
  19. చాలా కాలానికి విష్ణునందనుల మనోజ్ఞమైన పద్యం కనపడింది.

    రిప్లయితొలగించండి
  20. లక్ష్మీదేవి గారూ,
    మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
    పద్యం చివర ‘ఒక్కొక్కచోటన్ కవుల్’ అంటే ఎలా ఉంటుందంటారు?
    *
    మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. యంబ నాల్కపై నాట్యమాడంగ భార
    తేతిహాసపురాణ భూతి గ్రహించి
    చరిత విరచింప తరమౌనె యల్పులకును
    నా నృషిః కురుతే కావ్యమౌ నిజమ్ము

    రిప్లయితొలగించండి
  22. శ్రీగురుభ్యోనమ:

    స్థిరమై నిలచును జగమున
    వరమై దీవించు ప్రజల వాకిట లోనన్
    రవివలె వెలుగును కావ్యము
    మురిపించును మునులు వ్రాయ మూలములగుచున్

    రిప్లయితొలగించండి
  23. మిస్సన్న గారూ ! బహుధా ధన్యవాదాలు . మీ పద్యం లో చివర "పట్టకన్" బదులుగా వేరే పదాన్ని ప్రతిక్షేపించగలరు . పట్టక అనే పదం కళ , ద్రుతం కాదు కదా !

    రిప్లయితొలగించండి
  24. విష్ణునందనులకు ధన్యవాదాలతో సవరించిన పద్యం:

    కావ్యము వ్రాయగా నగునె కాలపరీక్షకు నిల్చు రీతిగా
    భవ్య మహర్షి సత్తముల భాతి శమమ్ము దమమ్ము నిష్ఠయున్
    దివ్య వినిగ్రహమ్ముల సుధీవిభవ మ్మొనగూడ కున్నచో
    సవ్యముగా రహించు టది సాధ్యమె స్వార్థపు ద్రోవ బట్టదే?

    రిప్లయితొలగించండి