అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * శ్రీఆదిభట్ల కామేశ్వర రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మూడు కొప్పుల సామెతను చక్కగా వినియోగించుకొని మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు. మూడవ పాదాన్ని ‘ముప్పెవ్వరికో యపు డట మూడె నటంచున్’ అనండి.
ముగురు లంబాడి వనితలు ముదముతోడ
రిప్లయితొలగించండిచక్కనగు వేషములతోడ సంత కేగ
వేచి యుండిరి గృహమున విభ్రమముగ
పతుల రాకను గోరుచు పయనమునకు
ముగ్గురమ్మలు కూర్చుండి మురిపెముగను
రిప్లయితొలగించండిముచ్చట ల నాడుచున్నట్లు మోములుండె
నెంత తీరుబడిగ నుండి రింతు లచట
పనులు లేవేమొ వారికి బాల !యడుగు
అచ్చపు పల్లెటూరి సతు లౌగద వీరల తీరు చూడగా
రిప్లయితొలగించండిముచ్చట లాడుచుండి రిట మువ్వురు కాంతలు తీరుబాటుగా
నెచ్చటి కేగిరో పతులు నెచ్చటి కేమిలె కొల్వుకే యగున్
వచ్చెడుదాక వారు పనిపాటుల జేసుక నూసుబోకకై.
పతులను పాటుకంపి తమపాపల నాటలకంపి చాల సం
రిప్లయితొలగించండిగతులను కూడగట్టుకొని గమ్మున గుమ్మమునందుగూడి శ్రీ
మతులట ముచ్చటన్మునిగి మైమరపొందెడు తీరుగాంచుడీ
యతివల నాడకూతురుల నత్తల చాటున అమ్మలక్కలన్
గుమ్మంబందున పుత్తడి
రిప్లయితొలగించండిబొమ్మల బోలిన పడతులు ముచ్చట లాడెన్
ముమ్మరముగా నిరుగు పొరు
గమ్మల నా ముద్దు గుమ్మ లాడిక చేసెన్
విచ్చిన మోముల తోడన్
రిప్లయితొలగించండినచ్చముగా పల్లెటూరి నాహార్యముతో
నచ్చికబుచ్చిక లాడుచు
ముచ్చటగా కూర్చుండి రచట మువ్వురు భామల్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
శ్రీఆదిభట్ల కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ముచ్చటగా’ అన్నప్పుడు గణదోషం. ‘ముచ్చటఁ గూర్చుండి...’ అనండి.
కొప్పులు మూడే కలిసెను
రిప్లయితొలగించండిముప్పెవ్వరికోను వార్కి మూడేననుచున్
చెప్పుదురమ్మా విన మీ
కొప్పును మరి పరుల ఘోష కోరక నుంటన్. .
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమూడు కొప్పుల సామెతను చక్కగా వినియోగించుకొని మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
మూడవ పాదాన్ని ‘ముప్పెవ్వరికో యపు డట మూడె నటంచున్’ అనండి.
అమాయక లంబాడీ వనితలు పట్నవాసమేగిన తమ పతుల గూర్చి సంశయాత్మకంగా....
రిప్లయితొలగించండిపట్నవాస మేగి బంగాకు త్రాగునో?
పేక ముక్క లాడ పైక మిడునొ?
మధువు త్రాగ నేర్చి మనువునే మరచునో
మగని చిత్త మెటులొ? వగపు గూర్చు!
అన్యదేశ వస్త్రమంటరానిదనిరి
రిప్లయితొలగించండిభారతీయులొక్కపట్టుబట్టి;
యన్యదేశ వస్త్రమందమనుచు నేడు
విడిచిరయ్యొ తమదు పెమ్మి ఘనత.
పెమ్మి= ప్రసిద్ధి