7, ఆగస్టు 2014, గురువారం

సమస్యా పూరణం – 1497 (కాట్రేనికి గుహుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
కాట్రేనికి గుహుఁడు మరియు గణపతి తమ్ముల్.
(ఒకానొక అవధానంలో గరికిపాటివారు పూరించిన సమస్య)

25 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    కైలాసమున కేగి శివపార్వతులను దర్శించి నమస్కరించిన
    కుబేరుడు విఘ్నేశ్వరుడు మరియు విఘ్నేశ్వరుని తమ్ములు :

    01)

    _________________________

    కాట్రేనిని దర్శించగ
    కాట్రేని యిరవునకు జని - కౌడీ లిడిరే
    కాట్రేని రాణికిని మరి
    కాట్రేనికి గుహుఁడు మరియు - గణపతి,తమ్ముల్ !
    _________________________
    కాట్రేడు = శివుడు
    ఇరవు = ఇల్లు
    కౌడీలు = నమస్కారములు
    గుహుడు = కుబేరుడు
    గణపతి = విఘ్నేశ్వరుడు
    గణపతి తమ్ముల్ = కుమారస్వామి, వీరభద్రుడు మొదలగువారు

    రిప్లయితొలగించండి
  2. కాట్రేని జాతరనుగని
    కాట్రేని గుడికి తరలిరి కానుక లీయన్
    కాట్రేని పల్లిలోగల
    కాట్రేనికి, గుహుడు మరియు గణపతి తమ్ముల్

    రిప్లయితొలగించండి
  3. కుట్రపు యజ్ఞవినాశకుఁ
    పుట్రింతుడు వీరభద్రుఁ పుట్టుకతోనే
    పట్రఁ విశేష సుపుత్రుడు
    కాట్రేనికి, గుహుఁడు మరియు గణపతి తమ్ముల్.

    పుట్రింత=ప్రేరేపకుడు
    పట్ర=కిరాత

    రిప్లయితొలగించండి

  4. ఏట్రా ! పుత్రులు గదరా
    కాట్రేనికి గుహుఁడు మరియు గణపతి, తమ్ముల్
    కాట్రేనికి లేరు గదర
    కాట్రేడనగా శివుండు గదరా తెలియన్ !



    రిప్లయితొలగించండి

  5. ఏట్రా సుతులే జూడగ
    కాట్రేనికి గుహుఁడు మరియు గణపతి, సుతుడౌ
    పట్రాని కోపి భద్రుడు
    కాట్రేనికి, గుహుఁడు మరియు గణపతి తమ్ముల్



    రిప్లయితొలగించండి
  6. గురువుగారికి పాదాభివందనములు.

    ఎట్రా! మన సంసారపు
    చట్రములో మరచితేమొ సర్వేశుడినే
    మిట్రా! యాత్మ విధంబున
    కాట్రెనికి గుహుఁడు మరియు గణపతి దమ్ముల్.

    ఆత్మప్రకారము అందరు ఒక్కటే. అన్నలు తమ్ములే కాదా !

    రిప్లయితొలగించండి
  7. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    పేట్రేగి వరము లిచ్చిన
    కాట్రేనికి,గుహుడు మరియు గణపతి, తమ్ముల్
    బేట్రాయి సామి, తెలిపిరి
    కాట్రేడా!దనుజు వలన కలుగును కీడుల్

    రిప్లయితొలగించండి
  9. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. "కాట్రేనికోన" జూచితి
    పట్రాయుని గానఝరి కపర్దికి పూజల్;
    పట్రాయుని వలెనే యా
    కాట్రేనికి,గుహుఁడు,మరియు గణపతి,తమ్ముల్.

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు విషాదవార్త. మన గురుదేవులు, ఆప్తులు, మార్గదర్శకులు పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారు ఉ. 8 గం.లకు విశాఖలో శివైక్యం చెందారని వారి మనుమడు రాంభట్ల పార్వతీశ్వర శర్మ ఇంతకుముందే తెలియజేశారు.
    నేమాని వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చుగాక!

    రిప్లయితొలగించండి
  13. అయ్యో ! ఎంతపని జరిగింది !
    వారు స్వస్థులై వచ్చి మనకందరికీ మార్గదర్శకత్వం వహిస్తారనుకున్నామే !
    నేమానివారి ఆత్మకు శాంతి చేకూరు గాక !

    రిప్లయితొలగించండి
  14. నేమాని పండితార్యులు
    భూమిని విడి వాడిపోని పూవై సీతా
    రాముల పదముల వ్రాలగ
    నేమో దివికేగి నారు యీ దిన మయ్యో ..........

    రిప్లయితొలగించండి
  15. ఆమని ఛందోవనమున
    రాముని సద్భక్తివెలయ రసకవి పదవిన్
    సామ నిగమముల జేరిన
    నేమాని వినీతగుణము నీకాశముగా

    రిప్లయితొలగించండి
  16. అయ్యో, ఎంతటి విషాదవార్త వినవలసి వచ్చినది!
    మనకందరకూ మార్గదర్శనం చేస్తూ విశేష సందర్భాలలో భక్తి నిండిన సుందర పద్యావళులను వెలయిస్తూ ఉండే వారు. వారి కీర్తి నిలిచి యుండుగాక.

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమానీ వా
    రుండును మన మనసులందు నున్నతులై యీ
    గుండెలు బరువెక్కెను మన
    కండగ సలహాలనిచ్చు కవివరు గొరతన్

    రిప్లయితొలగించండి
  18. పేట్రేగి గణాధిపు డవ
    కాట్రేనికి,గుహుడు,మరియు,గణపతి తమ్ముల్
    చాట్రాతినుండ,కోరగ
    కాట్రాయడు తెల్పె జగతి నంతను చుట్టన్

    చాట్ర్రాయిని కైలాసము
    కాట్రేనికి గుహుడు,మరియు గణపతి తమ్ముల్
    కాట్రేని గణములన్నియు
    పేట్రేగిన నాట్యమునకు వేడుక నిడరే!

    రిప్లయితొలగించండి
  19. వరుసలు తెలియని పాశ్చ్యాత్యు ని ఉద్దేశించి :
    ఏట్రా యప్రాచ్యుండా!
    కాట్రేనికి గుహుఁడు మరియు గణపతి తమ్ము
    ళ్ళేట్రా? వరసల మార్చుచు
    పేట్రేగకు దేవతలకు పెలుచన కలుగున్

    రిప్లయితొలగించండి
  20. నే మాని యొరుల కిచ్చుట
    యేమాకున్నట్టి చిత్తవృత్తిగ తెలిపే
    నేమాని రామజోగికి
    నేమిత్తును దాచుకొందు హృదయమునందున్!!

    అష్టావధాని "పండిత" శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు గారు ఉ:8 గం లకు విశాఖలో శివైక్యం చెందారు

    రిప్లయితొలగించండి
  21. పూజ్యులు గురుమూర్తులు పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారి యాకస్మిక మరణమునకు విస్మిత వదనుండనై, దుఃఖిత మనస్కుఁడనై , కడసారి వారి పాదపద్మ సంపూజనమునకై యర్పించుకొను పద్యకుసుమము...

    సీ.
    శంకరాభరణ సత్సాహితీ కవిగణ
    స్ఖాలిత్య సవరణఁ జేసినావు;
    స్వయముగా నెన్నియో సత్పూరణమ్ములఁ
    జేసి, కీర్తినిఁ బ్రతిష్ఠించినావు;
    తపసివై యష్టావధానమ్ములనుఁ జేసి,
    తెలుఁగు కవుల లోటుఁ దీర్చినావు;
    రమణమై యధ్యాత్మ రామాయణమ్మునుఁ
    దెలుఁగు భాషనుఁ దీర్చిదిద్దినావు;
    తే.గీ.
    ఇట్టి వైశిష్ట్య గురుమూర్తి వీవు మమ్ము
    నేఁడు విడనాడి, కైవల్య నిధినిఁ గోరి,
    స్వర్గమేగిన నేమాని పండితార్య!
    మృడుఁడు మీ యాత్మకిల శాంతి నిడునుఁ గాత!

    --oO: "స్వస్తి" :Oo--

    రిప్లయితొలగించండి
  22. శ్రీ నేమాని గురువర్యులకు ఆత్మశాంతి కలుగు గాక. వారు ఆకస్మికముగా స్వర్గస్థులైన విషయము ఎంతో కలచి వేసినది

    నేమాని వారి రోగ
    మ్మేమాని తిరిగియె రాగ మదిదలచితిమే
    రామా ! నీ సన్నిధికే
    ప్రేమారగ రచన జేయ పిలచితివా ! హా !

    రిప్లయితొలగించండి
  23. పూజ్య గురుదేవులు పండిత నేమాని వారి అత్మకు భగవంతుడు శాంతి చేకుర్చు గాక

    రిప్లయితొలగించండి
  24. అందరి పద్యములను సమీక్షించి ప్రోత్సహించే పండిత నేమానిగారు ఇక లేరు అనే వార్త బాధాకరమే!
    వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ ఈశ్వరున్ని వేడుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి