1, డిసెంబర్ 2011, గురువారం

చమత్కార పద్యాలు - 136

                                ఖడ్గబంధం

కం.
మురహర! మురళీధర! శుభ
చరణా! మధువైరి! శౌరి! జలరుహనయనా!
హరి! గరుడవాహనా! శ్రీ
ధర! కరుణాత్మా! ముకుంద! దానవదమనా!

5 కామెంట్‌లు:

  1. " ఖడ్గ బంధం " ఎంత బాగుందో ? నేను ఎప్పుడో పారిజాతాపహరణం పుస్తకంలో చూసాను. మళ్ళీ ఇప్పుడు మీ బ్లాగుల్లో [ చింతా వారి ఆంద్రామృతం లొ ] చూస్తున్నాను అవునూ ! ఖడ్గ బంధం , చురికా బంధం అంటే రెండు ఒకటే కదా ? ఏమో ? తెలియదు " మీపండితులందరు ఇలా వ్రాయ గా వ్రాయగా కొన్నాళ్ళకి నాలాంటి వారికి కుడా వస్తే ఎంత అదృష్టం ?
    చురిక = కత్తి "

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుందండి. ఎప్పుడో అప్పకవీయంలో చూసాను. వీలైతే ఓ నాగబంధం ప్రచురించగలరు.

    రిప్లయితొలగించండి
  3. శంకరు నాభరణ మునే
    నంకం బుగ జేసికొనిన శంకరు సామీ!
    బింకంబ గు మీ బంధము
    వంకల కిల తావు లేదు వందన మయ్యా !

    రిప్లయితొలగించండి
  4. అంటే ఖడ్గబంధం అనే దాని లక్షణం యిలా నిర్వచించ వచ్చును.
    * కంద పద్యం మాత్రమే
    * 1 వ పాదంలో 2,4,6 స్థానాల్లో ఒకే అక్షరం.
    * 2 వ,4వ పాదాలలో2వ అక్షరం ఒకటే. అలాగే చివరి అక్షరం కూడా ఒకటే.
    నాకీ బంధకవిత్వంమీద అవగాహన స్వల్పం. దయచేసి వివరించగలరు.
    పై నియమాలు సమగ్రం అయితే ఖడ్గబంధం నాకు మహాసులభం అనుకుంటాను.

    రిప్లయితొలగించండి