బ్రహ్మ చారికి నెన మండ్రు భార్య లౌర ! ------------ బ్రహ్మ పదమున కర్ధమ్ము బ్రాహ్మ ణుండు బ్రహ్మ నె రి గిన ఘనుడయ బ్రహ్మ చారి నియమ నిష్టల గరిమకు నియతు డైన బ్రహ్మ చారికి నెనమండ్రు భార్య లౌర !
పండిత నేమాని వారూ, ఏయే గుణాలవారికి గీతాసారాన్ని విషంగా భావిస్తారో చక్కగా చెప్పారు పూరణలో. అభినందనలు. ‘వాన్ కి’ ప్రయోగం ...? * సుబ్బారావు గారూ, చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. ఆక్కడ ప్రజ అన్నా సరిపోతుంది కదా! బలవంతాన వికృతిని ఎందుకు తీసుకువచ్చారు? ‘బ్రహ్మచారికి నెనమండ్రు ...’ పూరణలో అష్టనియామాలను బ్రహ్మచారికి భార్యల్ని చేసారా? బాగుంది. చక్కని పూరణ. అభినందనలు. * లక్కాకుల వెంకట రాజారావు గారూ, ‘ఔషధీయ విషగుళిక’ ... బాగుంది. విషమూ ఔషధంగా పనిచేస్తుందన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. ‘విశ్వవ్యాప్త’మన్నప్పుడు ‘శ్వ’గురువవుతుంది కదా! అక్కడ ‘విశ్వ/ మంతటై...’ అంటే ఎలా ఉంటుందంటారు? * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * వరప్రసాద్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘అందరికిని’ అనాలి కదా!
అయ్యా శంకరయ్య గారూ! లేఖినిలో ఒక చిక్కు ఉంది. వాంకి అనే టైపు అగుచున్నది - వాన్ కి (వానికి) అనే అర్థములో టైపు చెయ్య వలసి వస్తోంది. అందుచేత అది నా తప్పు కాదు. స్వస్తి.
వరప్రసాద్ గారూ, మీ సవరించిన పూరణ బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, లేఖినిలో ‘vaan ki’ అని టైప్ చేస్తే క్రింద తెలుగులో ‘వాన్ కి’ అని వస్తుంది కదా! మీరు మొత్తం విషయం టైప్ చేసాక తెలుగును కాపీ చేసేముందు ‘వాన్ కి’ లో కి ముందు కర్సర్ పెట్టి బ్యాక్ స్పేస్ ఇవ్వండి అప్పుడు ‘వాన్ కి’ అనేది ‘వాన్కి’ అవుతుంది.
విష గుళికయయ్యె గీతావివేక రసము. సమస్య బాగుంది. అయితే గీతానిషేధసంబంధమైన వివాదం రష్యాలో నడుస్తున్నందు వల్ల దాని ప్రభావంతో యీ సమస్య తయారు చేసినట్లు స్పష్టం. పూరణలు కూడా అదే ఆవేశాన్ని ప్రదర్శించాయి. ఓం. శాంతిః శాంతిః శాంతిః
విభిన్నమతాల (అభిప్రాయాల) మనుష్యుల మధ్య జగడం సహజం. కాని, ఉమ్మడి ప్రమాణం యేమీ లేక పోవటం వలన యిటువంటి తగవులు తెగేవి కావు. తీర్పు సాధారణంగా స్థానికంగా బలీయమైన అభిప్రాయాన్నే ప్రతిఫలిస్తుంది. ఏమీ చేయలేము. ఉక్రోషమో, కోపమో ,అసహ్యమో ప్రదర్శించటం వలన లాభం లేదు. భారత ప్రభుత్వం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నది - కాని ప్రయోజనం ఉండకపోవచ్చును. ఒకప్పుడు రష్యాలో యోగవిద్యను కూడా నిషేధించారు. తరువాత దాన్ని తొలగించినట్లు గుర్తు. గీతాప్రభావాన్ని అడ్డుకోవటానికి యత్నంచటం వలన అది మరింతగా జనులను ఆకర్షిస్తుంది కాని యేమీ ప్రమాదం లేదు.
నా పూరణ: తెలిసి తెలియని రీతి బోధించువారి శిష్యరికమున పదిమంది చెడుట జరిగె బాధ గురువుల చేతిలో పడుట వలన విష గుళికయయ్యె గీతావివేక రసము
నేన పోతన fonts install చేసాను. తక్కువ key strokesతో సులభంగా తెలుగులో వ్రాయవచ్చును. ఇవి శ్రీ తిరుమల దేశికాచారిగారు తయారు చేసి public domainలో ఉంచారు. వీటి ప్రాప్తి స్థానం: http://www.kavya-nandanam.com/Pothana2k.zip మీరు ఈ పై link ని click చేసి download చేసుకోవచ్చును. పోతన fonts ఉపయోగించి తెలుగులొ అన్నిరకాల అక్షరాలూ వ్రాయవచ్చును చిక్కులేకుండా. మీరు ఌ, ౡ,ౘ, ౙ లు కూడా ఒకే కీ తో తెలుగులో వ్రాయవచ్చును..
ఈ పోతన fonts ఉపయోగించి అన్నిరకాల applications లోనూ తెలుగులో వ్రాయవచ్చును.
పండిత నేమాని గారూ, అసలే మతి చెడింది. అందులోను మత్తులో ఉన్నాడు. పైగా దయ్యం పట్టింది. ఇంకేం? అలాంటివాడి మాటలు ఇలాగే ఉంటాయి. మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * తాడిగడప శ్యామల రావు గారూ, నిజమే! ఒక వస్తువు ఒకచోట పూజాస్థానంలో ఉంటే మరోచోట నీచంగా చూడబడుతుంది. పుస్తకాలు, మతవిశ్వాసాల మీద ఇది ఎక్కువ. గీత విషయంలో జరుగుతున్న వివాదం తెలిసి మనస్సు చివుక్కు మన్నది. ఎక్కడో ఎవరో ఏదో అన్నంతమాత్రాన గీతాప్రాముఖ్యానికి లోటేమీ జరుగదు. ధన్యవాదాలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. ఈకాలంలో ‘బాధగురువులే’ ఎక్కువ. ‘పోతన’ ఫాంట్స్ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మనమిత్రులకు అది సదుపాయంగా ఉంటుందని విశ్వసిస్తున్నాను. నేను ‘లేఖిని, బరహా’ ఉపయోగిస్తున్నాను.
ప్రవీణ్ శర్మ గారూ, ధన్యవాదాలు. * మంద పీతాంబర్ గారూ, మనోజ్ఞమైన పూరణ. అభినందనలు. ‘తెలియని + అజ్ఞానమతుల’ అన్నప్పుడు సంధి జరుగదు. యడాగమం వస్తుంది. ‘తెలియని జ్ఞానశూన్యు | కేల రుచియించు’ అంటే ? * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, తత్త్వగీతాల్లో తరచుగా వినిపించే శబ్దాలివి. బోధగురువులు, బాధగురువులు అని జనవ్యవహారంలో ఉన్నదే. ఏ నిఘంటువులోను ఈ శబ్దాలు దొరకవు.
భగవద్గీత ఆత్మహత్య చేసుకొందామనుకొన్న ఒక మనిషి ప్రాణాలను నిలబెట్టి, తరువాతి కాలములో ఆయనే పుంజుకొని, కర్మమార్గుడై, ఒక executive గా మారి ఎందరికో ప్రాణదాతగా మారిన కథ నాకు తెలుసు. దాని స్ఫూర్తితో, మాన వాళిఁ కర్మ మార్గుల జేసిన మంచి నేస్త మదియె, మహిమఁ గనుము సకల జన జిజీవిష గుళిక యయ్యె గీ తా వివేక రసము తరిచి చూడ!
ఆదిగురు, నిజగురు, జ్ఞానగురు మొదలైన సమాసాలు కూడా చలామణిలో ఉన్నాయి. ఇవి సాదువులే. అదే విధంగా బోధగురు సమాసం కూడా. బోధ, గురు శబ్దాలు రెండూ సంస్కృతపదాలే కాబట్టి సమాసం సరిగానే ఉందను కుంటున్నాను. అంతకన్నా నాకూ తెలయదు.
రాజేశ్వరి అక్కయ్యా, చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు. * చంద్రశేఖర్ గారూ, తేటగీతి సమస్యను ఆటవెలదిలో పూరించిన మీ నేర్పు ప్రశంసనీయం. చక్కని పూరణ. అభినందనలు. ‘జిజీవిష’ .... ? * శ్యామల రావు గారూ, ధన్యవాదాలు. * మిస్సన్న గారూ, చమత్కారభరితమైన మీ పూరణ అలరిస్తున్నది. ప్రశస్తమైన పూరణ. అభినందనలు. * ఊకదంపుడు గారూ, నిస్సందేహంగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
చూడ చెరకును మెచ్చదు శునక మెపుడు
రిప్లయితొలగించండిపంది మెచ్చదు పన్నీరు పైన బడిన
అన్నమరుగని రోగికి నట్లె సుధయు
విష గుళికయయ్యె గీతావివేక రసము.
అయ్యా శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
రిప్లయితొలగించండిమంచి భావముతో పూరించారు - అభినందనలు.
రష్యాలో భగవద్గీతను నిషేధించాలని కోర్టులో కేసు వేశారట!
రిప్లయితొలగించండిశాస్త్రసాంకేతికంబైన జ్ఞానభిక్ష
పొంది పాశ్చాత్యదేశముల్ పుణ్యభరత
భూమి బోధించు సద్ధర్మమును వలదన
విషగుళిక యయ్యె గీతావివేకరసము.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమాస్టారు గారూ ! చక్కని పూరణ.
దేవుడే లేడులేడను తెగులు వాన్ కి
రిప్లయితొలగించండికపట బుద్ధికి దోషపు గనుల వాన్ కి
నీతి లేని వికారపు జాతి వాన్ కి
విష గుళిక యయ్యె గీతా వివేక రసము
కన్ను లుండియు కనులార కనని పజకు
రిప్లయితొలగించండిచెవులు నుండియు వినలేని చెవిటి పజకు
కరము లుండియు పనులేమి కాని పజకు
విష గుళి క యయ్యె గీతా వివేక రసము.
-------
ప్రజ అను పదమునకు వి కృ తి పజ.
బ్రహ్మ చారికి నెన మండ్రు భార్య లౌర !
రిప్లయితొలగించండి------------
బ్రహ్మ పదమున కర్ధమ్ము బ్రాహ్మ ణుండు
బ్రహ్మ నె రి గిన ఘనుడయ బ్రహ్మ చారి
నియమ నిష్టల గరిమకు నియతు డైన
బ్రహ్మ చారికి నెనమండ్రు భార్య లౌర !
కృష్ణ భక్తి జగతి నిండి , గీత విశ్వ
రిప్లయితొలగించండివ్యాప్త మై తనరార గా వచ్చె నీర్ష్య
అరయ కుత్సి తాలు దొలగ నౌష దీయ
విష గుళిక యయ్యె(యగును)గీతా వివేక రసము
ప్రస్తుతానికి రష్యాలో జరుగుతున్న ఘటనల ఆధారంగా........
రిప్లయితొలగించండికృష్ణ పరమాత్మ జెప్పు కర్తృత్వబోధ,
పరమ తత్వార్థ సారమై పరగుభువిని,
అన్వయంబున లోపంబు నరయలేక,
విషగుళికయయ్యె గీతా వివేకరసము.
( విషగుళిక = మ్రింగసాధ్యము కానిది అనే అర్థములో )
మాస్టారు గారూ,ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమాన హీనులందరికిను మతులు జెడగ
విష గుళికయయ్యె గీతా వివేక రసము
కుక్క మూతి పిందెలు కారు కూతలు బలు
క పరమ పురుషుని బలుకు కంటగింపు
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిఏయే గుణాలవారికి గీతాసారాన్ని విషంగా భావిస్తారో చక్కగా చెప్పారు పూరణలో. అభినందనలు.
‘వాన్ కి’ ప్రయోగం ...?
*
సుబ్బారావు గారూ,
చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
ఆక్కడ ప్రజ అన్నా సరిపోతుంది కదా! బలవంతాన వికృతిని ఎందుకు తీసుకువచ్చారు?
‘బ్రహ్మచారికి నెనమండ్రు ...’ పూరణలో అష్టనియామాలను బ్రహ్మచారికి భార్యల్ని చేసారా? బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
‘ఔషధీయ విషగుళిక’ ... బాగుంది. విషమూ ఔషధంగా పనిచేస్తుందన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
‘విశ్వవ్యాప్త’మన్నప్పుడు ‘శ్వ’గురువవుతుంది కదా! అక్కడ ‘విశ్వ/ మంతటై...’ అంటే ఎలా ఉంటుందంటారు?
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘అందరికిని’ అనాలి కదా!
గురువు గారికి ధన్యవాదములు
రిప్లయితొలగించండిపరమ పురుషుని బలుకులు గరముగాను
కుక్క మూతి పిందెలు కారు కూతలు బర
దేశమందు ప్రామాణిక దిశను జూప
విష గుళికయయ్యె గీతా వివేక రసము
( దిశ = మార్గము )
అయ్యా శంకరయ్య గారూ!
రిప్లయితొలగించండిలేఖినిలో ఒక చిక్కు ఉంది. వాంకి అనే టైపు అగుచున్నది - వాన్ కి (వానికి) అనే అర్థములో టైపు చెయ్య వలసి వస్తోంది. అందుచేత అది నా తప్పు కాదు. స్వస్తి.
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ సవరించిన పూరణ బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
లేఖినిలో ‘vaan ki’ అని టైప్ చేస్తే క్రింద తెలుగులో ‘వాన్ కి’ అని వస్తుంది కదా! మీరు మొత్తం విషయం టైప్ చేసాక తెలుగును కాపీ చేసేముందు ‘వాన్ కి’ లో కి ముందు కర్సర్ పెట్టి బ్యాక్ స్పేస్ ఇవ్వండి అప్పుడు ‘వాన్ కి’ అనేది ‘వాన్కి’ అవుతుంది.
గురువు గారి సవరణలకు ధన్యవాదములు
రిప్లయితొలగించండిమతి చెడిన నాయకుండట మత్తులోన
రిప్లయితొలగించండినుండగా దయ్యమొక్కటి యూనె నతని
వాని తీర్పును వింటిరే బాగు బాగు
విష గుళిక యయ్యె గీతా వివేక రసము
విష గుళికయయ్యె గీతావివేక రసము. సమస్య బాగుంది. అయితే గీతానిషేధసంబంధమైన వివాదం రష్యాలో నడుస్తున్నందు వల్ల దాని ప్రభావంతో యీ సమస్య తయారు చేసినట్లు స్పష్టం. పూరణలు కూడా అదే ఆవేశాన్ని ప్రదర్శించాయి. ఓం. శాంతిః శాంతిః శాంతిః
రిప్లయితొలగించండివిభిన్నమతాల (అభిప్రాయాల) మనుష్యుల మధ్య జగడం సహజం. కాని, ఉమ్మడి ప్రమాణం యేమీ లేక పోవటం వలన యిటువంటి తగవులు తెగేవి కావు. తీర్పు సాధారణంగా స్థానికంగా బలీయమైన అభిప్రాయాన్నే ప్రతిఫలిస్తుంది. ఏమీ చేయలేము. ఉక్రోషమో, కోపమో ,అసహ్యమో ప్రదర్శించటం వలన లాభం లేదు. భారత ప్రభుత్వం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నది - కాని ప్రయోజనం ఉండకపోవచ్చును. ఒకప్పుడు రష్యాలో యోగవిద్యను కూడా నిషేధించారు. తరువాత దాన్ని తొలగించినట్లు గుర్తు. గీతాప్రభావాన్ని అడ్డుకోవటానికి యత్నంచటం వలన అది మరింతగా జనులను ఆకర్షిస్తుంది కాని యేమీ ప్రమాదం లేదు.
నా పూరణ:
తెలిసి తెలియని రీతి బోధించువారి
శిష్యరికమున పదిమంది చెడుట జరిగె
బాధ గురువుల చేతిలో పడుట వలన
విష గుళికయయ్యె గీతావివేక రసము
తెలుగులో వ్రాయటం గురించి.
రిప్లయితొలగించండినేన పోతన fonts install చేసాను. తక్కువ key strokesతో సులభంగా తెలుగులో వ్రాయవచ్చును. ఇవి శ్రీ తిరుమల దేశికాచారిగారు తయారు చేసి public domainలో ఉంచారు. వీటి ప్రాప్తి స్థానం:
http://www.kavya-nandanam.com/Pothana2k.zip
మీరు ఈ పై link ని click చేసి download చేసుకోవచ్చును.
పోతన fonts ఉపయోగించి తెలుగులొ అన్నిరకాల అక్షరాలూ వ్రాయవచ్చును చిక్కులేకుండా. మీరు ఌ, ౡ,ౘ, ౙ లు కూడా ఒకే కీ తో తెలుగులో వ్రాయవచ్చును..
ఈ పోతన fonts ఉపయోగించి అన్నిరకాల applications లోనూ తెలుగులో వ్రాయవచ్చును.
గమనిక: సదుపాయం గురించి వ్రాసాను అంతే
పండిత నేమాని గారూ,
రిప్లయితొలగించండిఅసలే మతి చెడింది. అందులోను మత్తులో ఉన్నాడు. పైగా దయ్యం పట్టింది. ఇంకేం? అలాంటివాడి మాటలు ఇలాగే ఉంటాయి. మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
తాడిగడప శ్యామల రావు గారూ,
నిజమే! ఒక వస్తువు ఒకచోట పూజాస్థానంలో ఉంటే మరోచోట నీచంగా చూడబడుతుంది. పుస్తకాలు, మతవిశ్వాసాల మీద ఇది ఎక్కువ. గీత విషయంలో జరుగుతున్న వివాదం తెలిసి మనస్సు చివుక్కు మన్నది. ఎక్కడో ఎవరో ఏదో అన్నంతమాత్రాన గీతాప్రాముఖ్యానికి లోటేమీ జరుగదు. ధన్యవాదాలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈకాలంలో ‘బాధగురువులే’ ఎక్కువ.
‘పోతన’ ఫాంట్స్ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మనమిత్రులకు అది సదుపాయంగా ఉంటుందని విశ్వసిస్తున్నాను. నేను ‘లేఖిని, బరహా’ ఉపయోగిస్తున్నాను.
మా మావయ్యగారు ‘లేఖిని, బరహాల లతో ఌ, ౡ,ౘ, ౙ లు సరిగా రావటంలేదన్నట్లు గుర్తు. నేనయితే పోతనతప్ప వేరేవి యెన్నడూ వాడలేదు.
రిప్లయితొలగించండిఅది లేఖిని, బరహా సమస్య కాదు. కంప్యూటర్‌లో ఇన్స్టాల్ చేసిన ఫాంట్ల సమస్య.
రిప్లయితొలగించండిఅమృత తుల్యమౌ జ్ఞానమ్ము నరయలేని
రిప్లయితొలగించండినాత్మ తత్వమ్ము దెలియ నజ్ఞాన మతుల
కేల రుచియించు నందగోపాలు రసము
విష గుళిక యయ్యె గీతా వివేక రసము!!!
గురువుగారూ,
రిప్లయితొలగించండి"బాధగురువు" అనే పదానికి నిఘంటు అర్థము వున్నదా?? ( బాధించే గురువని అర్థమా?? ) ఇది సాధువు కాదేమోనని నా అభిప్రాయము. గురువులు వివరించగా ప్రార్థన.
ప్రవీణ్ శర్మ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*
మంద పీతాంబర్ గారూ,
మనోజ్ఞమైన పూరణ. అభినందనలు.
‘తెలియని + అజ్ఞానమతుల’ అన్నప్పుడు సంధి జరుగదు. యడాగమం వస్తుంది. ‘తెలియని జ్ఞానశూన్యు | కేల రుచియించు’ అంటే ?
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తత్త్వగీతాల్లో తరచుగా వినిపించే శబ్దాలివి. బోధగురువులు, బాధగురువులు అని జనవ్యవహారంలో ఉన్నదే. ఏ నిఘంటువులోను ఈ శబ్దాలు దొరకవు.
వేదముల నుండి పొందియె విజ్నులనుచు
రిప్లయితొలగించండిఆధునిక మంచు శాస్త్రము నపహ రించి
పచ్చ కామెర్లు కలిగిన పిచ్చి దొరకు
విష గుళిక యయ్యె గీతా వివేక రసము.
భగవద్గీత ఆత్మహత్య చేసుకొందామనుకొన్న ఒక మనిషి ప్రాణాలను నిలబెట్టి, తరువాతి కాలములో ఆయనే పుంజుకొని, కర్మమార్గుడై, ఒక executive గా మారి ఎందరికో ప్రాణదాతగా మారిన కథ నాకు తెలుసు. దాని స్ఫూర్తితో,
రిప్లయితొలగించండిమాన వాళిఁ కర్మ మార్గుల జేసిన
మంచి నేస్త మదియె, మహిమఁ గనుము
సకల జన జిజీవిష గుళిక యయ్యె గీ
తా వివేక రసము తరిచి చూడ!
సందేహము తీర్చినందుకు ధన్యవాదములు గురువుగారూ.
రిప్లయితొలగించండిఆదిగురు, నిజగురు, జ్ఞానగురు మొదలైన సమాసాలు కూడా చలామణిలో ఉన్నాయి. ఇవి సాదువులే. అదే విధంగా బోధగురు సమాసం కూడా. బోధ, గురు శబ్దాలు రెండూ సంస్కృతపదాలే కాబట్టి సమాసం సరిగానే ఉందను కుంటున్నాను. అంతకన్నా నాకూ తెలయదు.
రిప్లయితొలగించండితెలుగు మందుల కొట్టులో తెలివి పెంచు
రిప్లయితొలగించండిలేహ్య మని చెప్ప కొంటిని లెమ్ము బిడ్డ
దాని మ్రింగె పరీక్షను తప్పె నయ్యొ
విష గుళిక యయ్యె గీతా ! వివేక రసము.
బంధు గణమును గని క్రుంగి పారనెంచ
రిప్లయితొలగించండిక్రీడిని నిలువరించిన కృష్ణబోధ
వానికి సుధగానై, కురువంశమునకు
విష గుళికయయ్యె గీతావివేకరసము!
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిచక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
తేటగీతి సమస్యను ఆటవెలదిలో పూరించిన మీ నేర్పు ప్రశంసనీయం. చక్కని పూరణ. అభినందనలు.
‘జిజీవిష’ .... ?
*
శ్యామల రావు గారూ,
ధన్యవాదాలు.
*
మిస్సన్న గారూ,
చమత్కారభరితమైన మీ పూరణ అలరిస్తున్నది. ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
*
ఊకదంపుడు గారూ,
నిస్సందేహంగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
నమస్కారములు
రిప్లయితొలగించండిధన్య వాదములు తమ్ముడూ !
విష గుళికయయ్యె గీతావివేక రసము.
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనం:
రిప్లయితొలగించండివిజ్ఞులైనట్టి వారికి వేదమౌను
పరవశించుచు పాడంగ ప్రాణ మగును
వఒచనలు జేయు గర్వాంధ వంచకులకు
విష గుళికయయ్యె గీతావివేక రసము
ధన్యవాదాలు, మాస్టారూ. జిజీవిష = జీవించవలెననెడి కోరిక. ఆ మాటే నాపూరణకు ఆయువుపట్టు.
రిప్లయితొలగించండి