8, డిసెంబర్ 2011, గురువారం

చమత్కార పద్యాలు - 141

                           ద్వ్యక్షరశ్లోకం

 కాలేకిలాలౌకికైక
కోల కాలాలకే లల |
కలికాకోలకల్లోలా
కులలోకాలి లాలికా
||

పదవిభాగం -
కాలేకిల, అలౌకిక, ఏక, కోల, కాల + అలకే, లల, కలి, కాకోల, కల్లోల, ఆకుల, లోక + ఆలి, లాలికా.


అన్వయం -
అలౌకిక, ఏక, కోల, కాల + అలకే, కలి, కాకోల, కల్లోల, ఆకుల, లోక + ఆలి, లాలికా, కాలేకిల, లల.


ప్రతిపదార్థాలు - 
అలౌకిక          = లోకవిలక్షణమైన
ఏక                 = ముఖ్యమైన
కోల               = ఆదివరాహం యొక్క
కాల + అలక = నల్లని ముంగురులు గల భార్యవైన ఓ లక్ష్మీ!
కలి               = కలికాలమనే
కాకోల          = విషం యొక్క
కల్లోల          = విజృంభణం చేత
ఆకుల          = బాధపడుతున్న
లోక + ఆలి   = ప్రజాసమూహాన్ని
లాలికా         = రక్షిస్తున్న (నీవు)
కాలేకిల       = అపాయసమయంలో మాత్రం
లల              = సాక్షాత్కరించి ప్రకాశించు. 


(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

4 కామెంట్‌లు:

  1. ఆర్యా ! "కలికాల కల్లోలాకుల లోకాలి లాలికా" యైన లక్షిని "క''ల" లో సాక్షాత్కరింప జేశారు.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగున్నాయి తమ్ముడు ! మీరందిస్తున్న " చమత్కార పద్యాలు " ఇప్పడి కైనా నేను ఇలాంటివి తెలుసు కొ గలుగు తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  3. గురువు గారికి నమస్కారములు.
    కాలాలక యైన లక్ష్మీ దేవి మిమ్ములను కాపాడు గాక

    రిప్లయితొలగించండి