11, డిసెంబర్ 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 144

                                  శబ్దచిత్రం

యావత్తోయధరా ధరా ధర ధరాధారాధర శ్రీధరా
యావచ్చారుచచారుచారుచమరం చామీకరం చామరమ్
|
యావద్రావణరామ రామరమణం రామాయణం శ్రూయతే
తావద్భో భువి భోగభోగ భువనం భోగాయ భూయాద్విభో
||


పదవిభాగం -
యావత్, తోయధరాః, ధరా, ధర, ధరా + ఆధార, అధర, శ్రీధరా, యావత్, చారు, చచా, రు, చారు, చమరం, చామీకరం, చ, అమరం, యావత్, రావణరామ, రామ, రమణం, రామాయణం, శ్రూయతే, తావత్, భో, భువి, భోగభోగ, భువనం, భోగాయ, భూయాత్, విభో.


అన్వయం -
తోయధరాః, ధరా, ధర, ధరా + ఆధార, అధర, శ్రీధరాః, యావత్, చ, చారు, చచా, రు, చారు, చమరం, అమరం, చామీకరం, యావత్, రావణరామ, రామ, రమణం, రామాయణం, భువి, యావత్, శ్రూయతే, తావత్, భోగభోగ, భో విభో, భువనం, భోగాయ, భూయాత్.

ప్రతిపదార్థాలు - 
తోయధరాః = సముద్రాలు
ధరా = భూమి
ధర = పర్వతాలు
ధరా + ఆధార = భూమికి ఆధారమైన
అధర = అధోలోకంలో ఉండే
శ్రీధరాః = విషధరుడైన ఆదిశేష సర్పం (లేదా లక్ష్మిని ధరించిన కూర్మం)
యావత్ = ఎప్పటివరకు (ఉంటాయో)
చ = మరియు
చారు = మనోజ్ఞమైన
చచా = ‘చచ’ అనే
రు = ధ్వనిని చేసే
చారు = అందమైన
చమరం = చమరమృగాలు కల
అమరం = దేవతలకు సంబంధించిన
చామీకరం = స్వర్ణనిలయమైన మేరుపర్వతం
యావత్ = ఎప్పటివరకు (ఉంటుందో)
రావణరామ = రామ రావణు లనే
రామ = జగత్తు నాకర్షించే
రమణం = నాయక, ప్రతినాయకులు కల
రామాయణం = రామాయణం
భువి = భూమిపైన
యావత్ = ఎప్పటివరకు
శ్రూయతే = వినిపిస్తుందో
తావత్ = అప్పటివరకు
భోగభోగ = భోగాలకు భోగభూతుడవైన
భో విభో = ఓ రాజా!
భువనం = భూమండలం
(తే) భోగాయ = నీ అనుభవం కోసం
భూయాత్ = అగును గాక! 


                (శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

4 కామెంట్‌లు:

  1. శంకరార్యా ! చక్కని పద్యం ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  2. " చమత్కార " అంటే , నిజంగానే చమత్కారం గా ఉన్నాయి. అక్షరాలు ఒకటి రెండు , అర్ధాలు , వేలకు వేలు . చాలా బాగున్నాయి .అభినందనలు తమ్ముడూ !

    రిప్లయితొలగించండి
  3. ఈ యావత్తోయధరా.. పద్యం శ్రీ హనుమద్రామాయణకావ్యం లోనిదని వినికిడి. ఈ పద్యాన్ని బహుకాలం క్రిందట చదవటం జరిగింది. ఇది రామాయణసారోధ్ధారము నందుటంకించబడినదని నాకు గుర్తు. దానిలో పాఠం కొంచెం వేరుగా నున్న దనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి