శ్రీ సుబ్బారావు గారి ఇడ్లీ పద్యము చదివేను. నేను విన్న దాని ప్రకారము ఇడ్లీ వాడుక మాటయే -- ఇడ్డెన అని గ్రాంధిక రూపము. ఇటువంటి పదమును ప్రాసలో ఇచ్చినపుడు, అన్య భాషా పదములను కూడా వేసుకొనవచ్చును, ఉదా: గాడ్లీ, సేడ్లీ.
నమస్కారం! ఆర్యా ! , నిన్ననే శ్రీరామరాజ్యం సినెమా చూసాను , అందులో ఒక గూఢచారి రామచంద్రుడికి నగరంలో జరిగిన విషయాలను చెబుతూ , త్రాగుబోతు తిప్పడు వేసిన నింద గురించి చెబుతాడు . . ఈ సందర్భంలో లక్ష్మణస్వామి ఈ విధంగా చెప్తారని ఊహ చేస్తూ పూరిస్తున్నాను ...
త్రాగుబోతుమాట ధర్మంబు కాబోదు సాధ్వి సీతకు నిల సాటి లేరు నిజము నెరుగకుండ నిందవేయగనెంచి పదుగు రాడు మాట పాడి గాదు
మరొక్క పూరణ , చిన్ని కృష్ణుడు వెన్న దొంగిలించాడు అని చెప్పటానికి వచ్చిన గోపికలను చూసి నల్లనయ్య ఉక్రోషంగా , ఏమి ఎరుగనివాడిలాగా , యశోదతో తన గురించి అమాయకంగా చెప్తున్న వైనం ...
నంద రాజ సుతుకు నవనీతముల్ లేవె? చోరుడే దలుప యశోదబిడ్డ ? మానధనుడను యవమానితుడన్ సేయ పదుగు రాడు మాట పాడి గాదు
సుబ్బారావు గారు నమస్కారములు. మీరు ఇడ్లీ లే గాక వడలు,పూరీలు పెసరట్టులు చట్నీ సాంబారులతో అందఱికీ విందు జేసారు. అవి శ్రీ పండిత నేమాని వారికి ఫర్వా లేదు గాని బరువు కొంచెము తగ్గుదామనుకొంటున్న మా బోటి వారలకు ....?
పదుగు రాడు మాట పాడియై ధర జెల్లు
రిప్లయితొలగించండినన్న మాట దెలిసి ననృత మైన
నిజము జేయ నెంచి నిర్ద్వంద్వముగ జేరి
పదుగు రాడు మాట పాడి గాదు
చిన్న సవరణ తో...
రిప్లయితొలగించండిపదుగు రాడు మాట పాడియై ధర జెల్లు
నన్న మాట దెలిసి యనృత ఘటన
నిజము జేయ నెంచి నిర్ద్వంద్వముగ జేరి
పదుగు రాడు మాట పాడి గాదు
పదుగురాడు మాట పాడిగాదనుటయే
రిప్లయితొలగించండియద్భుతమ్ము దాని నాచరించి
నంత ననుభవమ్ము నద్భుతమ్మే యగు
అద్భుతమున బుట్టు నద్భుతమ్ము
ధరను జెల్లునయ్య ! ధర్మ యుతము నైన
రిప్లయితొలగించండిపదుగు రాడు మాట, పాడి గాదు
ఒకని మాట వినుచు నొం డు రు ల్గ ల హింప
కలసి మెలసి యున్న కలదు సుఖము .
కాంత జూచి మౌని కన్ను గొట్టె
రిప్లయితొలగించండి------------
వనిత యొకతె మౌని వర్యుని సేవించ
కాంత జూచి మౌని కన్ను గొట్టె
దుష్ట బుద్ది కలిగి దుర్మార్గు డయ్యెను
మునుల నమ్మ రాదు మూఢ మతిని .
ఇడ్లీ లే చాలు మనకు నితరము లేలా ?
రిప్లయితొలగించండి------------------
ఇడ్లీ ,పూరీ,వడలును
ఇడ్లీ సాంబారు మరియు ఇడ్లీ చట్నిన్
ఇడ్లీ లు పెసర యట్టుల
ఇడ్లీ లే చాలు మనకు నితరము లేలా ?
శ్రీ సుబ్బారావు గారి ఇడ్లీ పద్యము చదివేను. నేను విన్న దాని ప్రకారము ఇడ్లీ వాడుక మాటయే -- ఇడ్డెన అని గ్రాంధిక రూపము. ఇటువంటి పదమును ప్రాసలో ఇచ్చినపుడు, అన్య భాషా పదములను కూడా వేసుకొనవచ్చును, ఉదా: గాడ్లీ, సేడ్లీ.
రిప్లయితొలగించండిఓం స్వామియే శరణమయ్యప్ప
రిప్లయితొలగించండిసవరణలకు గురువు గారికి ధన్యవాదములు.
---------
నీతి పరులు లేరు నేలపైనను యను
పదుగురాడు మాట పాడిగాదు,
పచ్చరోగమొచ్చి పరిపాలనయు జేయు
వారు గాంచలేరు వసుధలోన|
నమస్కారం!
రిప్లయితొలగించండిఆర్యా ! , నిన్ననే శ్రీరామరాజ్యం సినెమా చూసాను , అందులో ఒక గూఢచారి రామచంద్రుడికి నగరంలో జరిగిన విషయాలను చెబుతూ , త్రాగుబోతు తిప్పడు వేసిన నింద గురించి చెబుతాడు . . ఈ సందర్భంలో లక్ష్మణస్వామి ఈ విధంగా చెప్తారని ఊహ చేస్తూ పూరిస్తున్నాను ...
త్రాగుబోతుమాట ధర్మంబు కాబోదు
సాధ్వి సీతకు నిల సాటి లేరు
నిజము నెరుగకుండ నిందవేయగనెంచి
పదుగు రాడు మాట పాడి గాదు
తెలుగు నేల పైన తీరైన పల్లెల
రిప్లయితొలగించండిపూల తోట లందు పూచి ,జనులు
పలుకు తెలుగు మాట పండితు లొల్లరు
పదుగు రాడు మాట పాడి గాదు
మరొక్క పూరణ , చిన్ని కృష్ణుడు వెన్న దొంగిలించాడు అని చెప్పటానికి వచ్చిన గోపికలను చూసి నల్లనయ్య ఉక్రోషంగా , ఏమి ఎరుగనివాడిలాగా , యశోదతో తన గురించి అమాయకంగా చెప్తున్న వైనం ...
రిప్లయితొలగించండినంద రాజ సుతుకు నవనీతముల్ లేవె?
చోరుడే దలుప యశోదబిడ్డ ?
మానధనుడను యవమానితుడన్ సేయ
పదుగు రాడు మాట పాడి గాదు
శ్రీ కళ్యాణ్ గారికి సూచనలు:
రిప్లయితొలగించండిమీ పద్యములో కొన్ని సవరణలు చేయవలసి యున్నది.
(1) నందరాజ సుతుకు .. సుతునకు అనవలెను. (నందరాట్సుతునకు అనండి).
(2) చోరుడే దలుప .. దలప అనవలెను.
(3) మానధనుడను తరువాత యడాగమము రాదు. మానధనునకు నవమానకరమ్ముగా అనండి.
నీలి వార్త వినుచు నిజమని నమ్ముట
రిప్లయితొలగించండిప్రాజ్ఞు లైన జనుల భావ్య మవదు
నిజము బయట పడని నివురుగ ప్పిననిప్పు
పదుగు రాడు మాట పాడి కాదు.
పదుగు రాడు మాట పాటియై ధర జెల్లు
రిప్లయితొలగించండిననెడు సూక్తి యుండ ,నట్లు గాక
పదుగు రాడు మాట పాడి గాదని బల్క
పూర యింపు నకని బోధ పడెను .
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
బాలకృష్ణుడు తల్లితో :
01)
________________________
పాలు దొంగిలించె - బాలకృష్ణు డనుచు
పలుకు పలుకు లన్ని - పలుకులమ్మ !
పలుకు జేయ దలచి - భామలంత పలుకు !
పదుగు రాడు మాట - పాడిగాదు !
________________________
పలుకు = పలికెడి
పలుకులు = మాటలు
పలుకులు = అపనిందలు
పలుకుజేయ దలచి = మెఱమెచ్చుల కొఱకై
లక్ష్మణుడు రామునితో :
రిప్లయితొలగించండి02)
___________________________
పరమ సాధ్వి సీత - పాపచరిత యంచు
పలుకు పలుకు లన్ని - పలుకు లన్న !
పాప జనుల పలుకు - పాడి జేయ తగదు !
పదుగు రాడు మాట - పాడి గాదు !
___________________________
పలుకు = పలికెడి
పలుకులు = మాటలు
పలుకులు = అపనిందలు
గగన మందు వెలయు రంగులీను ధనుసు
రిప్లయితొలగించండికంటి కింపు గాను కాన వచ్చు.
మెరిసి మురిసి నంత మేలిమై యుండునా ?
పదుగు రాడు మాట పాడి కాదు !
నేమాని వారికి నమస్కారములు
రిప్లయితొలగించండిమీరు ఉదయమే నా ఇడ్లీ రుచి చూసి ,అన్య భా షా పదము లైన
గాడ్లీ ,సేడ్లీ లను పరిచయము చేసి నందులకు కృతజ్ఞుడను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినింద వేయ జనులు నిజమని నమ్మరే
రిప్లయితొలగించండియున్న మాట వినుట యుత్తదేను
నిప్పు లేక పొగయు నెగడునే యను నట్టి
పదుగు రాడు మాట పాడి గాదు
సుబ్బారావు గారు నమస్కారములు. మీరు ఇడ్లీ లే గాక వడలు,పూరీలు పెసరట్టులు చట్నీ సాంబారులతో అందఱికీ విందు జేసారు. అవి శ్రీ పండిత నేమాని వారికి ఫర్వా లేదు గాని బరువు కొంచెము తగ్గుదామనుకొంటున్న మా బోటి వారలకు ....?
రిప్లయితొలగించండిలక్ష్మణుడు రామునితో :
రిప్లయితొలగించండి03)
___________________________
పావకుండు సాక్షి - పరమ సాధు చరిత !
పదుగు రాడు మాట - పాడిగాదు !
పలుకు , ప్రభువు పలుకు - పలుకు జేయగ లేను !
వనము నందు వదినె - వదలి వత్తు !
___________________________
పలుకు = (నీ )మాట
ప్రభువు పలుకు = రాజాఙ్ఞ
పలుకు = ప్రశ్న
పలుకు జేయగ లేను = ప్రశ్నింప లేను(ఎదురు చెప్పలేను)
భరత నాట్య మంచు సరగున వస్తిమి
రిప్లయితొలగించండికబురు లాడ దగదు కలికి యిచట
మనసు దోచు రీతి కనుల పండువు గాగ
పదుగు రాడు, మాట పాడిగాదు
పాదము విఱపు మిస్సన్న గారి ప్రత్యేకత.మిత్రమా ! చక్కగా పద్యములో నృత్యము నాడింపించారు.
రిప్లయితొలగించండినరసిం హ మూర్తి గారికి నమస్కారములు.
రిప్లయితొలగించండిఒక్కొక్క అయిటెం కు ఒక్కొక్కొటి మాత్రమే విందు ఆరగించి,
అయిదు కిలోమీటరులు వాకింగు చేయ నా ప్రార్ధన.
అప్పుడు బరువు సమస్య ఉండదు.
అదుగొ పులి యటన్న నిదె తోక యనఁగను
రిప్లయితొలగించండిచేరు లోకమునఁ బుకారు లెన్నొ
వాస్తవమ్ము గనక పలుగాకు లైనట్టి
పదుగు రాడు మాట పాడి గాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిస్సన్న మహాశయా ! మళ్ళీ మెరుపు మెరిపించారు !
రిప్లయితొలగించండిమిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులు చంద్రశేఖర్ గారూ సీమ ఫలము లంటే మొహం మొత్తేసింది స్వామీ !ఫలము కోస్తే నల్లగా తక్షకులు కనిపిస్తున్నారు. అవి అరోగ్యమునకు ఆయుష్షునకు మంచివెలా అవుతాయి ? సీతాఫలములే మెరుగు.
రిప్లయితొలగించండిసీమ ఫలము లనగ రోమాంచము గలిగె
సీతఫలము లన్న ప్రీతి పెరిగె
సీత ఫలము హితము సీమలో గలదన్న
పదుగురాడు మాట పాడి గాదు.
బుధులఁ,బంధువులను, పూజనీయుల నీవు
రిప్లయితొలగించండిపలుకరించువేళ వలదు, మాను
మొంటిచేతిజోత, ఓపుత్ర! "హాయ్" యను
పదుగు రాడు మాట పాడి గాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి“దినమునకొకసీమ ఫలము తినిన నొవ్వి
రిప్లయితొలగించండినీ దరికి రాదు వైద్యులన్ నీవుఁ జూడ
పనియె లేద”ను లేసుగ పదుగు రాడు
మాట పాడి గాదది గాలి మకిల చాలు
వైద్యవరుల దర్శింపను వరుసగాను!
మిస్సన్నగారు ! 'పదుగు రాడు మాట' పాడిగా విరిచారు...భేష్ ...
రిప్లయితొలగించండిశంకరార్యా ! చక్కని పూరణ చేశారు. బాగుంది.
మిత్రులందరి పూరణలు ముచ్చటగా నున్నవి.
మూర్తి మిత్రమా! వసంత మహోదయా! హనుమచ్చాస్త్రి గారూ!
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మీ అందరి పూరణలూ మనోహరంగా ఉన్నాయి.