10, డిసెంబర్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 143

                      అనులోమ ప్రతిలోమ శ్లోకం

 కాళిదాసళిదాయోమా చంద్రంతేరిపురంజకమ్ |

కంజరంపురితేంద్రంచ మాయోదాళిసదాళికా|                                      
(ఈ శ్లోకాన్ని ఎటునుండి చదివినా ఒక్కటే!)

పదవిభాగం -
కాళి, దాసళి, దాయో, మా, చంద్రం, తే, రిపురంజకం, కంజరం, పురి, తా, ఇంద్రం చ, మాయో, దాళి, సత్ + ఆళి, కా.


 అన్వయం -
కాళి, దాసళి, దాయో, మాయో, దాళి, సత్ + ఆళి, పురి, తే, తా, చంద్రం, కంజరం, ఇంద్రం చ, రిపురంజకమ్, మా, కా


.ప్రతిపదార్థాలు -
కాళి = ఓ పార్వతీ!
దాసళి = దాసులను పుత్రులుగా స్వీకరించేదానా!
దాయో = వేరుగా ఉండని శివుడు కలదానా!
          (‘దాయః అవిభక్తః ఉః శివః యస్యాస్సా దాయో’ అని విగ్రహవాక్యం)
మాయో = మాయారూపిణివైన ఓ దేవతా!
          (‘మాయా చ సా ఊశ్చ మాయో’ అని విగ్రహం)
దాళి = దాంతి కలదానా!
          (‘దాం క్షాంతిం లాతి గృహ్ణాతీతి దాళీ)
సత్ + ఆళి = దేవతాస్త్రీలే చెలికత్తెలుగా కలదానా!
పురి = దగ్గరికి తీసే విషయమై
తే = నీ యొక్క
తా = దయ
చంద్రం = చంద్రుని
కంజరం = సూర్యుని
ఇంద్రం చ = ఇంద్రునీ
రిపురంజకమ్ = అరిషడ్వర్గం కలవారిగా చేయుదువు గాక!
మా = నన్ను గురించి
కా = సుఖానికి స్థానం అవుదువు గాక!
          (‘కస్య = సుఖస్య, ఆ = స్థానం - కా’ అని విగ్రహం)


(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

12 కామెంట్‌లు:

  1. శంకరార్యా ! చక్కని చమత్కార యుత మైన సాహిత్యాన్ని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదములు.
    ఇందులో "అరిషడ్వర్గం కలవారిగా చేయుదువు గాక!" అర్థం కాలేదండీ.

    రిప్లయితొలగించండి
  2. గురువుగారూ అద్భుతమైన శ్లోకాన్ని పరిచయం చేశారు.
    ఆ మధ్యన మా పెద్దల్లుడు ఒక మెయిలు పంపించాడు.ఆసక్తి గా ఉంటుందని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

    దానిలో యిలా ఉంది:
    "ఆంగ్లేయులు Able was I ere I saw Elba అనే వాక్యాన్ని గొప్పగా చెప్పుకొంటారు.
    ఈ వాక్యం ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. ఇది 17 వ శతాబ్దం నాటి వాక్యమట.
    ఎల్బాను చూసే వరకూ నేను సమర్ధుడిగానే ఉన్నాను అని ఆ వాక్యానికి అర్థమట.

    మరి 14వ శతాబ్దంలోనే దైవజ్ఞ సూర్య పండితుడనే భారతీయ సంస్కృత కవి రామకృష్ణ విలోమకావ్యం
    రచించాడు. ఈ కావ్యంలో మొత్తం రమారమి 40 శ్లోకాలు ఉన్నాయట. మొదటినుంచి చివరవరకూ చదివితే
    రామాయణం, చివరినుంచి మొదటి వరకూ చదివితే భారతం అవుతాయట. ఎంత అద్భుతం!
    మచ్చుకొక శ్లోకం:

    తాం భూసుతా ముక్తి ముదార హాసం
    వందేయతో లవ్య భవం దయా శ్రీ
    (దరహాసం చిందించే లవుని ప్రేమించే దయగల లక్ష్మియైన సీతకు నమస్కరించు చున్నాను.)
    ఇదే వెనుకనుంచి చూస్తే
    శ్రీ యాదవం భవ్య లతోయ దేవం
    సంహారదా ముక్తి ముతా సుభూతాం.
    (మంగళ ప్రదమైన ఆకర్షణ గల వాడైన కృష్ణుని గీత బోధ చెడును సంహరిస్తూ ప్రాణ ప్రదమైనది.)

    ఎలా చూచినా సంస్కృతం ప్రపంచ భాష లన్నిటిలోకీ ఉత్త మోత్తమ మైనది."

    రిప్లయితొలగించండి
  3. మిస్సన్న గారూ,
    మీ వ్యాఖ్యను మొన్ననే చదివాను. ధన్యవాదాలు. ఆ రామకృష్ణ విలోమకావ్యం గురించి తెలుసు. అది హిందీ వ్యాఖ్యానంతో అచ్చయి ఉన్నదని తెలిసి దానిని తెప్పించుకోవాలని ప్రయత్నం చేసాను కూడా.

    రిప్లయితొలగించండి
  4. Dear shri shankarayya gaaru,

    You can download free the Ramakrishna Viloma kavyam from this link. This site has also the best of the sanskrit documents. When I first read this vilomakavyam about an year ago, I was really stunned by its versatility.

    http://sanskritdocuments.org/doc_z_misc_index.html

    cheers
    zilebi.

    రిప్లయితొలగించండి
  5. This is the direct link to the pdf document

    http://sanskritdocuments.org/all_pdf/raamakrshhna.pdf

    రిప్లయితొలగించండి
  6. ‘జిలేబి’ గారూ,
    ఉపయుక్తమైన సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు. రామకృష్ణ విలోమకావ్యాన్నే కాదు మరికొన్ని పుస్తకాల PDF ఫైళ్లను డౌన్ లోడ్ చేసుకున్నాను.
    అయితే ఆ కావ్యం వ్యాఖ్యానంతో (హిందీ లేదా ఇంగ్లీషులో నైనా) దొరికితే ఇంకా బాగుండేది.

    రిప్లయితొలగించండి
  7. ‘జిలేబి’ గారూ,
    మీ రిచ్చిన లింక్ లోనే కవి వేంకటాధ్వరి రచించిన ‘రాఘవ యాదవీయం’ అనే విలోమకావ్యం దొరికింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. గురువుగారూ ధన్యవాదాలు.
    జిలేబీ గారూ మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. శంకరార్యా,

    మీకున్న తెలుగు జ్ఞానం తో ఆ పుస్తకాన్ని మీరు పూర్తి గా అర్థం చేసుకోగలరు ! మరి ఒక్క హిందీ అనువాద మేల! మళ్ళీ ఎక్కడైనా అనువాదం కనబడితే చెబ్తాను

    రిప్లయితొలగించండి
  10. తెలుగు భాష మీద మక్కువ ఉన్నది. కానీ తెలుగు భాషలో ఇన్ని లోతులు చూసిన వారి వ్యాఖ్యలు ఇక్కడ చదువుతూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నది. అందరికీ మనసారా ధన్యవాదాలు. శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. వామన కుమార్ గారూ,
    సంతోషం! బ్లాగులో ప్రకటిస్తున్న విషయాలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
    ఇప్పటికే ‘రామకృష్ణ విలోమకావ్యాన్ని’ ప్రకటించాను.
    ప్రస్తుతం ‘రాఘవయాదవీయం’ అనే విలోమ కావ్యాన్ని ఈ బ్లాగులో ప్రకటించే ప్రయత్నంలో ఉన్నాను.

    రిప్లయితొలగించండి