19, డిసెంబర్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 150

                                 చాటు శ్లోకం


సమరే హేమరేఖాంకం
బాణం ముంచతి రాఘవే
|
స రావణోపి ముముచే
మధ్యే రీతిధరం శరమ్
||

 వాచ్యార్థం - 
యుద్ధంలో రాముడు సువర్ణరేఖ అనే బాణాన్ని ప్రయోగించగా, ఆ రావణుడు యుద్ధం మధ్యలో ఇత్తడి (రీతి = ఇత్తడిని; ధరం = ధరించిన) బాణాన్ని విడిచాడు.

వ్యంగ్యార్థం -
యుద్ధంలో రాముడు సువర్ణరేఖ అనే బాణాన్ని ప్రయోగించగా రావణుడు (మధ్యే = నడుమ; రీ + ఇతి = రీ అనే అక్షరాన్ని ధరించిన; శరం = శ, రం అనే అక్షరాలు కలిగినది - అంటే) శరీరం విడిచాడు.

              (శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

3 కామెంట్‌లు:

  1. శరీరం లో మధ్య భాగాన్ని వేరు చేసిన విధం బహు చమత్కారముగా ఉందండీ...భలే..

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు
    బాగున్నాయి .చమత్కార భరిత మైన చక్కటి చాటువులను అందిస్తున్నందుకు ధన్య వాదములు తమ్ముడూ !

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు.
    "మధ్యే రీతి ధరం శరం=శరీరం .
    చాల బాగుంది .పదముల విభజన.
    సహస్రాభివందనములతో,
    మీ సుబ్బారావు.

    రిప్లయితొలగించండి