17, డిసెంబర్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 149

                                చాటు శ్లోకంశంకరం పతితం దృష్ట్వా
పార్వతీ హర్షనిర్భరా |
రుదంతి పన్నగా స్సర్వే
హా హా శంకర శంకర ||

వాచ్యార్థం -
పడిపోయిన శంకరుని చూసి పార్వతి ఎంతో సంతోషించింది. పాములన్నీ "అయ్యో శంకరా! శంకరా!" అని ఏడ్చాయి.
 
వ్యంగ్యార్థం -
శంకరం = చందనవృక్షం
పతితం = పడిపోవడాన్ని
దృష్ట్వా = చూచి
పార్వతీ = పర్వతజాతికి చెందిన భిల్లకాంత
హర్షనిర్భరా = ఎంతో సంతోషించింది (కొమ్మలకోసం చెట్టు నెక్కే శ్రమ తప్పినందుకు)
పన్నగాః సర్వే= పాములన్నీ
హా హా శంకర శంకర = అయ్యో చందనవృక్షమా అంటూ
రుదంతి = విలపించాయి (తమ కాశ్రయమైన వృక్షం నేలకూలినందుకు)

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

1 కామెంట్‌:

  1. అయ్యా! ఈ చాటు శ్లోకములో వాచ్యార్థము దోష భావముతో నున్నది. మత ఛాందసుల మనో భావాలకు విఘాతము కలిగించును. ఇటువంటి శ్లోకములను ప్రక్కన పెట్టుటే మంచిది.

    రిప్లయితొలగించండి