2, డిసెంబర్ 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 137

              ఏకాక్షర (ఏకవ్యంజన) శ్లోకం - 1
రరోరరే రరరురో
రురూరూరు రురోరరే
|
రేరే రేరారారరరే
రారేరారి రి రారిరా
||

పదవిభాగం -
ర, రోః, అరేః, అర, రురోః, ఉః, ఊరూరుః, ఉరః, అరరే, ర, ఈరే, రీరారా, అరరర, ఇరార, ఇరారి, రిః, ఆరి, రా.
 
అన్వయం -
ర, రోః, అర, రురోః, అరేః, ర, ఈరే, ఉరః, అరరే, రీరారా, ఊరు + ఊరుః, ఉః, అరరర, ఇరార, ఇరారి, రిః, ఆరి, రా.

 ప్రతిపదార్థాలు -
ర = రామశబ్దంలోని రేఫ (రకారం) వలన
రోః = భయం కలవాడైన,
అర = వేగంగా పరుగెత్తే
రురోః = హరిణరూపంలో ఉన్న మారీచునికి
అరేః = శత్రువైన శ్రీరాముని యొక్క
ర = కౌస్తుభమణిని
ఈరే = పొంది ఉన్న
అరః + అరరే = కవాటంవంటి వక్షస్థలంలో
రీరారా = లీల నాపాదించే (రలయో రభేదః)
ఊరు + ఊరుః = తొడలచే గొప్పదైన
ఉః = సీత భూమిక దాల్చిన లక్ష్మిని
అరరర = తన నిలయానికి తీసికొని వెళ్ళిన
ఇరార = సముద్రద్వీపాన్ని (లంకను) పొంది ఉన్న
ఇరారి = భూమికి విరోధి అయిన రావణునకు
రిః = నాశనాన్ని కల్గించిన దగుచు
ఆరి = చెలికత్తెలను
రా = పొందింది. 


(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ సంకలనం నుండి)

8 కామెంట్‌లు:

  1. మాస్టారు గారు!నిజంగా చమత్కా 'ర' భరితంగా నున్నది.

    రిప్లయితొలగించండి
  2. ఒక్క ఏకాక్షర పద్యం లొ " ఇం .......త " అర్ధం ఉందా ? " ఎం.......త " బాగుందో ! భళా ......తమ్ముడూ ........ భళా !

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    ................. ధన్యవాదాలు. ఇటువంటి చమత్కార శ్లోకాలు, పద్యాలు మన సారస్వతంలో అగణితాలు. నాకు సాధ్యమైనన్ని సేకరించి అందించాలని ప్రయత్నం.

    రిప్లయితొలగించండి
  4. తప్పకుండా . ఇంకా ఇంకా వ్రాయాలి
    సమస్యలు తీరి మళ్ళీ ఈ సాహితీ ప్రపంచం లొ అడుగిడు తున్నందుకు చాలా ఆనందం గా ఉంది " గాడ్ బ్లెస్ యు "

    రిప్లయితొలగించండి
  5. ఇది తెలుగుకే చెల్లింది. వాక్యాలు విన్నా కానీ పద్యం మొదటి సారి చూశా. చిన్నప్పుడు విన్న వాక్యాలు:
    కాకీకకాకికికాకకుక్కకా?
    నీనాన్ననిన్ననునునన్నానునా?

    రిప్లయితొలగించండి
  6. చాలా బాగుంది ‌‌ఏకాక్షరవిన్యాసం

    రిప్లయితొలగించండి