7, డిసెంబర్ 2011, బుధవారం

సమస్యాపూరణం - 552 (సోదరిఁ దిట్టిన జనులకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్.
ఈ సమస్యను సూచించిన
శ్రీ తాడిగడప శ్యామలరావు గారికి
ధన్యవాదాలు.

50 కామెంట్‌లు:

  1. తా దరి జేరుచు రాముని
    "నాదరికే రార! మార ! నాథా!" యను మం
    డోదరి పతి రావణ నిజ
    సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్.

    రిప్లయితొలగించండి
  2. పోదా సిరి తల్లిని సతి
    సోదరిఁ దిట్టిన జనులకు, శుభములు గలుగున్
    యేదరి నారీ మణులే
    వేదన నే చెందకుండ వేడుక లిడునో.

    రిప్లయితొలగించండి
  3. వెంకట రాజారావు . లక్కాకులబుధవారం, డిసెంబర్ 07, 2011 8:46:00 AM

    మేదిని బాధలు తప్పవు
    సోదరి దిట్టిన జనులకు - శుభములు గలుగున్
    సాదరమున నున్నంతలొ
    మోదమ్మున' చీరె సారె 'ముదితకు బెట్టన్

    సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  4. చిన్న సవరణ తో..

    పోదా సిరి తల్లిని సతి
    సోదరిఁ దిట్టిన జనులకు, శుభములు గలుగున్
    యేదరి నారీ మణులే
    వేదన నే చెందకుండ వేడుక జెందన్.

    రిప్లయితొలగించండి
  5. ఆదరము గలుగు నెడలన
    మోదముతో నిత్తు రెపుడు మూల్యపు సరుకుల్
    సాదర ,సహితులు నగుచో
    సోదరి దిట్టిన జనులకు శుభములు గలుగున్

    రిప్లయితొలగించండి
  6. పూ రణం
    చందమామను ముద్దాడ సాగె చీమ
    ----------------
    నల్ల మేఘంబు లంతట నావహించి
    పైడి కొండల నావల పరుగు లిడుచు
    చంద మామను ముద్దాడ సాగె చీమ
    రెక్క లాడించు నట్లుండె చుక్క లపుడు .

    రిప్లయితొలగించండి
  7. ఆదరము లేక రఘుకుల
    సోదరులను హింస బెట్టి సొక్కుచు సీతా
    మోదనము గూల్చు రావణు
    సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్

    రిప్లయితొలగించండి
  8. మేదిని నిత్యము శ్రీరమ
    నాదరముతోఁగొలుచుచునటచేష్టలచేఁ
    నాదరి జేరకనిరమా
    సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్

    రిప్లయితొలగించండి
  9. వాదము లాడుచు దెలియక
    సోదరిఁ దిట్టిన, జనులకు శుభములు గలుగున్
    మోదము తోడను చెల్లెలి
    కాదరమునుఁ జూపునట్టి ఘనులకు వినుమా!

    రిప్లయితొలగించండి
  10. నా పూరణ .....

    ఈ దారిద్ర్య మిపుడు జ్యే
    ష్ఠాదేవీకరుణచేత సమకూరెఁ గదా
    యీ దీనునకును; లక్ష్మీ
    సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్.

    రిప్లయితొలగించండి
  11. అయ్యా మిస్సన్న గారూ!
    కొన్ని పదములకు మంచి అర్థమే ఉన్నా, వాడుకలో విపరీతమైన అర్థములుగా మనమే భావించు చుందుము. అలాగే పూజ్యుడు అనే పదమునకు శబ్దరత్నాకరములో మంచి అర్థమే ఉన్నది. మన వాడుకలో పూజ్యము అంటే శూన్యముగా భావించుట పరిపాటి. అలాగే అన్వయము వస్తుంది పూజ్యుడు అనే పదమునకు కూడా. అందుచేత ఇట్టి పదములు వాడుట తగ్గించుకొనాలి అని నా సూచన. వాడకూడదు అనే నిషేధము లేదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. ఆ దేవత నామమ్మట
    "సోదరి దిట్టిన" శ్రితజన సురతరువు జుమీ
    ఆదరమున వరములనిడ
    సోదరి దిట్టిన జనులకు శుభములు గలుగున్

    రిప్లయితొలగించండి
  13. మిత్రులారా!
    వాడుక భాష, గ్రాంధిక భాష - దేని వ్యవహారము దానిదే. ఉప్పు ఉప్పే, కప్పురము కప్పురమే. దేని ప్రాముఖ్యము దానికి ఉన్నది.
    సులభముగా అర్థమవుతుంది కదా అని పూర్తిగా వాడుక భాషనే అన్నిటా వాడుదాము అనడము సమంజసము కాదు. శాశ్వతమైన కావ్యాలలో వ్యాకరణ శుద్ధమైన భాష తప్పనిసరి. అలాగే మనము మాటాడుకున్నప్పుడు వాడుక భాషే బాగుంటుంది స్వఛ్ఛమైన వ్యాకరణశుద్ధమైన భాష మాటాడలేము కూడా.
    పద్యాలలో అన్ని రకాలైన పాకములు ఉండాలి. అవి అన్ని స్థాయీలలో జనులకు ఉపయోగమవుతాయి కాబట్టి. తేలికపాటి పదాలతో పద్యాలు వ్రాసి జనులని మెప్పించిన వారెందరో ఉన్నారు. జటిలమైన భాష ఇప్పటిలో ఎవ్వరూ ఉపయోగించుటయే లేదు. కొన్ని చోట్ల సమయానుకూలముగా పెద్ద సమాసములు, కఠోరమైన భాష వాడవలసి వస్తుంది. కొన్ని చోటులలో మధురమైన భాష బాగుంటుంది. అందుచేత వ్యాకరణ శుద్ధమైన భాష అనే అందాము వీలైనట్టుగా వాడుదాము. వాడుక భాషను మాటలకే పరిమితము చెయ్యాలి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. పరాశర సంహిత అనే గ్రంథంలో ఆంజనేయుడికి మకరకేతువనే పుత్రుడున్నట్లుగా చెప్పారని కుప్పా వేంకట కృష్ణమూర్తిగారు ఆంధ్రభూమి ధర్మ సందేహాలు శీర్షికలో వ్రాసారు.
    http://www.andhrabhoomi.net/archana/aa-400

    రిప్లయితొలగించండి
  15. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    దారిద్ర్యంలో నున్నా సరే సోదరి నాదరించాలి గాని :

    01)
    _______________________________

    సోదరిపై నాదరమును
    సీదాగా జూపువారి - సిరులే వెలయున్ !
    సీదరము నున్న , నెట్టుల
    సోదరిఁ దిట్టిన జనులకు - శుభములు గలుగున్ ?
    _______________________________
    సీదా = చక్కని
    సీదరము = దారిద్ర్యము

    రిప్లయితొలగించండి
  16. ఆదరమున పిలిచె భగిని
    సాదరముగ వెడలి యతడు చెల్లితొ ప్రీతిన్ !
    వాదన లెందుకు మనకిక
    సొదరిఁ దిట్టిన జనులకు శుభములు కలుగున్ !

    రిప్లయితొలగించండి
  17. ఆదరమున జూచినచో
    సోదరి దీవనల వలన శుభములు గలుగున్
    మేదిని నటుగా కేమని
    సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్

    రిప్లయితొలగించండి
  18. కొంచెం ఙ్ఞానం కలిగినా సోదరి నాదరిస్తారు, కాని పక్షంలో :

    02)
    _______________________________

    సీదరము గలుగు నిక్కము
    సోదరిఁ దిట్టిన జనులకు ! - శుభములు గలుగున్
    సోదరిపై నాదరమును
    సోదకులై జూపినంత - సోదరులెపుడున్ !
    _______________________________
    సీదరము = దారిద్ర్యము
    సోదకులు = జ్ఞానులు

    రిప్లయితొలగించండి
  19. సోదరి నవమానిస్తే కష్టాలు తప్పవు మరి :

    03)
    _______________________________

    వేదనలు గలుగు నిత్యము
    సోదరిఁ దిట్టిన జనులకు ! - శుభములు గలుగున్
    సోదనలు జేయ కెన్నడు
    సోదరి,ప్రియ మాదరించు - సోదరుల కిలన్ !
    _______________________________
    సోదన = శోధనము(అంటే వంకలు వెతక్కుండా)

    రిప్లయితొలగించండి
  20. శాంతినివాసం సినిమాలో బాలసరస్వతి లాంటి వాళ్ళను మాత్రం :

    04)
    _______________________________

    వేదన గలుగ , వదినె కప
    వాదము గల్పించి మురియు - వాచాలతలన్
    వీధిన బడదోసి మిగుల
    సోదరిఁ దిట్టిన జనులకు - శుభములు గలుగున్!
    _______________________________
    వాచాలత = వదరుఁబోతుతనము

    రిప్లయితొలగించండి
  21. *నేమానివారు ""సోదరి దిట్టిన" అనే దేవతను ఆవిష్కరించారు. మంచి ప్రయోగం. బాగుంది.
    *గోలి హనుమచ్ఛాస్త్రి గారి పద్యంలో 'రావణ' అనిగాక 'రావణు' అని ఉండాలని నా అభిప్రాయం. పద్యం బాగుంది. శూర్పనఖను తిట్టటం నిత్యమే కదా. వారి 'పోదా సిరి' పద్యంలో 'నారీ మణులు' అనీ 'వేడుక లిడునో' అనీ భిన్న వచనాలలో ఉందని వారే గమనించి సరిజేసారు. సంతోషం.
    *రాజారావుగారి 'మేదిని బాధలు..' పద్యం సాఫీగా సాగింది - బాగుంది. 'నున్నంతలొ ' అని బలవంతపు హ్రస్వం కొంచెం విచార్యం.
    * సుబ్బారావుగారి పద్యంలో 'మూల్యపు సరుకుల్' అన్న ప్రయోగం చిత్రంగా ఉంది. సాదర అనేది చిల్లరఖర్చు అనే అర్ధంలో తెలుస్తోంది. కాని కామా దేనికి పెట్టారు? కాని, చివరికి నాకు అన్వయం కుదరలేదు. మన్నించాలి. నా పొరబాటేనేమో.
    *గన్నవరపువారి పద్యంలో 'సీతా మోదనము గూల్చు రావణు సోదరిఁ ' అంటే అర్ధంకావటంలేదు. ''సీతా ఖేదనము జేయు రావణు సోదరిఁ ' అనా? విచారించాలి.
    *ఊకదంపుడువారు 'రమాసోదరిఁ దిట్టిన' అన్నారు. బాగుంది. కాని 'అటచేష్టలచేఁనాదరి జేరక' అంటే యేమిటో సుబోధకంగా లేదు.
    *మందాకినిగారు చక్కగా చెప్పారు. 'దెలియక' కన్నా 'తెలియమి' అనో 'అజ్ఞత' అనో అంటే మరింత ప్రౌఢంగా సొగసుగా ఉండేదేమో కాని 'తెలియక' అన్నది సహజంగా ఉంది.
    *శంకరయ్యగారి పద్యం నాటకశైలిలో ఉంది. ప్రధమార్ధం ప్రకాశంగా. ద్వితీయార్ధం స్వగతం. ఎందుకంటే, యేకకాండంగా కాక పద్యం రెండు ఉటంకింపులుగా ఉంది.
    *వసంతకిశోరుగారు మూడు పూరణలిచ్చారు. వారి 'సీదా' పదప్రయోగం బాగుంది. రాజారావుగారికి మరింత ఆహ్లాదం కలిగిస్తుంది. మూడు పూరణలూ బాగున్నాయి.
    *రాజేశ్వరిగారి పద్యం నాకు అన్వయం కుదరటం లేదు. మన్నించాలి.

    రిప్లయితొలగించండి
  22. ఆదరము జూపవలయును
    నీదగు పతి యెడల తగవు నిందలు చెడుఁ మ-
    ర్యాద యని హితవు జెప్పుచు
    సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్.

    రిప్లయితొలగించండి
  23. నేమాని పండితార్యా నా సందేహమును తీర్చినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  24. శ్యామలీయం గారు ! నమస్కారములు. ప్రజలు
    తమ సోదరి యెడల ,ఆదరము ఉన్నయెడల
    అమూల్య మైన ఆభరణములను కానుకగా ఇస్తారు.
    ఆమె యెడల ఆదరము,ఇష్టము యుండి ఆమెను
    దూషించినను వారికి మేలే కలుగును . అని నా అభి ప్రాయము .
    నా భావము తప్పైతే మన్నించాలి .వీలయితే సవరించ గోర్తాను .
    మీ సవరణ శిరోధార్యము .

    రిప్లయితొలగించండి
  25. సోదరినే గాదు యెవరినీ తిట్టకూడదు !
    తిడితే శుభములు కలుగునా ?
    కలగవు గాక కలగవు !

    05)
    _______________________________

    క్రోధమున, నన్న , వదినెల
    సోదరులను, తల్లి , దండ్రి ,- శోభన నైనన్
    వీధిన బోయెడు వారిని
    సోదరిఁ, దిట్టిన జనులకు - శుభములు గలుగున్???
    _______________________________
    శోభన = స్త్రీ (భార్య )

    రిప్లయితొలగించండి
  26. శ్యామల రావు గారూ..,
    ఓ వైపు రమాదేవి ని కొలుస్తూ ...
    మరోవైపు
    ఆవిడ సోదరిని - నా దగ్గరకు రావద్దు అని నోటి తో తిట్టకుండ -- చేష్టలతో ( వర్తన తో ) తిట్టమని చెబుదామని అనుకున్నాను.

    ధన్యవాదములు
    భవదీయుడు

    రిప్లయితొలగించండి
  27. నమస్కారములు.శ్యామ లీయం గారు
    క్షమించాలి . నాకసలు సమస్య సరిగా అర్ధం కాలేదు. ఏదో వ్రాయాలని వ్రాసానంతే. ఎలా వ్రాస్తే అన్వయం కుదురు తుందోదయ చేసి తెలుప గలరు.

    రిప్లయితొలగించండి
  28. ఖేదము పొందితి కలలో
    సోదరిఁ దిట్టిన, జనులకు శుభములు కలుగున్,
    సోదర భావంబును, ప్రే
    మాదరణము, చిత్తశుద్ధులమరిన తోడన్.

    ( సోదరిని కలలో తిట్టినాకూడా ఖేదమును పొందితిని అనే అర్థములో )

    రిప్లయితొలగించండి
  29. సుబ్బారావుగారి పద్యమునకు వారి భావముననుసరించి, నా పరిష్కరణము:
    ఆదరమున భూషావ
    స్త్రాదుల వెసనిచ్చు వారు తమజిహ్వలకున్
    వాదరబలిమి నొకప్పుడు
    సోదరి దిట్టిన జనులకు శుభములు గలుగున్

    రిప్లయితొలగించండి
  30. శ్యామల రావు గారూ ! ధన్యవాదములు. మీ సూచన సరియైనదే.

    శంకరార్యా ! వారాంతపు పూరణను దాదాపు అందరూ మరచి పోతున్నారు.
    అయినా ప్రతి రోజు ఇచ్చే సమస్యకు బదులుగానే ప్రతి ఆది వారం వృత్తం లో సమస్య ఇస్తే సరి పోతున్దనుకుంటాను. ప్రత్యేకముగా అదనముగా లేక పో యినా పరవా లేదని నా అభిప్రాయం. మిత్రులేమంటారో..ఈ మధ్య దత్త పదులు ఇచ్చుట లేదు... వారం లో ఒక దత్తపది ఉంటే బాగుంటుందని పించింది.. ఏదైనా రోజు కొకటి మాత్రమే ... ఇది నా సూచన మాత్రమే.. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  31. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    సుబ్బారావు గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఊకదంపుడు గారూ, (మీ పూరణను ముందు చూసి ఉంటే నా పూరణ మరో విధంగా ఉండేది)
    మందాకిని గారూ,
    పండిత నేమాని వారూ,
    వసంత కిశోర్ గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    శ్యామల రావు గారూ,
    మిస్సన్న గారూ,
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ అందరి పూరణలు చదివాను. అన్నీ బాగున్నాయి. ‘శ్యామలీయం’ గారు అందరి పూరణలను చక్కగా విశ్లేషించి నాకు శ్రమ తగ్గించారు. నిజానికి నా ఆరోగ్యం బాగా లేదు. గొంతు ఇన్ఫెక్షన్, దానితో దగ్గు, ఆ తర్వాత జ్వరం ... పూర్తిగా నీరసంగా ఉంది. అందువల్ల మీ పూరణలపై విడివిడిగా స్పందించడం లేదు. మన్నించాలి. రేపు ఉదయానికి ఆరోగ్యం చక్కబడితే ఒక్కొక్కరి పూరణలను పరామర్శిస్తాను. మన్నించాలి. ఎట్టి అపరిస్థితిలో నైనా రోజువారి సమస్య లివ్వడం ఆగదు. వీలైతే మిగతా పోస్టులూ ఉంటాయి.

    రిప్లయితొలగించండి
  32. రాజేశ్వరిగారూ, నేను పంపిన సమస్య
    " సోదరి యెడ భక్తి యున్న శుభములు గలుగున్ "
    అయితే జటిలంగా లేకపోతే సమస్య యేమిటని కాబోలు శంకరయ్యగారు కొంచెం మార్చి యిచ్చారు. అయితే యిలాంటి క్లిష్టత యెదురైనప్పుడు అదెలా సంభవం అంటూ యెదురు ప్రశ్న వేయటం లాంటివి చేసి కూడా సమస్యను పూరించవచ్చును.

    రిప్లయితొలగించండి
  33. శ్యామల రావు గారూ,
    మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చిస్తూ, రాగద్వేషాలకు అతీతంగా మిత్రుల పూరణలను సమగ్రంగా పరిశీలిస్తూ గుణదోషవిచారణ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ మధ్య అజ్ఞాతల వ్యాఖ్యలకు నొచ్చుకున్నారేమో అని భయపడ్డాను. మీరూ నా లాగే దూషణ భూషణ తిరస్కారాలను పట్టించుకోని స్థితప్రజ్ఞులు! సంతోషం.
    ఇక నా పూరణ ... ఏదో వెలితి ఉందనిపించింది. మీ వ్యాఖ్యతో తెలుసుకున్నాను. ధన్యవాదాలు.
    మీరిచ్చిన సమస్యను అలాగే ఇస్తే "ఇందులో సమస్య ఏముంది? కేవలం పాదపూరణే కదా" అంటారని మార్చవలసి వచ్చింది. మన్నించాలి!

    రిప్లయితొలగించండి
  34. ఊకదంపుడుగారి పద్యానికి, వారి భావాన్ననుసరించి, నా పరిష్కత పాఠం:
    మేదిని నిత్యము శ్రీరమ
    నాదరమున గొలుచు చుండి యటులే భీతిన్
    నా దరి జేరకుమని తత్
    సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్

    రిప్లయితొలగించండి
  35. శంకరయ్యగారూ, మీరు సమస్యాపాదాన్ని మార్చిన కారణం నాకు స్పష్టం గానే ఉంది మొదటినుండీ. ఇందులో నిజానికి మీకు నా అభినందనలు తెలియ జేసుకోవాలి. చిక్కు లేని సమస్య చప్పగా ఉంటుందన్నది అక్షరాలా నిజం.

    రిప్లయితొలగించండి
  36. ఏదైన కోపము కలుగు
    వాదము జేసినను గాని వారించ వలెన్
    కాదని యలుగుచు నెట్టుల
    సోదరి దిట్టిన జనులకు శుభములు కలుగున్?
    -----------------

    రిప్లయితొలగించండి
  37. అజ్ఞాతల వ్యాఖ్యలకు నొచ్చుకున్నారేమో అన్నారు. కొంచెం నొచ్చుకున్నది వాస్తవమే కాని - స్వల్పంగానే. వెంటనే సద్దుకున్నాను. యెవరికీ వ్యక్తిగత యెజెండాలేమీ లేవని మనకు తెలుసుకదా. అందరూ మిత్రులే. అందరికీ నా శుభాభినందనలు. అదరినీ శాయశక్తులా ప్రోత్సహిస్తాను.

    రిప్లయితొలగించండి
  38. హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    మీ సూచన పాటించదగింది. ఇకనుండి వారాంతపు సమస్య అని ఇవ్వకుండా వారంలో ఒకటో రెండో వృత్తసమస్య లిస్తాను. అలాగే దత్తపదులు, నిషేధాక్షరి కూడా.

    రిప్లయితొలగించండి
  39. శ్యామలీయం గారు ,నమస్కారములు.నా భావమునకు తగిన
    పరిష్కరణ పద్యము వ్రాసి నందులకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  40. నమస్కారములు.
    క్షమించాలి " సమస్య ఎప్పుడు వ్యతిరేకం గానే ఉంటుందాని తెలుసు .కాకపొతే " " సోదరి తిట్టిన శుభములు కలుగున్ ? ? ? "అని ప్రశ్నార్ధకం అయితే [ కలుగవు ] కాక పొతే ఎలా ? అని పెద్ద సందేహం వచ్చింది. పైగా నేను ఇప్పుడిప్పుడే తమ్ముని సవరణల వల్ల , సోదరు లందరి ప్రోత్సాహం వల్ల వ్రాయడం నేర్చు కుంటున్నాను. నిజానికి నాకంత నాలెడ్జ్ లేదు. అందుకే సరిగా వ్రాయ లేక పోయాను . సమస్యను మార్చడం తమ్ముని దోషం కాదు. సరిగా అర్ధం చేసుకోలేక పోవడం నాదే తప్పు.ఇదే పొరబాటు ఇంతకు ముందు ఒక సమస్యా పూరణలో జరిగి పండితుల వారిని నొప్పిం చాను. "ఇకనుంచి నాకర్ధం కాకపొతే రాయద్దని అనుకుంటూనే , రాస్తూ ఉంటాను " నొప్పించి ఉంటే క్షమించ గలరు. మీరు దయతో సరిజేస్తే ముదావహం. సెలవు.

    రిప్లయితొలగించండి
  41. శంకరార్యా ! వలదు ! వలదు !
    ఎన్నాళ్ళనుండో కొనసాగుతున్న శీర్షిక "వారాంతపు సమస్యాపూరణం"
    దాన్నలాగే కొనసాగనివ్వండి !
    దాన్ని రోజువారీ చేస్తే - నాలాంటి పనీ పాటూ లేనివాళ్ళకు పరవాలేదు గాని
    చాలా మందికి యిబ్బందే !

    ఈ వారం సమస్యకు 4 రోజుల తరువాతకూడా యెనిమిదే పూరణలు !
    ఉద్యోగాలూ వ్యాపారాలూ చేసుకునే వారికి , ఒక్కరోజులో వీలవదు గదా !

    మీరు ఉదయం ఇచ్చిన సమస్య - పాపం - విదేశాల్లో యున్నవారికి రాత్రి సమస్య !
    వాళ్ళకు కూడా ఉదయం సమస్య ఉంటే బావుంటుందేమో గదా - అనుకుంటుంటాను !
    అప్పుడు మళ్ళీ వృత్తమంటే- అదీ ఒక్కరోజేనంటే - యింకా యిబ్బంది కాదా ?
    కొద్దిగా సమయమిస్తేనే పూరణలలో వైవిధ్యం కనిపిస్తుంది !
    ముఖ్యంగా వృత్తాలకు !

    ఈ వారం సమస్యనే తీసుకుంటే -
    రుక్మిణి మీదే 6 పూరణలొచ్చాయి యెనిమిదింటికీనూ !
    ఒకటి సత్యభామా - మరొహటి మీరాబాయి మీదన్నూ !
    మీరు యే ఒక్కరి సూచననో గాకుండా - అందరి తరపునా
    ఆలోచించాలి మరి !

    రిప్లయితొలగించండి
  42. కిషోర్ జీ ! నేను వారాంతపు సమస్యను ఎందుకు మార్చాలని అభిప్రాయ పడ్డానంటే ...ఆ సమస్యను ఆరోజు లేక మరొక్క రోజు తప్ప ఎవరు వ్రాయటానికి ప్రత్నించుట లేదు.సమీక్షలు, దిద్దు బాట్లు కూడా చాల వరకు జరుగుట లేదు.ఒక్క సారి గత సమస్యలను చూస్తే అర్థ మౌతుంది. గత వారపు సమస్యను ఆ రోజు తప్పితే తరువాత ఎవరూ ప్రయత్నించలేదు. అందరమూ మరచి పోతున్నాము. వ్రాయాలనుకున్న వారికి ఎప్పుడైనా పాత సమస్యలను వ్రాసే అవకాశం ఉన్నదికదా..ఇది నా అభిప్రాయము.. కవి మిత్రుల అందరి సూచనల తోనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది..నిర్ణయ మేదైనా సంతోషమే..ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  43. శ్యామల రావు గారూ..,
    ధన్యవాదములు.

    నా ప్రయత్నం.., అమెని వాక్కుతో దూరకుండ.. సక్రమ మార్గం లో నడిస్తే .. దూషించినంత పనే అనికూడా చెప్పాలని....

    ఆవిడ వచ్చినతరువాత తిట్టే బదులు.., రాకముందే పేడకలాపి జల్లి ముగ్గూ గొబ్బీ పెడితే.. తిట్టినట్టేకాదూ?

    పైగా ఒకసారి తిట్టటం మొదలుపెడితే లక్షీజపం కంటె సోదరిజపమే ఎక్కువతుంది. [ కొంతమంది పుణ్యాత్ములుంటారు.., కూర్చోవటానికి లక్ష్మీపూజకే కూర్చుంటారు.., కాని - దీపారాధన జేయటానికి గీసిన అగ్గిపుల్ల రెండో సారికి కుడా రాజుకోలేదనుకోండి "ఉహు.,పొద్దునే ..ద8ద్రం.." అంటారు.. ఇంక పూజెందుకు..చెప్పండి..]

    దయతో ఈ రెండూ పరిశీలించండి:
    1)
    మేదిని నిత్యము శ్రీరమ
    నాదరముతోఁగొలుచుచునష్టోత్తరనా
    మాదిస్తోత్రమ్ముల,తత్
    సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్.

    [విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం
    దారిద్య్ర ధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం! ]

    2)
    మేదిని నిత్యము శ్రీరమ
    నాదరముతోఁగొలుచుచు నమల వ్రతులై
    పాదమిడతావిడక,తత్
    సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్.

    ధన్యవాదములు
    భవదీయుడు

    రిప్లయితొలగించండి
  44. ఆదరమివ్వక రోగికి
    వాదము లందున మునుగుచు వార్డుల లోనన్
    చీదర జేసెడి "డ్యూటీ
    సోదరిఁ" దిట్టిన జనులకు శుభములు గలుగున్

    డ్యూటీ సోదరి = night duty sister

    రిప్లయితొలగించండి
  45. మీదను పడగా దారను
    రోదనలన్ గాంచలేక రోడ్డున పడుచున్
    చేదగు మాటల తోడన్
    సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్

    రిప్లయితొలగించండి

  46. ఆదరణ లేక మగ్గె‌ను
    వేదవతియె సూర్పణఖ ప్రవీణత చూపం
    గా! దరిమిలాని రావణు
    సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి