కవిమిత్రులారా,
‘పాలు, పెరుగు, చల్ల, వెన్న’
పై పదాలను పాడి సంబంధమైన అర్థంలో కాకుండా ఉపయోగించి
మహాభారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యం వ్రాయండి.
‘పాలు, పెరుగు, చల్ల, వెన్న’
పై పదాలను పాడి సంబంధమైన అర్థంలో కాకుండా ఉపయోగించి
మహాభారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యం వ్రాయండి.
దుర్యోధనాదుల గురించి ధృతరాష్ట్రుని బాధ:-
రిప్లయితొలగించండిహితవు చెప్పెడి శ్రమయంత నేటిపాలు
దోషరాశియు పెరుగును, దుష్టులకును
జల్లగనుజేరు పాపము; శక్తి యుక్తు
లన్నవెన్నయినను నుండి లాభమేమి?
శక్తి యుక్తులన్నవి+ఎన్ని
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాయబారానికి వెళ్ళునప్పుడు ధర్మరాజు కృష్ణునితో..
రిప్లయితొలగించండిమాకు రక్ష నీవె మాన్య నీవెన్నడు
పెరుగు కక్ష లన్ని విరుగ జేయ
గ్రామపంచ కంబు కలిగిన మా పాలు
చల్లనయ్య కృష్ణ చాలు మాకు
మిత్రులారా!
రిప్లయితొలగించండిసమస్యలనిచ్చే విధానము గురించి మిత్రుల అభిప్రాయములను చూచేను. నా అభిప్రాయమును తెలిపేను. పూర్వము ఆకాశవాణిలో "తుని లోపల ముజ్జగములు తూగుచు నుండున్" అనే సమస్యను ఇచ్చేరు. ఇప్పటికి జరిగిన చర్చ చాలును. శ్రీ శంకరయ్య గారు వందల కొలది సమస్యలను ఇచ్చిన వారే. అందుచేత వారి అనుభవము ప్రకారమే ఈయదగిన సమస్యలనే ఇస్తారు అనుటలో సందేహములేదు. మనందరి సలహాలను కూఒడా వారు ఎప్పుడూ స్వీకరిస్తూనే యుంటున్నారు. రసవత్తరమైన సమస్యలు, పూరణలు, తదితర ప్రక్రియలతో మన శంకరాభరణము మరింత తేజోవంతము అవుతుందని ఆశిద్దాము - ఆ విధముగా మనవంతు సహాయ సహకారములను అందిద్దాము.
సరసవచోనిధానులగు సత్కవి పండిత మిత్రులార! సుం
దరతర శబ్ద భావమయ నవ్య కవిత్వ విశేష రీతులన్
కరము వెలుంగజేయ దగు క్రన్నన నెల్లరు మెచ్చ శంకరా
భరణము శంకరార్యులును స్వాంతమునన్ పరితోషమొందగన్
పెరుగుట కక్షలెవ్వరికి పెంపొనరించును కౌరవేశ నీ
రిప్లయితొలగించండివెరుగవె ధర్మజాదులకు వేగమె పాలిడి జేరదీయవే
కురియుచు చల్లగా మమత కూర్మిని యుద్ధము సంభవించుచో
కరుగవె సంపదల్ సిరులు కాదె నిజమ్మనె వెన్ను డత్తరిన్ .
నేమాని పండితార్యా ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివెన్న దొంగను గురునాధ ! వేడు కొందు
రిప్లయితొలగించండిరాజ్య భాగపు సగ పాలు రమ్యము గను
ఉల్ల మలరగ నిచ్చిన చల్ల గుండ్రు
అంతె కాకయ పెరుగును యశము కూడ .
విన్నపాలివె గోవింద విమలతేజ
రిప్లయితొలగించండిఎట్టి కలతలునున్ దగవెన్నడేని
మా తలంపెరుగుదు కద మమ్ము చల్ల
గా గనెడు పుష్కరాక్ష సంగరము వలదు
మెల్లగఁ పెట్టెలో శిశువు మేల్కొన కుండగ నీటిపాలు గా
రిప్లయితొలగించండితల్లియె జేసె, దాఁ పెరుగు దారుల నాడుచు చిన్ని బిడ్డడా
చల్లని నీళులందునను సాగెను చేరగ సూతునింటిలో.
కల్లల వెన్నఁ జూడగను, కాంతను బేలగ పోల్చు పల్కులున్.
అయ్యా!శ్రీ శ్యామలరావు గారూ! మీ నిన్నటి సంశయములకు మా వివరణలు వినండి:
రిప్లయితొలగించండి(1) కోరకయే = అనునది సాధు ప్రయోగము.
వ్యతిరేక పదములు (కోరక వంటివి) కళలు, ద్రుతప్రకృతికములు కావు.
(2) వేళలందు మరియు వేళలయందు - అను నీ రెండును సాధు ప్రయోగములే. అత్తునకు సంధి బహుళము.
స్వస్తి.
చాలిక , పాలుగోరు పగచావని తీరులు , పల్కు లన్ని బీ
రిప్లయితొలగించండిరాలగు , దుస్ససేను రుధిరమ్ములు చల్లక వేణి ముడ్వ , నా
కూళ సుయోధనోరువులు గూలక యోర్ములు గల్గ వెన్నడున్
కీలక మైన చూపెరుగు కృష్ణ ! సహోదరి గుండె లోతులన్
అయ్యా! శ్రీ ఊ.దం. & శ్రీ మిస్సన్న గారలు:
రిప్లయితొలగించండితి + ఉనికి సంధి చేయ వచ్చునా?
ఇత్తునకు సంధి గురించి 4 విధముల సూత్రములు గలవు. పూర్వపదములోని చివర అక్షరము "తి" అగుచో, ఆ పదము యొక్కలక్షణమును బట్టి సరియైన సూత్రమును మనము చూచుకొని సంధి ఏ విధముగ జరుగునో తెలుసుకొనవలెను.
తి + ఉనికి - త్యునికి మాత్రము కాదు. ఇది యణాదేశ సంధి కాలేదు - ఎందుచేతననగా యణాదేశ సంధి సంస్కృత సంధియే గాని తెలుగు సంధి కాదు.
శ్రీకృష్ణరాయబార ఘట్టము నుండి రెండు మూడు పద్యముల భాగము:
రిప్లయితొలగించండికృష్ణుఁడు:
పెరుగు సత్కీర్తి చల్లగా వారి పాలు
పిలచి యిచ్చిన వారి నీ వెన్నఁడేని
గెలుచు టుండమి బాగుగా దెలిసి నీవు
పోరు పొందుల నొకదాని గోరుకొనుము
సుయోధనుఁడు:
లేవు లేవెన్నఁడును వారి కీవి మీర
పాలు వంచెడు మాటలు వాదు పెరుగు
నెడల చల్లగా కార్యంబు నేర్పు మీర
తీర్చుకొను నాశ యడియాస తెలియు మీవు
మరియును
పాలు గాదొక సూదిని నేల పైన
నిలుపు నంతటి నేలయు నీయబోను
మార వెన్నఁడు మానోటి మాట లింక
పోర మాకీర్తి మిన్నంటి పెరుగు గాక
(మొదటి రెండింటిలో పూరణ గలదు. చివరి పద్యములో సమస్యాపూరణము లేదు)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచివటి పద్యం, చివరి పాదాన్ని కొంచెం మార్చితే (ఇప్పుడు కూడా సుష్టువే అయినా.)
రిప్లయితొలగించండి| పెనగ మాకీర్తి మిన్నంటి పెరుగు గాక
అని అంటే మరింత సొగసుగా ఉంటుందేమో. పరిశీలించండి.
బారును సేవించి మంచి బాటను పట్టెన్
రిప్లయితొలగించండి-------------------------
కోరిన కోర్కెల కోసము
పారాయణ జేసె నతడు పశుపతి మంత్రం
నేరుగ శివ లింగంబుల
బారును సేవించి మంచి బాటను పట్టెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
ధర్మరాజు శ్రీకృష్ణునితో :
01)
_____________________________________
పెరుగు చున్నవి కక్షలు ! - కరుణ నీవు
వెళ్ళి వివరించి చెప్పు మా - విన్నపాలు !
సంధి జేయుము యెల్లరు - చల్లగుండ !
మమ్ము వెన్నంటి కాపాడు - మయ్య కృష్ణ !
_____________________________________
నా పూరణ .....
రిప్లయితొలగించండికృష్ణుడు దుర్యోధనునితో ....
పాండవులపాలు నీ వివ్వకుండితేని
వైరభావమ్ము పెరుగును, భండనమున
చల్లచెమటలు గ్రమ్మగా శత్రువులకు
నడల, మరణభయమ్ము వెన్నంటునింక!
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
వృత్తంలో చేసిన రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది.
*
హనుమచ్ఛాస్త్రి గారూ,
చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
ధన్యవాదములు.
అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘వెన్నుడు’ శబ్దమే చింత్యం.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
‘అంతె కాకయ’..? ‘అంతియే కాక’ అంటే ?
‘బారును సేవించి..’ సమస్యకు పూరణ బాగుంది. అభినందనలు.
‘పశుపతి మంత్రం’ అని ముప్రత్యయాన్ని అనుస్వారంగా ప్రయోగించారు. అది వ్యావహారికంలోనే బాగుంటుంది. అక్కడ ‘భవు మంత్రమునే’ అంటే సరి!
*
రాజారావు గారూ,
అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
*
శ్యామల రావు గారూ,
మీ రెండు పూరణలు, ముక్తాయింపు పద్యమూ బహు బాగున్నాయి. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
‘చేయుము + ఎల్లరు’ అన్నప్పుడు ‘చేయు మెల్లరు’అవుతుంది. యడాగమం రాదు. ‘సంధ యొనరించు మెల్లరు ...’ అంటే సరి!
నేమాని పండితార్యా ! తప్పును సరిదిద్దినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిబడిలో చదువుకొన్న పాఠాలు మరుగున పడిపోతున్నయండీ.
శంకరయ్య గారికి నమస్కారములు. మీ సూచనలు శిరోధార్యములు.
రిప్లయితొలగించండికృ తజ్ఞుడను.
దుర్యోధనుడు కర్ణునితో అన్నట్లు:
రిప్లయితొలగించండిబలిమిఁ పాల్గోరి రధములు పాండవు లిక
పెరుగుట తరుగుట కొరకే పెంకివారు
చల్లగ తిని పడియుండక తల్లడిల్లు
ధర్మజాదులఁ వెన్నాడి తరిమి గొట్టు!
గురువుగారూ సూచనకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఇలా సవరించాను.
పెరుగుట కక్షలెవ్వరికి పెంపొనరించును కౌరవేశ నీ
వెరుగవె ధర్మజాదులకు వేగమె పాలిడి జేరదీయవే
కురియుచు చల్లగా మమత కూర్మిని వెన్నుని మాట చొప్పునన్
కరుగవె సంపదల్ జరుగ కయ్యము సాక్షిగ నుందు వెన్నగన్ .