6, డిసెంబర్ 2011, మంగళవారం

సమస్యాపూరణం - 551 (ఖరవాహన మెక్కి మురిసి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
         ఖరవాహన మెక్కి మురిసి కవి యూరేగెన్.

58 కామెంట్‌లు:

  1. నా పూరణ ....

    విరచించి గొప్పకావ్యము
    పురజన సన్మానమంది భూరియశమ్మున్
    స్థిరముగ గడించి గజశే
    ఖరవాహన మెక్కి మురిసి కవి యూరేగెన్.

    రిప్లయితొలగించండి
  2. విరిజల్లులు కుఱిపించిరి
    పరిపరి విధముల పొగడుచు పాడిరి జనులే
    జరిగెను వేడుకలట, శే
    ఖర! వాహన మెక్కి మురిసి కవి యూరేగెన్.

    వేడుకలట= వేడుకలు+అచ్చట

    రిప్లయితొలగించండి
  3. శర వేగముతో కవితలు
    బర బర వ్రాయంగ నేర్చు వానికి నేడే
    బిరుదము నిచ్చిరి "కవిశే
    ఖర" వాహన మెక్కి మురిసి కవి యూరేగెన్

    రిప్లయితొలగించండి
  4. మా ఊరికి వచ్చిన ఒక కవి గారు మిత్రులు చంద్ర శేఖరుల వారితో శివాలయమునకు వెళ్ళి,శివుని కొలిచి తర్వాత చంద్రశేఖరుల వారి యంత్ర వాహనములో ఊరంతా తిరిగేరని నాకందిన సమాచారము.

    హరహర శంభోశంకర
    సురవందిత కామవైరి శుభకర యనుచున్
    కరివైరిఁ గొల్చి విధుశే
    ఖర వాహన మెక్కి మురిసి కవి యూరేగెన్ !

    విధువు = చంద్రుఁడు

    రిప్లయితొలగించండి
  5. సరిలేని కావ్యఖండిక
    విరచించెనుపండితబుధవిజ్ఞులు మెచ్చన్,
    విరివిపొగడ్తల హయశే
    ఖరవాహనమెక్కి మురిసి కవియూరేగెన్.

    ( పొగడ్తలనే గుఱ్ఱాన్ని ఎక్కినాడని )

    రిప్లయితొలగించండి
  6. స్థిరముగ నుండని కుపితుడు
    వర పుత్రుడ నంచు దిరుగు వంద్యుడు తానౌ !
    గురువును యెంచని మూర్ఖుడు
    ఖర వాహన మెక్కి మురిసి కవి యూరేగన్ !

    రిప్లయితొలగించండి
  7. వర రత్న ఖచిత రమ్యా
    భరణమయము పొడిగ బలుక వరఖరమగు న
    ద్దిర యట్టి వర్ణముల వర
    ఖర వాహనమెక్కి మురిసి కవి యూరేగెన్

    రిప్లయితొలగించండి
  8. శ్రీ నేమాని మహాశయుల పూరణ అద్భుతం. క్రొత్త రకంగా పూరించవచ్చని సూచిస్తోంది.

    రిప్లయితొలగించండి
  9. డా.మూర్తి మిత్రులు అంతా రిమోట్ కంట్రోల్ తో టీవీ లో చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత జాగ్రత!!

    రిప్లయితొలగించండి
  10. మిత్రులకు మనవి: ఒకరకంగా ఈరోజు సమస్య కొంచెం క్లిష్టమైనది. "...శశిశేఖర...", "...ఇందుశేఖర...", "చంద్రశేఖర..." పదాలు వాడేటప్పుడు అర్థదోషం తగలకుండా కొంచెం జాగ్రత్త వహించాలి. దైవదూషణ జరిగే ప్రమాదముంది కాబట్టి. అదివరలో పండిత నేమాని మహాశయులిచ్చిన సూచనబట్టి పదములకు సాధారణ అర్థం అన్వయించుకోవాలి వీలయినంతమటుకు. విశేషార్థం వాడేటప్పుడు వివరించాలి, జాగ్రత్త వహించాలి. పైపదములు శివుడిని సూచిస్తాయిగాబట్టి కొంచెం గమనిక అవసరం అనుకొంటాను. విజ్ఞులు వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీగురుభ్యోనమ:

    కరిముఖునకు నుత్సవములు
    పురజనులకు మోదమొసగె పున్నమి వేళన్
    మురిపించగ తాన్ గజశే
    ఖరవాహన మెక్కి మురిసి కవి యూరేగెన్.

    కవి = మహాగణపతి (కవిం కవీనాం అంటారు కదండి. బ్రహ్మోత్సవాలలో శ్రేష్టమైన గజవాహనము పై నూరేగినాడని భావిస్తూ వ్రాశాను.

    మనతెలుగుగారూ ధ్న్యవాదములు. ఏదో ఊహలో వ్రాసి పోస్టు చేసినాను. తరువాత శశిశేఖరుడు అంటే శివుడు కదా అని గ్రహించి సవరించాలనుకున్నాను. గురువుగారిని అనుసరిస్తున్నను.

    రిప్లయితొలగించండి
  12. కరి వరదు కృపను సత్కవి
    వరునకు ఘనముగ ద్విచక్ర వాహనమమరెన్.
    హరి కృపఁ గని శశి శే
    ఖర! వాహన మెక్కి మురిసి కవి యూరేగెన్.

    రిప్లయితొలగించండి
  13. సరసుండగు కవి యొకనికి
    పరమోదారంబు యశము వచ్చుట యది నీ
    కరుణన్ గలిగెన్ శశిశే
    ఖర వాహన మెక్కి మురిసి కవి యూరేగెన్.

    రిప్లయితొలగించండి
  14. 2.
    వరకృతి రాల్చిన సొమ్మున
    మరి కష్టము మీద బండి మనసుపడి కొనెన్
    పురమదరగ దొదచేయు ము
    ఖరవాహన మెక్కి మురిసి కవి యూరేగెన్.

    రిప్లయితొలగించండి
  15. అయ్యా! రామకృష్ణారావు గారూ!
    మీ పూరణ చదివేను. నన్ను సందేహములో పడేసింది. హరి వరము నిచ్చేడు, కవి బండి కొన్నాడు అని శివునితో చెప్పుట ఎంతవరకు సబబు. ఆ వరమేదో శివుడు ఇవ్వడా? కాస్త వివరించండి.

    రిప్లయితొలగించండి
  16. సరసులు విచిత్ర వేషము
    ధరించు పోటీలలోన దా ప్రథముండై
    వరమతి బహుమతి గొనుటకు
    ఖరవాహనమెక్కి మురిసి కవి యూరేగెన్

    రిప్లయితొలగించండి
  17. 3.
    సరసి నొక నీటి కాకికి
    నరలోకము గూడ తిరుగు నాలోచన రా
    నరసి సమీపంబున గల
    ఖరవాహన మెక్కి మురిసి కవి యూరేగెన్.

    రిప్లయితొలగించండి
  18. నేమానివారు బహుమతి యాశపెట్టి కవిని నిజంగానే ఖరవాహనం యెక్కించేసారు. భళా.
    ఆహా, ఆశ యేమి చేయించదు!

    రిప్లయితొలగించండి
  19. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, డిసెంబర్ 06, 2011 2:58:00 PM

    ధర జను లాడెడి భాషా
    పరిణామము లెరుగ లేక ప్రాచీనాడం
    బర భాషా పద్య గతుల
    ఖర వాహన మెక్కి మురిసి కవి యూరేగెన్

    సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  20. అయ్యా శ్రీ రాజారావు గారూ!
    ప్రాచీన ఆడంబర పద్య గతులు ఎల్లప్పుడూ గౌరవము పొందేవే. వాటిని ఖర వాహనముతో ఎలా పోల్చ గలము?

    రిప్లయితొలగించండి
  21. మందాకిని గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కుఱిపించిరి’లో శకటరేఫం ఎందుకు? అక్కడ ఉండాల్సింది సాధురేఫమే.
    *
    హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నరసింహ మూర్తి గారూ,
    మధ్యలోకి చంద్రశేఖర్ ను లాగారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి గారూ,
    బాగుంది. మీరు ఏకంగా గాడిదపైననే ఎక్కించారు. అభినందనలు.
    అయితే అన్ని అవలక్షణాలుండీ ‘వంద్యుడు’ ఎలా అయ్యాడు? ‘గురువును + ఎంచని’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘గురువుల నెంచని’ అందాం.
    *
    పండిత నేమాని వారూ,
    అబ్రివేషన్ ఆధారంగా చమత్కారంగా పూరణ చెప్పి కవిమిత్రులకు ఒక క్రొత్తదారి చూపించారు. అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    రామకృష్ణారావు గారూ,
    మీరూ గన్నవరపు దారి త్రొక్కి చంద్రశేఖర్ ను సంబోధిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    శ్యామల రావు గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    ‘కవి యను నామంబు నీటికాకికి లేదా?’ అన్న భావాన్ని స్వీకరించిన మీ మూడవపూరణ చక్కగా ఉంది. పక్షులు పశువులమీద వాలడం పల్లెల్లో సర్వసాధారణంగా చూస్తుంటాం.
    *
    పండిత నేమాని వారూ,
    చింతా వారి పూరణలో ఉన్నది ‘శశిశేఖర్’ అనే వ్యక్తి సంబోధన. అక్కడ శివుని సంబోధనగా భావించకండి.
    *
    రాజారావు గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    ఇంతకీ గ్రాంధికం ఖర మంటారా?

    రిప్లయితొలగించండి
  22. "ధర జను లాడెడి భాషాపరిణామములు, ప్రాచీనాడంబర భాషా పద్య గతులు యెరుగలేక, ఖర వాహన మెక్కి, మురిసి, కవి యూరేగెన్" అని రాజారావుగారి దండాన్వయం అనుకుంటాను. అయనా అవన్నీ తెలియక పోయినంత మాత్రాన గాడిద నెక్కటం యెందుకండీ? అదికాక యెరుకలేక పోవటానికి మురవటం యేమిటని!

    రిప్లయితొలగించండి
  23. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, డిసెంబర్ 06, 2011 3:32:00 PM

    విరచించె పెద్ద నార్యుడు
    కరమరుదగు మనుచరిత్ర కమనీయముగా
    వర కృష్ణ రాయ నృప శే
    ఖర వాహన మెక్కి మురిసి కవి యూరేగెన్

    రిప్లయితొలగించండి
  24. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, డిసెంబర్ 06, 2011 3:49:00 PM

    గ్రామ్య మంచు బలికి గ్రామీణ తెలుగును

    కించ పరచి నీవు కించ పడకు

    జనుల భాష కున్న ఘనతను గుర్తించి

    గ్రాంధికాన్ని బుధుడ ! కాస్త విడుము




    గ్రాంధికమ్ము సతము గౌరవ నీయమే

    గతము దెలియ జేయు ఘనత వలన

    వ్యావ హారికమ్ము వాడక తప్పదు

    నేటి యవసరమ్ము- నిజము గనుము




    కవి వాడిన జన వాడుక

    ప్రవిమల పదముల ను గ్రామ్య పదము - లను - బుధుం

    డవి యాతని టేబిల్ పై

    బవళించిన కోశ మందు గన రావంచున్




    పదపడి యే భాష నయిన

    పద జాలము మార్పు జెందు బరికింపంగా

    పద కోశ మందు బ్రతుకవు

    పదములు జనపదము లందు బ్రతుకును దెలియన్




    వ్యాకరణ మేల ననగా

    ప్రాకటముగ వ్రాయ ,జదువ, బరి భాషింపన్

    సౌకర్యము సౌలభ్యము

    చే కూర్చుట కే- మరువకు చిత్తము లోనన్




    ఇది సాధు విది యసాధని

    పదముల నిపతించి పూర్వ భాషను తులగా

    పదపడి భావింప నగున ?

    కుదురున బ్రాచీన భాష కొలతకు నేడున్ ?




    జన మధ్య మందు నిలిచిన

    ఘన పదమే సాధువగును - కను మరుగై యా

    జన మధ్య నుండి తొలగిన

    పని లేని పదమ్మసాధు పరికింపంగన్




    గ్రాంధిక భోషాణములో

    బంధింతుర ? తెలుగు పద్య భారతి నకటా !

    మందికి దూరము జేతుర ?

    కొందరి సొమ్మైన యట్లు - కూడదు సుమ్మీ!




    ----- వెంకట రాజారావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  25. అరదములుగజాశ్వంబులు
    మరిపల్యంకికలునేల మాప్రియకవికం
    దు,రసజ్ఞ పాఠకచయ ము
    ఖర వాహన మెక్కి మురిసి కవి యూరేగెన్.

    రిప్లయితొలగించండి
  26. మిత్రులారా!
    గ్రాంధికమును విడనాడ వలెను, గ్రామ్యమునకు పెద్దపీట వేయవలెను అనే భావమును ప్రకటించుచూ శ్రీ రాజారావు పద్యములను వ్రాసేరు. వారికి గ్రామ్య భాష పైకల ప్రీతికి ప్రశంసలు. ఒక పవిత్రమైన ఈ వేదికపై గ్రాంధిక భాషను నిరసించుట ఎంతవరకు సమంజసము? మన తెలుగు భాషా అనే కల్ప వృక్షమునకు వ్యాకరణమే మూలము - ప్రాణము. అదిలేని భాష జీవ భాష అగునా? ఏదో నేను నాకు తోచిన అభిప్రాయమును వ్రాసేను. మరి మీరందరూ ఏమంటారో? మీ విజ్ఞతకే వదిలివేసితిని.

    రిప్లయితొలగించండి
  27. భాషను గురించిన యీ రకమైన చర్చ మా మావయ్యగారు శ్రీప్రసాదుగారికీ నాకూ మధ్య కొంత దీర్ఘంగానే సాగింది. దానిలో భాగంగా నేను వ్రాసిన వ్యాసాన్ని నా బ్లాగులో పెట్టానిప్పుడు. విజ్ఞులు పరిశీలించండి.
    http://syamaliyam.blogspot.com/2011/12/blog-post.html

    రిప్లయితొలగించండి
  28. నేమానివారికి నమస్కారం.
    మీ ఆధ్యాత్మరామాయణ కావ్య ప్రతి కోసం నా చిరునామా యిస్తానని మరచాను.

    TADIGADAPA SYAMALA RAO
    #103, Block - 10, HILL RIDGE SPRINGS, GACHIBOWLI
    HYDERABAD 500 032
    (cell: 98496 26023)

    ముద్రితప్రతి చదవటమే యెక్కువ సౌకర్యం. కొన్ని చిన్నచిన్న ప్రయాణాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు, సమయాన్ని కావ్యపఠనంతో నిజంగా సద్వినియోగం చేసుకోవచ్చును కూడా

    రిప్లయితొలగించండి
  29. కావ్యభాషనూ, వ్యావహారికభాషనూ కూడ సమదృష్టితో ఆదరించవలసిన పని తప్పకుండా ఉంది. అయితే, వ్వావహారికభాషాప్రయోగాలు చాలవరకు ప్రాచీన ఛందో విధానాలలో యిమడటం కష్టం. ఒకవేళ యిమిడ్చినా కృతకంగా ఉంటుంది. అటు గ్రాంధికశైలిని అభిమానించేవారికీ, ఇటు వ్యావహారికంకోసం ఆరాటపడేవారికీ కూడా. మార్గఛందాలతో ఇది ఘట్టి చిక్కే గాని, దేశి ఛందాలవద్దకు వచ్చేటప్పటికి పరిస్థితి వేరు. వాటికి వ్యావహారికం అతికినట్లు సరిపోతుంది. చాలా బాగా నడిపించవచ్చును. ఉదాహరణకు ద్విపదలు, ఆటవెలదులు వగైరా. మిత్రులు యెవరైనా గమనించారో లేదో. నేను అప్పుడప్పుడు కొన్న వ్యాఖ్యలను పద్యరూపంలో ప్రకటించటం కద్దు. దేశి ఛందమే వాడతాను. భాషపట్ల ఉదారంగానే ఉంటాను. ఈ రకమైన ఆలోచనాధోరణికూడా ప్రాచీనమే. తిక్కనగారు మాండలిక ప్రయోగాలకు పెద్దపీట వేసారు. శ్రీనాధుడు పలనాటి వీరభారత కృతిని తేలికగా ద్విపదగా వ్రాసాడు - పండితపామరసుబోధకం కావాలనే. వేమన ఆటవెలదిని యెన్నుకొన్నది కూడా ఈ కారణంగానే. మీ ప్రయత్నం మీరు చేయండి. సంతోషం. అలాగని గ్రాంధికం పనికిరాదు లాంటి వాదనలు అప్రస్తుతం.

    ఒక ఉదాహరణ. teluguvartalu.com/2011/11/28/కవి-ఆవిష్కరించిన-కిషన్-జ/ "కవి ఆవిష్కరించిన ‘కిషన్ జీ’ తల్లి గుండె ముచ్చట" అనే టపాలో ఉన్న వచనకవితకు ప్రతిగా నా కవిత మంజరీ ద్విపదలో వ్యాసాను. చిత్తగిచండి:

    వింతలలో కెల్ల వింతైన మాట
    నక్సలై టెవడైన నేల కొరిగాడొ
    తప్పక వినిపించు తప్పుడు మాట
    పౌరహక్కులపేర వీరంగమాడే
    మానవహక్కుల మాట ట్రిక్కులతొ
    కథలు చెప్పేవాళ్ళ కళ్ళ కేనాడు
    వీళ్ళ ప్రియమిత్రుల వీర మావోల
    మందు పాతరలకు మసియైన వాళ్ళ
    యిళ్ళలో తల్లులూ యిల్లాళ్ళు కూడ
    ఉండవచ్చన్నదే తోచదేనాడు
    ఈ నాడు తనబిడ్డ యైన మావోకు
    చావు మూడిందని బావురు మంటు
    విలపించు తల్లి ఆ బిడ్డ యిన్నాళ్ళు
    ఇతర తల్లుల బిడ్డ లెందర్ని చంపి
    విప్లవం పేరుతో విర్రవీగాడొ
    యెరుగదో యెరిగియే యిదిచాల గొప్ప
    పని యని సంతోష పడినదో గాని
    ఆ బిడ్డకే కాలమన్నది మూడి
    కూలిపోతే చాల గోల పెడుతోంది
    మావోల అమ్మల బాధలే కాని
    మావోల చేతిలో మరణించి నట్టి
    బిడ్డల్ని తలచుకు విలపించు యితర
    అమ్మల్ని చూడలేనట్టి సంఘాలు
    కేవలం మావోల కూట సంఘాలు
    మావోలకైతేను మనుషుల్ని చంపి
    గంతులేసే హక్కు కట్టబెడతారు
    యితరులకైతేను వీళ్ళ చేతుల్లొ
    చచ్చేందుకే మనిష జన్మయెత్తింది
    మీడియా వాళ్ళ సొమ్మేమిపోయింది
    హంగుచేసేఛాన్సు నసలొదులుకోరు
    ఖాకీలు చస్తేను కల్పించుకోరు
    ఒక మావొ చస్తేను ఉరకలేస్తారు
    జనులు వార్తలు చూసి చప్పళిస్తారు
    మామూలు వార్తలే మనకెందు కంటు
    పట్టించుకోకుండ బ్రతుకుతుంటారు

    రిప్లయితొలగించండి
  30. అలాగే మరొక ఉదాహరణ: "అక్కరకు రాని చెట్టు - ఆసరా ఇవ్వని కొడుకు" http://hemabobbu.blogspot.com/2011/11/blog-post_14.html అనే టపాకు నేను పంపిన వ్యాఖ్య:
    ఓ యమ్మ నీకథ గుండెల్ని పిండి
    కన్నీళ్ళు వలవలా కార్పించె నమ్మ
    కడుపున బంగారు కాయకాసింది
    పెద్దింటి వాళ్ళకే ముద్దువచ్చింది
    బిడ్డలెవ్వరు గాని యడ్డాల నాడె
    గడ్డాలు పెరిగాక కారు మన వారు
    చేయంది వచ్చిన చెట్టంత కొడుకు
    నా దారి నా దని నడచి పోయాడు
    ఊపి రున్నన్నాళ్ళు సాపాటు కొరకు
    కాయకష్టము నీకు కడతేర లేదు
    తండ్రి యానందము తలచని బిడ్డ
    తల్లి కష్టము మీద దయ లేని బిడ్డ
    అని నీవు తలచక ఆశీర్వదించి
    ఊరు కున్నావమ్మ చేసేది లేక
    గోడ దూకిన చెట్టు వీడని యెరిగి
    ఊరు కున్నావమ్మ చేసేది లేక
    దూరమై పోయినా దోష మెంచకను
    మమకార మన్నది మంచినే కోరు
    అందుకే సృష్టిలో తల్లిని మించి
    దైవమే లేదని భావించబడును

    ఇదికూడా మంజరీ ద్విపదే. అయతే భాష, యతులు వగైరాలపట్ల కొంత ఉదారంగా వ్రాసాను.

    ఈ ఉదాహరణలు ఇవ్వటంలో నాఉద్దేశం యేమిటంటే, వ్యావహారికప్రియులు చక్కగా అగ్రాంధికం వ్రాయగలిగేందుకు కూడా ఛందస్సు అవకాశం ఇస్తోందని చెప్పటానికే.

    రిప్లయితొలగించండి
  31. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________

    ఖరఖరుడు మింటనుండిన
    ఖరమగు మద్యాహ్నవేళ - ఖాంకుని కరుణన్
    ఖరణసుడును, వినయుడు నగు
    ఖరవాహన మెక్కి మురిసి,- కవి యూరేగెన్!
    _____________________________________
    ఖరకరుడు = సూర్యుఁడు
    ఖర = వేఁడిమిగలది
    ఖాంకుఁడు = సూర్యుఁడు(సూర్యనారాయణ యను వ్యక్తి)
    ఖరణసుడు = వాడిముక్కువాడు
    ఖరవాహనము = వేడెక్కిన వాహనము (open top jeep)

    రిప్లయితొలగించండి
  32. పద్యము లెనిమిది జెప్పిరి
    హృద్యముగా ' రావు' గారు హృదయపు లయనే
    పద్యము గ్రాంధిక మేనా
    పద్యములో గ్రామ్య మున్న బ్రతుకద యనుచున్.


    రాజా రావు గారూ ! మీ హృదయ స్పందనను చక్కగా చెప్పినారు. పద్యము సామాన్యునికి దూరమై పోతున్నదన్న మీ ఆవేదన లో అర్థ మున్నది.

    శ్రీ నేమాని వారు చెప్పినట్లు తరతరాలుగా గట్టి పట్టుతో గ్రాంధిక భాష తో పట్టుకు వస్తున్నపద్యము గ్రామ్యము తో పలుచన చేయ కూడదన్నపట్టు లోనూ అర్థమున్నది.

    లోపమంతా విద్యా వ్యవస్థ లోనే ఉన్నది. తల్లి తన పిల్లవాడు చేతి (గోరు) ముద్దలనుండి చెరుకు గడలు తిన గలిగే స్థాయికి ఎదగాలని కోరు కుంటుంది. కవి తన శ్రోత ద్రాక్ష పాకం నుండి నారికేళ పాకం వరకు ఆస్వాదించే స్థాయి లో వుండాలని కోరుకుంటాడు.
    కానీ నేటి విద్యార్థి ద్రాక్ష పండు కూడ తిన లేక "మిక్సీ" తో రసం చేసుకుని త్రాగే వాడుగా తయారైనాడు.
    ఉప్పు కప్పురమ్ము పద్యం అర్థము చెప్ప మంటే .. కప్పు "రమ్ము" లో ఉప్పు కలుపు కోవాలా అని ఆలోచించే స్థాయికి చేరు తున్నాడు.

    పండ్లను రసం గా చేసి ఇచ్చి వాడిని అక్కడే ఉంచాలా ?
    పండ్లను తిన గలిగే స్థాయికి వాడిని తయారు చేయాలా ?
    పండ్ల రసం ఇస్తూ పండు తినడం మీద ఇష్టం కలిగించాలా ?
    మధ్యే మార్గం విజ్ఞులు ఆలోచించాలి.
    భావ వ్యక్తీ కరణలో తప్పులుంటే మన్నిన్తురు గాక.

    రిప్లయితొలగించండి
  33. రాజారావుగారు పద్యాలలోనూ
    శ్యామలీయంగారు వచనంలోనూ (వ్యాసం) చెప్పినా
    విషయం ఒక్కటే !

    వ్యావహారికానికి కూడా కవిత్వంలో చోటుండాలనీనూ
    గ్రాంథికాన్నే పట్టుకు వేలాడవద్దనీనూ !

    గట్లైతేనే గందా జనాలకి సమఝయ్యేది !

    అర్థం జేసుకోండి సాములూ !

    రిప్లయితొలగించండి
  34. వసంత కిశోరుగారూ, నేను వ్రాసినవి మంజరీద్విపదలు. ద్విపదకు ప్రాస నియమం ఉంది. మంజరీద్విపదకు ప్రాస నియమం లేదు. రెండింటికీ అదే తేడా. మీరు జాగ్రత్తగాచూస్తే యతుల విషయంలో కూడా నేను పై వాటిలో ఖచ్చితత్వం పాటించలేదని గమనిస్తారు - ఇది నా పైత్యం. మంజరిలోనూ న్యాయంగా యతిని సరిగానే పాటించాలి.

    రిప్లయితొలగించండి
  35. శ్యామలీయంగారూ ! ధన్యవాదములు !
    నా వ్యాఖ్యల్ని ఉపసంహరించా !

    రిప్లయితొలగించండి
  36. పురమున నేగుచు ,పెద్దన
    వర కవి చంద్రు గని చక్రవర్తియె నగుచున్
    కరమూత మీయ గజశే
    ఖర వాహనమెక్కి మురిసి కవి యూరేగెన్.
    -----------------

    రిప్లయితొలగించండి
  37. గురువు గారు,
    శకటరేఫ గురించి తెలియకుండా వాడాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  38. "వెర్రికి వేయి తలలు" అన్నసామెతగా ఈ మధ్య కొన్ని టీవీషోలు, కావ్య రచనలు అట్లాగే ఉంటున్నాయి. వాటికి పేరడీగా నా పూరణ. పదజాలం కొంత కఠినంగా అనిపిస్తే అది సందర్భా నుసారమే గాని వేరొకటి కాదని మనవి.
    ఖరఖర ఘోర ధ్వన్యను
    కరణ పదోచిత కుకవికి ఖరసూనునకున్
    ‘ఖరకవి’ బిరుదమి డగనా
    ఖరవాహన మెక్కి మురిసి కవి యూరేగెన్!

    రిప్లయితొలగించండి
  39. పెద్దలందరూ చర్చిస్తున్నపుడు మాట్లాడటం కొంత చొరవే అయినా,
    నా మనసులోని మాట చెప్పటం భావ్యమని సాహసిస్తున్నాను.

    అందరికీ అర్థం కావాలని ఏ ఒక్క శాస్త్రమూ ఉన్నచోటే ఉండిపోదు. ఎంతో ఎత్తుకు ఎదిగిన, ఎంతో లోతులు చూసిన అన్ని శాస్త్రాలూ అందరికీ సంపూర్ణంగా అర్థంకాదు. కొంత స్థాయి వరకూ అందరికీ ఉపయోగం ఉండేటట్టు చూస్తారు. కానీ ఇంకా అధ్యయనం చేయగలిగినవాళ్ళే శాస్త్రాన్ని అభివృద్ధి చేయగలరు.
    ఇక్కడ ఎవరు గొప్ప అనేది సమస్య కాదు.
    అలాగే భాషాశాస్త్రము కూడా.
    భాష కేవలం మనోరంజకం/మానవుల మధ్య మాధ్యమం మాత్రమే కాదు. అంతకు మించి ఒక సంస్కారాన్ని ఇచ్చేది, ఒక జాతిని సమైక్యంగా ఉంచగలిగేది, ఒక జాతిని ఉత్తేజపఱచగలిగేదీను.
    భాషకు అంత శక్తి ఉండాలంటే అందర్నీ సమ్మోహపఱచే శక్తి వంటి ఆయుధాలు కూడ ఉండాలి. వ్యావహారికం మనుష్యులమధ్య మాధ్యమం గా ఎంత ముఖ్యమో గ్రాంధికం పైన చెప్పిన లక్ష్యాలు సాధించటానికి సర్వవిధాలుగా సన్నద్ధం అయిన భాష అంటే ప్రజలను శాశ్వతంగా ప్రభావితం చేస్తూనే ఉండగలిగేట్టుగా ఉండాలి. అందుకే నియమబద్ధమైన భాష కూడా అవసరం.
    మళ్ళీ మళ్ళీ మనవి చేసేదేమంటే
    వ్యావహారికం ఎంత ముఖ్యమో గ్రాంథికం కూడా అంతే ముఖ్యము.
    కొందరు పూర్వీకులు దీనిని చులకన చేయడం వల్ల ఈ తరం ఎంతో కోల్పోయింది.

    రిప్లయితొలగించండి
  40. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, డిసెంబర్ 06, 2011 9:02:00 PM

    గ్రాంధికానికి తగిన గొప్ప దనాన్ని ఇస్తూనే ఉన్నాం .వాడుక మాటలను' గ్రామ్యా'లని తీసి పారేయ వద్దని మనవి. గ్రామ సీమల లోనే తెలు గింకా బ్రతికి ఉంది .తెలుగు పద్యానికి తెలుగు సొబగు లద్ద మని మనవి .
    తెలుగు మాటలను (తుదకు పేర్లను కూడా వదల కుండా)సంస్కృతీకరించడం తో తెలుగు మాటలు చాలా మట్టుకు కనుమరుగయ్యాయి . వాడుకలో మిగిలి యున్న కొద్ది పాటి తెలుగు మాటలను కూడా' అసాధువులనీ ,గ్రామ్యాలనీ ,అంటరానివనీ ,తెలుగు పద్యాలలో వాడకానికి పనికి రావనీ - పండితులు భావించ డం తో తెలుగు గుండె కలుక్కు మనడం నిజం .
    తెలుగు మాటలు లేని తెలుగు పద్యాలు -
    తెలుగు దనాన్ని సంస్కృతీక రించిన తెలుగు పద్యాలు-
    సంస్కృత పద భూయిష్ఠమై (చదువు కున్న తెలుగు వారికి కూడా)పద్యంలో యేమి చెబుతున్నారో తెలియరాని తెలుగు పద్యాలు - కావాలా ?
    తెలుగు మాటాడే వాళ్ళందరూ తెలుసు కో గలిగే లాగా తెలుగు పద్యం ఉండాలా ?
    తెలుగు పద్యం సొగసు తెలుగు లందరికీ చేరువ కావాలనేదే నా కోరిక .
    సంస్కృత పదం లేని తెలుగు మాటాడనూ లేము ,రాయనూ లేము. కానీ వాడుకలో మిగిలి యున్న కొద్ది పాటి మాటలను పద్యాలలో పనికిరావంటే యెలా ?
    నా మాటల మాటున దాగి యున్న నిజాన్నిఒప్పుకో గల్గితే కొంత మార్పు వచ్చినట్లే .
    తిక్కన ,వేమన ,గురజాడ వేసిన బాటలో నడుద్దాం .తెలుగు పద్యాన్ని తెలుగువారికి చేరువ చేద్దాం .
    తెలుగు నాట బలుకు తియ్యని మాటతో

    తెలుగు పద్యము కొల్వు దీర వలయు

    తెలుగు జాతీయాల తియ్యం దనాలతో

    తెలుగు పద్యము కొల్వు దీర వలయు

    తెల్గు గ్రామీణుల తీరు తెన్నుల తోడ

    తెలుగు పద్యము కొల్వు దీర వలయు

    తెల్గు లోగిళ్ల వర్ధిల్లు వెల్గుల తోడ

    తెల్గు పద్యము కొల్వు దీర వలయు




    కూడి పండితుల్ దలలూచు కొరకె గాక

    తెల్గు లందరి కందంగ దివురు నటుల

    తెల్గు ముంగిళ్ల గెడన సందీప్తు లిడగ

    తెలుగు పద్యము తా గొల్వు దీర వలయు




    ---- వెంకట రాజారావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  41. అయ్యా చంద్రశేఖర్ గారూ!
    అహా! ఏమి మీ ఖారా ఖార్యము!
    ఖరఖరాఖర ఖరఖరాఖర ఖరఖరాఖర ఖర్ఖరా!
    ఘరఘరాఘర ఘరఘరాఘర ఘరఘరాఘర ఘర్ఘరా!
    భలా భలా

    రిప్లయితొలగించండి
  42. రాజారావు గారూ,
    ‘ఎదురైనచోఁ దన మదకరీంద్రము నిల్పి కేలూఁత యొసఁగి యెక్కించుకొనియె’ అన్న చాటుపద్యభావాన్ని వ్యక్తంచేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    దేవుళ్ళు చిత్రంలో భక్తుల శరణుఘోషనే శరంగా చేసి అయ్యప్ప రాక్షససంహారం చేసినట్లు మీరు రసజ్ఞపాఠక ముఖరాన్నే కవికి వాహనంగా చేసారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    అంత ఖరాఖండికగా చెప్పాక కాదంటామా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీరూ రాజారావు గారి మార్గాన్నే కవిని రాయల గజశేఖరవాహనం ఎక్కించారు. బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ ‘ఖరకవి’ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  43. గ్రాంధిక, వ్యావహారిక, గ్రామ్య భాషలపై కవిమితుల చర్చ ఆసక్తికరంగా జ్ఞానదాయకంగా సాగింది (సాగుతున్నది). ధన్యవాదాలు.
    కవిత్వంలో వ్యావహారికభాషకు స్థానం ఎప్పటినుండో ఉంది. ముఖ్యంగా పాటలు, గేయాలు, వచన కవిత్వం వ్యావహారిక భాషలోనే వస్తున్నవి. లక్షణబద్ధమైన పద్యాల్లో వ్యావహారిక భాషను ప్రయోగించడం కష్టమే. (శ్రీశ్రీ వంటి కొందరు అలాంటి ప్రయోగాలు చేసారు).
    ఏది వ్రాసినా వ్యావహారికమో, గ్రాంధికమో ఏదో ఒకటి ఉండాలి. రెంటినీ కలగాపులగం చేయరాదు కదా!
    ఇక గ్రామ్యశబ్దం గురించి. గ్రామీణుల భాష సహజసుందరమైనది. అది జీవద్భాష. ఇక్కడ ఆ శబ్దాన్ని గ్రామీణులు వాడే భాషగా కాక వ్యాకర్తలు చెప్పినట్లు ‘లక్షణవిరుద్ధంబగు భాష గ్రామ్యంబు’ అనే అర్థాన్ని స్వీకరించాలి.
    నిఘంటువు గ్రామ్యశబ్దానికి ‘గ్రామమందు పుట్టినది, గ్రామమందు నివసించింది, గ్రామమందు పెరిగినది’ అనే అర్థాలు ఒక పార్శ్వం. ఇక రెండవ పార్శ్వంలో చెప్పిన అర్థాలు ‘ మూఢం, తెలివిలేనిది, పామరం, నాగరకత లేనిది, అసభ్యము, అశ్లీలం, వ్యాకరణదుష్టం, తప్పుది, అసాధువు’ అనేవి. ఇక్కడ మనం ఈ రెండవపార్శ్వాన్నే స్వీకరించాలి.
    గ్రాంధిక, వ్యావహారిక భాషావాదాల వివాదాలు గిడుగు వారి కాలంనుండి ఎన్నో జరిగాయి. మనం క్రొత్తగా ఖండనమండనలు చేయవలసిన అవసరం లేదు.
    చర్చలో పాల్గొన్న మిత్రులందరికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  44. శ్రీనేమాని మహాశయా! ధన్యోస్మి. నా భావములోని మరియు పద ప్రయోగములోని శ్లేషని అర్థం చేసుకొని చక్కగా మీ ప్రశంసలో పొందుపరచినవిధానం చూస్తే నా పద్యం వెనక దాగిన కవిమనసుని పట్టిబంధించారనిపించింది. మరొక్కసారి శతకోటి వందనాలు.

    రిప్లయితొలగించండి
  45. వ్యావహారిక భాష గ్రాంధిక భాష చర్చ ప్రక్కన పెడితే తెలుగు నాడులో పర భాష ( ఆంగ్లము,హిందీ )ప్రమేయము లేకుండా ప్రభుత్వ కార్యాలయములలోను,ధనాగారములలోను ,పొగ బండ్ల స్థావరాలలోను తెలుగు భాషతోనే పనులు చేసుకో గలుగుతున్నామా ?
    అక్కడ వారిచ్చే వినతి పత్రాలలో నాకు తెలిసినంత వరకు తెలుగు భాష కనిపించదు. తెలుగు వారంతా యితర భాషలు నేర్చు కోవాలని భావించడములో యెక్కడో లోపము కనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  46. మా బండి చాలా లేటు.
    గురువుగారు చూపిన త్రోవలో

    పరుగిడె సరసపు వడిని సు-
    కర పదముల మత్తగజము కావ్యాటవిలో
    చిర యశము నొందె గజశే-
    ఖర వాహనమెక్కి మురిసి కవి యూరేగెన్.

    కవి మత్తేభ చందములో కావ్య రచన చేసినాడని చెప్పాలని నా ప్రయత్నం.
    ఎలా ఉందో గురువులు, విజ్ఞులు చెప్పాలి.

    రిప్లయితొలగించండి
  47. భాషాచర్చ ఆసక్తికరంగా సాగింది.
    నా మనసులోని మాటను వెల్లడించడానికి సాహసిస్తున్నాను.
    వాడుకలో ఉన్న పదాలను పద్యాలలో వాడినప్పుడు పండితామోదం
    కావు అని చెప్పినప్పుడు నాలో కూడా రాజారావు గారికి కల్గిన భావం అప్పుడప్పుడు కల్గుతూంటుంది.
    అలా అని నేను గ్రాంథిక భాషా ద్వేషిని కాను.

    రిప్లయితొలగించండి
  48. నేమాని పండితార్యా ! పూజ్యుడు పద ప్రయోగం గురించి.
    మహా భారతంలో ధర్మరాజు యాగం చేసిన సందర్భంలో ముందుగా ఎవరిని పూజించాలనే సందర్భంలో " ఆదిజుడైన బ్రహ్మ యుదయంబున కాస్పదమైన వాడు.... అనే పద్యంలో త్రిలోకపూజ్యుడని " అన్న చోట పూజ్య పద ప్రయోగం జరిగింది. మీకు తెలియదని కాదు. ఖచ్చితంగా పూజనీయుడు అనే అనాలా పూజ్యుడు అనరాదా అని సందేహం. భవదీయుడు.

    రిప్లయితొలగించండి
  49. ఆర్యా! సన్యాసిరావు గారూ! నమస్తే.
    మీకు అర్థమైన దారిలోనే సమాధానముంది.
    కవి హరి హర భక్తుడు.
    జీవితాన్ని నడిపేవాడు హరి.
    చక్కగా ద్విచక్రవాహనం మీద ప్రయాణం చేస్తున్నంత హాయిగా ఉంది.
    ఈ జీవిత యానం తరువాత కటాక్షించ వలసింది మోక్షమీయవలసినదీ పరమ శివుడే కదా!
    అందుకని, హరుని మోక్షమిమ్మని తాను అడుగ కుండానే నన్ను హరి కరుణించాడు. అని సంతోషించాడు. ఈ మాట విన్న శివుడు అడగకుండానే తనకు మోక్షమివ్వకపోతాడా అని భావించాడు కవి.
    ఇదండి సంగతి.
    నమస్తే.

    రిప్లయితొలగించండి
  50. మిస్సన్న గారూ మీ పద్యము గజగమనే ! అద్భుతముగా నుంది. తెలుగు పదాలు కవిత్రయముతో సహా మహా కవులంతా వాడేరు కదా ! నేను యిక్కడ ప్రతిదినము వినే ఆంగ్లము కూడా పుస్తకాలలో ఉండదు. కారణము వాడుక భాషలో దోషాలు ఉండటమే. మా ఉక్తలేఖినులు యిక్కడ మిగిలిన వైద్యుల కంటె నా ఆంగ్లమే మెరుగని చెబుతారు, కారణము మనము నేర్చుకొన్న ఆంగ్లము గ్రాంధికము. ఇక్కడ వారి వాడుక ఆంగ్లములో వ్యాకరణ దోషా లెక్కువ. వార్తాపత్రికలు దూరదర్శినులు ఆంగ్ల భాష ప్రమాణాల గురించి శ్రద్ధ తీసుకొంటాయి. మన తెలుగు పత్రికలు మనకు ' ఒచ్చి, యెల్లి,వుండు ' వంటి దోషాలు మనకు నేర్పుతున్నాయి.

    రిప్లయితొలగించండి
  51. కరమందున కావ్యముతో
    తరలుచు కేదార నాధు దర్శన మునకున్
    చరణము లాడక కంచర
    ఖరవాహన మెక్కి మురిసి కవి యూరేగెన్

    కంచర ఖరము = mule

    ...దీనిని దుష్ట సమాసమనినచో కంచర గాడిద (mule) కూడా గాడిదకూ అశ్వమునకూ సంయోగము వలన పుట్టినదేనని గ్రహించ మనవి...

    రిప్లయితొలగించండి
  52. జ్వరమున్ సైచుచు చనుచున్
    వరమౌ కేదారమందు పాటులు పడుచున్
    దరిజేరగ శంభునచట
    ఖరవాహన మెక్కి మురిసి కవి యూరేగెన్

    రిప్లయితొలగించండి